VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి ని నియమించడం హర్షించదగిన విషయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడం, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతమైన కార్యాచరణ అమలు అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డా. జి. చిన్నారెడ్డి గారి అనుభవం, పరిపాలనా దక్షత రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో కమిటీ సమర్థవంతంగా పనిచేసి రైతాంగానికి, ప్రజలకు అండగా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు

whatsapp image 2026 07 19 at 6.43.57 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top