VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

ప్రజా నాయకుణ్ణికి అశేష జనవాహిని అభినందనల వెల్లువ వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వారి స్వగృహంలో మాజీ ఎం.పి,మాజీ ఎంఎల్.ఏ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కళ సాహితీ వేదిక,ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి రావులకు శుభాకాంక్షలు తెలిపారు.గాయకులు రామ్ రెడ్డి,సత్తార్ గారు పాటలు పాడి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రావుల చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు వారు మరింత ప్రజాసేవలో ఉండి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ కౌన్సిలర్ నందిమల్ల.శారదఅశోక్ “శ్రీ చౌడేశ్వరి వృద్ధాశ్రమం”లో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు ఎస్.వెంకటేశ్వరమ్మ,రాము , వృద్ధులు గతములో ఆశ్రమానికి రావుల చేయూత అందజేశారని వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలుస రమేష్ గౌడ్,వాకిటి.శ్రీధర్,నందిమల్ల.అశోక్,గంధం. బాలపీర్,గంధం.పరంజ్యోతి,విజయ్ కుమార్,గులాం ఖాదర్ ఖాన్,పలుస.శంకర్ గౌడ్,వేణు రెడ్డి,నందిమల్ల. రమేష్,గంధం.నాగరాజు,నాగనమోని.మన్నెం,నీలస్వామి,గులాం ఖాదర్ ఖాన్,ఉంగ్లం.తిరుమల్, వెంకట్ సాగర్,జోహెబ్ హుస్సేన్,సూర్యవంశం.గిరి,అరీఫ్,సయ్యద్. జెమిల్, ఫజల్,సమద్,పాషా,ఎర్ర.శ్రీనివాసులు,కుమార్, శిరీవాటి.శంకర్,ఖాదర్,వెంకటేష్ తదితరులు ఉన్నారు

Read More »

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి – క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేరుకోండి వనపర్తి ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలని, తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం స్థానిక కల్యాణసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి డ్రైవరు నేను చాలా బాగా నడిపిస్తాను అనే ధీమాతోనే ఉంటారని కానీ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నిర్లక్ష్యానికి మూల్యం ఎంతటిదో తెలుస్తుందన్నారు. దేశంలో ప్రతి 4 నిమిషాలకు రోడ్డు ప్రమాదం ద్వారా ఒకరి ప్రాణం పోతుందని తెలియజేశారు. అందుకే వనపర్తి జిల్లాలో ప్రమాదాల నివారణ కొరకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ పోలీసులు రోడ్డు పై తనిఖీలు నిర్వహించినప్పుడు పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అపోహ పడతారని, కానీ రోడ్డు భద్రత అనేది వాహనదారుల ప్రాణాలు కాపాడటానికే తప్ప ఇబ్బందులకు గురి చేయడానికి కాదనీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగి ప్రతి రోజు దేశంలో కనీసం 15 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జనవరి, 2026 నుండి పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల సమన్వయంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ ప్రాణం తో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడేవిధంగా వాహనం నడిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, డి.ఎస్.పి గిరిధర్, బసంతి ఫౌండేషన్ నిర్వాహకులు అజయ్ నాయుడు, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు, సి.ఐ లు, ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్లు మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Read More »

సామాన్యుల రెక్కల కష్టాలు సంపన్నులకు దోచిపెడుతున్న మోడీ: రమేష్ వనపర్తి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల రెక్కల కష్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సంపన్నులకు దోచి పెడుతున్నారని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ఆరోపించారు. మంగళవారం సిపిఐ ఆఫీస్ లో మాట్లాడుతూ.. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపకం నిత్యవసర వస్తువుల ధరలన్నీ చుక్కలంటాయని, సామాన్యుడు కొని తిని బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కష్టజీవుల వేతనాలు ఆదాయం ఆదాయం పెరగకపోగా ధరలు మాత్రం పెరిగాయని కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉప్పు పప్పు నూనెలు సబ్బులు దుస్తులు అన్ని వస్తువులు, కూరగాయల ధరలు సైతం పెరిగాయి అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదని విధిలేక వారి శ్రమను తక్కువ ధరకే అమ్ముకుంటున్నారన్నారు. తక్కువ వేతనానికే పనిచేస్తుండగా పని గంటలు మాత్రం ఎనిమిది నుంచి పదికి పెంచడం దుర్మార్గమన్నారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందని వనపర్తి కలెక్టరేట్ వద్ద నేడు ఉదయం 11 గంటలకు ధర్నా ఉంటుందని పోరాటాలతో మోదీ మెడలు వంచేందుకునియోజకవర్గ వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, లక్ష్మీనారాయణ, విజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

