VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా “సర్”జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తూ ఈరోజు బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి పెద్దమందడి మండలంలో విస్తృతంగా పర్యటించారు. చిలుకటోనీపల్లి, బలీదుపల్లి, వెల్ టూరు,మదిగట్ల, మోజర్ల,చిన్న మందడి,పెద్ద మందడి, జగత్పల్లి గ్రామాలలో ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి బి.ఆర్.ఎస్ శ్రేణులు,బి.ఎల్. ఓలు అర్హులైన ఓటర్స్ తుది జాబితాలో ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు కార్యకర్తలు ప్రతిరోజూ సర్ ప్రక్రియలో పాల్గొంటూనే ప్రజా క్షేత్రంలో సమస్యలు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వెంట వాకిటి శ్రీధర్ ,జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి,వేణు యాదవ్,కుమార్ యాదవ్,అశోక్,సేనాపతి,పురుషోత్తంరెడ్డి,కురుమూర్తి,శ్రీనివాసులు,మొగిలయ్య,వెంకటన్న,ఆంజనేయులు,నరసింహ, హనుమంత్, బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

whatsapp image 2026 07 18 at 4.33.56 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top