ప్రైవేటు పాఠశాలల దోపిడీ.. తనిఖీలు చేసి కేసులు పెట్టాలి : రమేష్ వనపర్తి జిల్లాలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తనిఖీలు చేసి పాఠశాలల దూపిడిని అరికట్టాలని డీఈఓ ఆఫీస్ సూపరిండెంట్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలు దోచుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎల్కేజీ కి రూ. 20వేల నుంచి రూ. 40 వేలు, ఆరవ తరగతి నుంచి 10 వరకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వసూలు చేస్తున్నారన్నారు. వేర్వేరు కంపెనీల పేరు చెప్పి పాఠ్యపుస్తకాలను పాఠశాలల్లో అధిక ధరలకు విద్యార్థులకు అంటగడుతున్నారని, పాఠశాల యూనిఫారాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. పలు పాఠశాలలకు అనుమతులు లేవని, ప్రభుత్వం నిర్దేశించిన సౌకర్యాలు క్రీడామైదానాలు గదులు లేకున్నా ఫీజులు మాత్రం తగ్గించటం లేదన్నారు. పాఠశాలలను డీఈవో తనిఖీ చేసి దోపిడీ చేస్తున్న పాఠశాలలపై కేసులు పెట్టాలన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేయకుండా ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఫీజుల పట్టికను పెట్టాలని జిల్లా కలెక్టర్ ఫీజులను నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోపిడీ ఇలాగే కొనసాగితే విద్యార్థులను సమీకరించి పాఠశాలల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, ఉదయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
కలకొండ రమేష్ చంద్ర గారిని సన్మానించిన మాజీ మంత్రి వనపర్తి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కలకొండ రమేష్ చంద్ర ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవలో వారి పాత్ర మరింత విస్తరించాలని అభిలషించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గారి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, ప్రేమ్ నాథ్ రెడ్డి, నరసింహ, చిట్యాల రాము, ఎల్ అశోక్ సాయి ప్రసాద్ శెట్టి మంజుల గట్టు శశి వై వెంకటేష్ బెల్లం రాజు , బద్రి తోట శీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి వనపర్తి వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.ఈ క్రమంలో 10 గ్రామ పంచాయతీ (GP) భవనాలు ఒక్కో దానికి రూ.20 లక్షలు మొత్తం రూ. 2 కోట్లు, 11 అంగన్‌వాడీ కేంద్రాలు: 132.00 లక్షలు (ఒక్కో దానికి రూ ల.12 లక్షలు) , 30 విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాలు రూ. 300.00 లక్షలు (ఒక్కో దానికి రూ.10 లక్షలు), 8 వ్యవసాయ గిడ్డంగులు (Storage Godowns) రూ 240.00 లక్షలు (ఒక్కో దానికి రూ.30 లక్షలు), మహిళా శక్తిభవనం: రూ.20.00 లక్షలు, 2 వర్క్‌షెడ్ భవనాలు: రూ.20.00 లక్షలు (ఒక్కో దానికి రూ.10 లక్షలు), మొత్తం మంజూరైన నిధులు: రూ.9,12,00,000/- (9 కోట్ల 12 లక్షల రూపాయలు), మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతన్నలకు అండగా, మహిళా సాధికారతకు గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఈ నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కొంకనువానిపల్లి పాఠశాలను అప్గ్రేడ్ చేయాలి వనపర్తి అమరచింత మండలం కొంకన్వాని పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అప్గ్రేడ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదవ తరగతి నుండి ఏడో తరగతి వరకు పెంచాలని బుధవారం పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పాఠశాలను అప్డేట్ చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని కుతుబ్ హెచ్చరించారు.
యువత స్వయం ఉపాధి వైపు మొగ్గు చుపాలి వనపర్తి శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు జలీల్ స్వాంతంగా కిరణం జనరల్ స్టోర్ ప్రారంభం చెసుకున్న సందార్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ , శ్రీరంగపూర్ మండలం BRS నాయకులు పృద్విరాజ్ లు జలీల్ గారిని సన్మానించారు. యువత అందరూ కూడా జలీల్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. పోటీ తత్వము పెరిగిన ఈ రోజులలో అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ధోరకడం కష్టతరంగా మారిందని, అందుకే యువత స్వశక్తిపై నిలబడాలని సూచించారు. కావున యువత స్వయం ఉపాధి వైపు రావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పర్వతాలు,గంధం విష్ణు , తధితరులు పాలుగొన్నారు
రవీంద్ర భారతి బీసీ ముస్లిం సన్మాన సభ వనపర్తి హైదరాబాదు రవీంద్ర భారతి లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ముస్లిం సన్మాన సభకు వనపర్తి జిల్లా నుండి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అతిథిగా హాజరయ్యారు. రవీంద్ర భారతి లో జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా మాజీ డిజిపి పూర్ణచందర్ రావు , తొలివెలుగు రఘు , అమిత్ భాషా , మాజీ ఎమ్మెల్సీ సయ్యద్ భాషా , డా” సతీష్ యాదవ్ శ్రీనివాస్ సాగర్ తదితరులు హాజరై ముస్లిం బీసీ కళాకారులు పాడిన పాటలను, ఆటలను, చూసిన తర్వాత ఉమ్మడి జిల్లాలు అయిన ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల నుండి వచ్చిన సర్పంచ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల నుండి వచ్చిన ముస్లిం నాయకులు, బీసీ నాయకులు, సర్పంచులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జమ్ములమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృగశిర కార్తీ సందర్భంగా 23వ వార్డులో జమ్ములమ్మ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతములో దేవాలయ నిర్మాణాన్నికి 5లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధికి కృషి చేశామని భవిష్యత్తులో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామని అన్నారు. పట్టణ ప్రజలు జమ్ములమ్మ దేవత ఆశీషులతో పాడిపంటలతో సుఖసంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. నిరంజన్ రెడ్డి కి నాయకులు మెకానిక్.శ్రీను,ఉంగ్లం. తిరుమల్ ,నందిమల్ల.శారదా అశోక్ ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల.అశోక్ సబ్బిరెడ్డి.యుగంధర్ రెడ్డి, శ్రీనివాస్పూర్.నరసింహ,వీర సాగర్,సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, పెద్దముక్కల.రవి,ఇమ్రాన్,మునికుమార్,చెన్నారెడ్డి, సబ్బిరెడ్డి. రవీందర్ రెడ్డి, ఎంట్ల.శ్రీను, గౌనికాడి.యాదయ్య,తోట.శ్రీను,కుమ్మరి.రామస్వామి తదితరులు ఉన్నారు.