భూదాన భూములను అన్యాక్రాంతం నుంచి రక్షించాలి: అవినాష్ వనపర్తి దేశంలో రాష్ట్రంలో భూదాన భూములను అన్యాక్రాంతం నుంచి రక్షించి సర్వోదయం మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాష్ పిలుపునిచ్చారు. వనపర్తి లో రమేష్ అధ్యక్షతన సర్వోదయమండలి జిల్లా మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథులు అతిథులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాష్, జాతీయ ట్రస్సీ కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ షేక్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గాంధీ స్ఫూర్తితో ఆచార్య వినోబావే భూదాన ఉద్యమం ప్రారంభించి దేశంలో 14 ఏళ్ళు పాదయాత్ర చేసి 46 లక్షల ఎకరాలను సేకరించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల 40 వేల ఎకరాలు ఉండగా తెలంగాణలో 1లక్షా76 వేల ఎకరాల భూదాన భూములు ఉన్నాయన్నారు. అందులో కొంత భూమిని పేదలకు పంచారని, పలుచోట్ల భూదాన భూములు అన్యాక్రాంతమయ్యాయి అన్నారు. భూములు ఇచ్చిన వారి వారసులు కూడా భూదాన భూములను పేదల నుంచి దౌర్జన్యంగా ఆక్రమించారన్నారు. తెలంగాణ రాష్ట్రం పోచంపల్లిలో రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూములను భూదానం చేసి పూర్తి నిచ్చారన్నారు. హైదరాబాద్ లో కోట్ల రూపాయలు విలువ చేసే భూదాన భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. భూదాన యజ్ఞ బోర్డుతో కొందరు మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ 33 జిల్లాల్లో భూదాన భూములను గుర్తించి వాటిని పేదలకు పంచేందుకు జిల్లా కమిటీలు గ్రామ గ్రామాన కమిటీలు వేసి పోరాడాలన్నారు. రక్తం చుక్క పడకుండా వినోబాభావే భూములను సేకరించారని, అవి అన్యాక్రాంతం కావటం బాధాకరమన్నారు. వనపర్తి జిల్లాలో 4450 ఎకరాల భూదాన భూములు ఉన్నాయని చాలా మేరకు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. సర్వోదయం అంటేనే అందరి అభివృద్ధి సంక్షేమం సమానాక్కులు కల్పించడం అన్నారు. జిల్లాలో భూములు కాపాడేందుకు జిల్లా కమిటీ కృషి చేయాలని అవసరమైతే రాష్ట్ర జాతీయ కమిటీల సహకారం కూడా తీసుకోవాలన్నారు. జాతీయ ట్రస్ట్ తెలంగాణ ఇంచార్జ్ షేక్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్, కళావతమ్మ, శ్రీదేవి, జయమ్మ, గోవిందమ్మ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడిగా రమేష్జిల్లా మహాసభల్లో సర్వోదయమండలి జిల్లా అధ్యక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా రాబర్ట్, ప్రతినిధిగా గోవిందమ్మ, ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, సహాయ కార్యదర్శి గా లింగన్న, కోశాధికారిగా లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలుగా శ్రీదేవి, కార్యదర్శిగా జయమ్మ, యువజన సంఘం అధ్యక్షుడిగా కే మహేష్, కార్యదర్శిగా వంశీ, కమిటీ సభ్యులుగా శ్రీరామ్ కమలమ్మ యూసఫ్ సత్యమ్మ లని అనుకున్నారు.

Read More »

సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత పని మీద సబ్ రిజిస్టర్ కార్యాలయాన్నికి వచ్చిన సందర్భంగా రిజిస్టార్ చంద్రశేఖర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కార్యాలయ పనితీరు గూర్చి వివరించి ఇంకా కొన్ని మౌలిక వసతులు అందుబాటులోకి రావాలని వివరించారు. రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ ఆధ్వర్యములో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డినీ సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హంగులతో రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతమైన కార్యాలయాన్ని నిర్మిస్తామని అన్నారు. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రైటర్స్ మరియు వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెంట కూతురు తేజస్విని , నాయకులు వాకిటి.శ్రీధర్, నందిమల్ల అశోక్,సయ్యద్.జహంగీర్,బాగ్యరాజ్,అరుణ్ యాదవ్,ఇమ్రాన్,ముని కుమార్,అలీమ్ తదితరులు ఉన్నారు.

