సర్”(ఓటర్ జాబితా సవరణ)సామాజిక బాధ్యత
వనపర్తి
మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి సర్ ” ప్రక్రియను వేగవంతం చేయాలని బి.ఆర్.ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తూ వనపర్తి మండలములో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా చందాపూర్, దత్తాయిపల్లి,శ్రీనివాసపూర్,చిన్నగుంటపల్లి, అప్పాయిపల్లి, నాగమ్మ తండా, కాసింనగర్ , తదితర గ్రామాలలో ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి బి.ఎల్. ఓలకు బి.ఆర్.ఎస్ శ్రేణులకు పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా “సర్ “ప్రక్రియ పొడిగింపు విషయములో రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ కృషి చేసిందని మన శ్రేణులు అప్రమత్తమై అర్హులైన ఓటర్స్ తుది జాబితాలో ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వెంట మాణిక్యం, రఘువర్ధన్ రెడ్డి,ధర్మా నాయక్,మాధవ్ రెడ్డి,దేవర్ల.నరసింహ,మహేశ్వర్ రెడ్డి,నరేష్, విష్ణు యాదవ్, కుమ్మరి సత్యం, గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు ఉన్నారు.