వ్యవసాయ కార్మిక మహాసభలు జయప్రదం చేద్దాం వనపర్తి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నేల 20న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేస్తూ భారీ బహిరంగ నిర్వహించడం జరుగుతుంది వనపర్తి జిల్లా కార్మిక వర్గం వెయలాది మంది కార్మికులు పాల్గోని జయప్రదం చేయాలనీ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన CITU జిల్లా విస్తృతస్థాయి సమావేశాము CITU జిల్లా అధ్యక్షులు R N రమేష్ అధ్యక్షతన CITU జిల్లా కార్యాలయంలో ప్రారంభము అయుంది ఈ సమావేశంను ఉద్దేశించి CITU జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, CITU జిల్లా అధ్యక్షులు R N రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన విబి-జి రామ్ జి చట్టం వ్యవసాయ కార్మికులకు గొడ్డలిపెట్టుగా ఉందని అన్నారు. రెండు రెక్కలే ఆస్తిగా, చెమట చుక్కలే పెట్టుబడిగా, గొడ్డు చాకిరి చేసి మొత్తం సమాజానికి తిండి అందిస్తున్న శ్రామిక వర్గం, వ్యవసాయ కార్మికులు అని అన్నారు. అలాంటి వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో కార్మికులను వ్యవసాయ కార్మికులను మోసం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి అణిచివేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి, వ్యవసాయ కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకి ఈ దేశ సంపదను కట్టబెడుతున్నారు అన్ని అన్నారు. ఈ దేశంలో కార్మికులకి వ్యవసాయ కార్మికులకు తిండి, బట్ట, ఇల్లు, సాగు భూమి, కనీస వేతనం, ఉపాధి, విద్య, వైద్యం, అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 20న ఉమ్మడి మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ టౌన్ హాల్ నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు వేలాది మంది కార్మికులతో ఎర్రజెండా దండు భారీ ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తారని, ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి కర్మిక వర్గం, వనపర్తి జిల్లా కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పుట్ట ఆంజనేయులు సునీత సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రాజు, బాలగౌడ్, జిల్లా నాయకులు D కురుమయ్య, A బుచ్చన్న, వెంకటయ్య, నందిమాళ్ళ రాములు, జానకి రాముడు, చెన్నమ్మ, దేవమ్మ, సత్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగ కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 77 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యా వ్యాపార మాఫియా దోపిడికి అడ్డుకట్ట వేయాలి వనపర్తి రాజ్యాంగ ప్రాథమిక హక్కులో భాగమైన ఉచిత విద్యను అంగడి సరుకుగా మార్చి కొత్త కొత్త టెక్నాలజీ పేర్లతో పవిత్రమైన విద్య వ్యవస్థను స్వార్థపూరిత కుట్రలతో విద్యను వ్యాపారం చేసిన విద్య మాఫియా దోపిడీలపై ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతూబ్ డిమాండ్ చేశారు. ఆదివారం అమరచింత మండల కేంద్రంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)అమరచింత మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం.డి కుతూబ్ మాట్లాడుతూ కేజీ నుండి పేజీ వరకు ఉచిత విద్య అనే పాలకుల నినాదం కేవలం మాటలకే పరిమితం అయ్యాయని, విద్య హక్కు చట్టంలోని సూత్రాలు, ఫీజుల నియంత్రణ జీవోలు కేవలం పరిపాలన శాఖల పేపర్లకు మాత్రమే పరిమితం చేశారని మండిపడ్డారు.నాణ్యమైన విద్య పేరుతో ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్డు అదుపు లేకుండా ఫీజులు దండుకుంటున్న విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతు వేసవిలోనే ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులకు టార్గెట్లు పెట్టి ఇంటింటా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై, ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా గెలుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎన్ని విద్య సంస్థలు సీజ్ చేశారో తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు జలగళ్ల ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఏ ఒక్క ప్రైవేటు విద్యా సంస్థ నడవడం లేదని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు దోపిడీ ఆపకపోతే ప్రత్యక్ష దాడులకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మహమూద్,దయాకర్, అరుణ్,మల్లేష్ యాదవ్, శ్రీకాంత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.