Read More »

యువత చెడు వ్యసనాలకు బానిసలుగా కాదు…చెడు రాజకీయాలను చెండాడే సైనికులవ్వాలి వనపర్తి దేశ గతిని మార్చే యువత శక్తి చెడు వ్యసనాలకు బానిసలుగా కాకుండా నీతి నిజాయితీ సేవా దృక్పథానికి కలంఖంగా మారిన చెడు రాజకీయ వ్యవస్థను చెండాడే సైనికులు దేశ యువత కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం అమరచింత మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వనపర్తి జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు మాట్లాడుతూ:- పాలకులు దశాబ్దాల తరబడి యువతను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా మాత్రమే ఉపయోగిస్తూ యువత ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత యువత శక్తి యుక్తులు నిర్వీర్యం చేసే విధానాలను అవలంబించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.60 శాతం పైగా యువత ఉన్న ఏకైక దేశం భారత్ అని అన్నారు.యువత నైపుణ్యాలను గుర్తించి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా బానిసలుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని 12 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కులం,మతం,ప్రాంతీయ విద్వేషాలతో యువత మెదల్లను కల్మషం చేస్తున్నారని అన్నారు.జాతీయ సమగ్ర యువజన విధానం ప్రకటించాలని, యువతకు ఎలాంటి బ్యాంకు షూరిటీలు లేకుండా స్వయం ఉపాధి రుణాలు అందివ్వాలని, ప్రతి నియోజకవర్గంలో నూతన పరిశ్రమలు నెలకొల్పి స్థానికుల యువతీ యువకులకు 80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులైన విద్యా వైద్యం ఉపాధి హక్కులకై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్,ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి.కుతూబ్, ఏఐవైఎఫ్ నాయకులు నరసింహ, మహిముద్,శ్రీకాంత్,రవి, చంద్రయుడు,నరేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వ పథకా ప్రయోజనాన్ని ప్రతి ఇంటికి చేరేలా ప్రచారం నిర్వహించాలి వనపర్తి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా బలమైన సంకల్పంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ మల్లు రవి చేపట్టిన రథయాత్ర సోమవారం వనపర్తి జిల్లాలోకి జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది.  ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి పెబ్బేరు పట్టణంలో బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణం చేస్తూ పెబ్బేరు పట్టణంలోని వీధుల గుండా పర్యటించారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి ఎంతగానో తోడుపాటునందిస్తుందని  ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి అండగా నిలబడుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం  వడ్డీ లేని రుణాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు చైర్మన్లుగా పాటు పాఠశాలల్లో విద్యార్థులకు వంట ఏజెన్సీలుగా మహిళలే ఉండటం స్కూల్ విద్యార్థులకు మహిళలే స్కూల్ డ్రెస్లను కుట్టించి ఇవ్వడం ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేయడం మహిళా భాగస్వామ్యంతో సోలార్ ప్లాంట్ లో ఏర్పాటు మహిళలకు డీజిల్ బంకుల ఏర్పాట్లు రైతు రుణమాఫీరైతు భరోసా భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా సన్న వడ్లకు బోనస్ అన్నదాతలకు రాయితీపై వ్యవసాయ ఉపకరణానికి సంబంధించిన అన్ని పనుముట్ల పంపిణీతమ సొంత ఇంటి కల నెరవేరక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు రేషన్ కార్డుల పంపిణీ ఉచిత సన్న బియ్యం పంపిణీ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు పెబ్బేరుల 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలలో ప్రతి వార్డులో సిసి రోడ్ల నిర్మాణం లాంటి అనేక పథకాలను చేపట్టి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇట్టి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మన నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు చేపట్టిన రథయాత్ర కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లాలలో ముగించుకుని నేడు వనపర్తికి రావడం ఆనందదాయకమని ఆయన అన్నారు. కార్యక్రమంలో  నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మండలాధ్యక్షులు యాపర్ల రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి,  జిల్లా డిసిసిబి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, బోయల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, గోపాల్పేట మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు సత్యశీల రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగంధర్ రెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి,  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

ఎ ఎస్ ఐ సుబ్బరాజు సేవలు అభినందనీయం వనపర్తి పోలీస్ శాఖలో దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎ ఎస్ ఐ సుబ్బరాజును సాహితీ కళా వేదిక సభ్యులు సోమవారం వనపర్తిలో ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ పనిని దైవంగా భావించి వృత్తి ధర్మాన్ని చిత్త శుద్ధితో నిర్వహించారని, ఏనాడు విధుల పట్ల నిర్లక్ష్యం చూపలేదని కొనియాడారు.మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన తన ఉద్యోగ జీవితంలో ఉత్తమ వ్యక్తిత్వంతో బాధ్యతాయుతంగా పని చేశారని అన్నారు.ఆయన పోలీస్ శాఖకు అందించిన సేవలకుగాను ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు జిల్లా యంత్రాంగం పక్షాన ఉత్తమ సేవా పురస్కారాలు కూడా అందుకున్నారని వివరించారు. కళా వేదిక ప్రతినిధులు సుబ్బరాజు దంపతులను శాలువ జ్ఞాపికలతో సత్కరించారు. ఈనాటి కార్యక్రమంలో ఆర్డి ఎస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్,ప్రధానోపాధ్యాయులు గణేష్ కుమార్,వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్,బండారు శ్రీనివాస్, ఓమేష్,రుకునందన్,ఎడ్విన్,మింటా రోస్ థామస్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మేఘన హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మేఘన ఆసుపత్రిని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిన దిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి ఆస్పత్రులు ఎంతో అవసరమని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వచ్చే వారికి సకాలంలో వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వైద్యాన్ని వ్యాపార భావంతో కాకుండా సేవా భావంతో చేయాలని భగవంతుడి తర్వాత భగవంతుండ చూసేది కేవలం వైద్యులను మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తో సాధికారత : NFIW వనపర్తి చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం తోనే మహిళా సాధికారత సాధ్యమని NFIW జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి గీత అన్నారు. గురువారం వనపర్తి జిల్లా ఆఫీసులో ఎన్ఎఫ్ఐడబ్ల్యు 72వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.NFIW జెండాను ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ ఆవిష్కరించారు. నేతలు మాట్లాడుతూ. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో కేవలం 33% రిజర్వేషన్ కు చట్టం చేశారని, బిజెపి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో కలిపి పార్లమెంటులో బిల్లు పెట్టి అమలు కాకుండా అడ్డు కొట్టిందని, విడిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. బిజెపి విధానాలు మాటల్లో మహిళలకు అనుకూలంగా చేతల్లో వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు.దేశంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హత్యాచారాలు, హత్యలు, అకృత్యాలు, వేధింపులు నానాటికి పెరుగుతున్నాయని, చాలా తక్కువ కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతుండటంతో నేరాలు పెరిగిపోతున్న అన్నారు. మహిళలు సంఘటితమై నిందితులకు శిక్షలు పడేదాకా పోరాడాలి అన్నారు. బండి భగీరథ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఇతర పార్టీలు ప్రజా సంఘాలు పోరాటంతోనే అరెస్టు చేశారన్నారు. లింగ వివక్ష తగ్గలేదని ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తున్నారని వారిని పుట్టనివ్వాలి ఎదగనివ్వాలి చదవని ఇవ్వాలని, మగ పిల్లలకు దీటుగా, కొన్నిసార్లు చదువు వివిధ రంగాల్లో వారి కంటే బాలికలు పై చేయి సాధిస్తున్నారన్నారు. మగ పిల్లల కంటే ఆడపిల్లలే పుట్టింటికి మెట్టినింటికి గౌరవం చేస్తున్నారన్నారు. ఆస్తుల కోసం మగ పిల్లలు తల్లిదండ్రులను వేధిస్తున్నారని ఆడపిల్లలు బాధ్యతగా తల్లిదండ్రులను పోషిస్తున్నారని ఈ విషయం పెద్దలు గ్రహించాలన్నారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా మారోద్దని అన్యాయం జరిగినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాడినప్పుడే హక్కులు దక్కుతాయని, న్యాయం జరుగుతుందన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జెండా కింద గ్రామ గ్రామాన మహిళలు ఏకమై మహిళలపై ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.NFIW జిల్లా ఇన్చార్జ్ రమేష్,NFIW జిల్లా ప్రధాన కార్యదర్శి గీత, వనపర్తిపట్టణ కో కన్వీనర్ శిరీష, నేతలుశ్రీదేవి, వెంకటమ్మ, సాయి లీల, నాగమణి, వార్డు మెంబర్ సుజాత, శాన్వి, బబ్బి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

Scroll to Top