VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

రాష్ట్రంలోనే వనపర్తిని మోడల్‌గా తీర్చిదిద్దుతా వనపర్తి రాష్ట్రంలోనే వనపర్తిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. ప్రజాపాలన 99 ప్రగతి ప్రణాళిక వార్డు సభ కార్యక్రమాన్ని గురువారం కర్రెమ్మ గుడి వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేయకముందే తాను ప్రజలకు సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకటించానని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి ఆస్తులు కూడగట్టుకోవడానికి రాలేదని, ప్రజలకు సేవకుడిగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. అధికారం ఉందనే అహంకారంతో పేదల భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ట్రస్ట్ భూములు, గుట్టలను ఆక్రమించుకోవడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యమని ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సహకారంతో వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెడతామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికై అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7 2023న ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే మొదటగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మొదటి సంతకం చేసిందన్నారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటివరకు 30.29 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ధర చెల్లించడం జరిగింది అన్నారు. ఆరోగ్య భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు పై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వము విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, అల్పాహారం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 6000 మంది కొత్త టీచర్లకు నియామకం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో రూ. 207 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి మంజూరీ చేసినట్లు చెప్పారు. ఐ.టి. టవర్, పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సి.సి రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. త్వరలో వనపర్తి మహిళలకు డీజిల్ బంక్ మంజూరు కాబోతుందని, 546 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, ప్లాట్లు లేని నిరుపేదలకు 1000 ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వానికి తాను ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా అన్ని పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పుర కౌన్సిలర్లు శరవంద, వెంకటేశ్వర్లు, పాకనాటి కృష్ణ, మురళి సాగర్, నిర్మలమ్మ, అయేషా సిద్ధిఖ, సౌమ్య, ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, మెప్మా, సానిటేషన్ ఇన్స్పెక్టర్, పలువురు పాల్గొన్నారు.

Read More »

ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ బలమైన ప్రధానా: సిపిఐ వనపర్తి ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న నరేంద్ర మోడీ బలమైన ప్రధాని ఎలా అవుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ ప్రశ్నించారు. బుధవారం రాత్రి జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతం అధ్యక్షతన వనపర్తి సిపిఐ ఆఫీసులో జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. దేశాన్ని పాలించిన గత ప్రధానులు 55 వేల లక్షల కోట్లు అప్పులు చేసి ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మించి ప్రజలకు ఉపాధి చూపించారన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో రెండు లక్షల 50 వేల లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్టు పరిశ్రమ నిర్మించి యువతకు ప్రజలకు ఉపాధి కల్పించకపోగా, సామాన్యులపై పెట్రోలు డీజిల్ వంటగ్యాస్ వాణిజ సిలిండర్ల ధరలను పెంచారన్నారు. ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారాయి అన్నారు. 2014 ముందు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారని అంతర్జాతీయ మార్కెట్లో ఆనాడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర108 డాలర్లు ఉండగా రూ. 65 కే లీటర్ పెట్రోల్ లభించింది అన్నారు. అయినప్పటికీఆనాడు బిజెపి ఆయనను బలహీనమైన ప్రధాని అని విమర్శించిందని, నేడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 98 డాలర్లు ఉందని కానీ పెట్రోల్ ధర మాత్రం రూ. 118 కి పెంచారన్నారు. ప్రజలపై భారం మోపిన నరేంద్ర మోడీ బలమైన ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. రష్యా చమురు తక్కువ ధరకు భారతదేశం కొంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనవద్దని బెదిరిస్తే కొనటం లేదని, ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు కొన్ని చమురు భారం ప్రజలపై మోపారని అలాంటప్పుడు మోదీ బలమైన ప్రధానిగా బిజెపి ప్రచారం చేయటం బూటకమన్నారు. దేశభక్తి, మత విశ్వాసాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేస్తున్నారని ప్రజలు గ్రహించి బిజెపికి బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతు భరోసా చెల్లించాలని, వరి మొక్కజొన్న పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లను రాజకీయాలకతీతంగా అర్హులకు ఇవ్వాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ కృష్ణవేణి గీత శ్రీరామ్ రమేష్ రాబర్ట్ మోష అబ్రహం కుతుబ్ గోపాల్ భరత్ నరసింహ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Read More »

డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన వనపర్తి వనపర్తి శాసనసభ్యు తూడి మేఘారెడ్డితో బుధవారం వే టు న్యూస్ వారు ఏర్పాటుచేసిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కేవలం గంట వ్యవధిలో 158మంది కాల్స్ చేయగా అందులో 79కాల్స్ కి ఎమ్మెల్యే గారు సమాధానం ఇచ్చారు సమయం అయిపోయినందు వల్ల 79 కాల్స్ మిస్డ్ కాల్స్ గా మిగిలిపోయాయి ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు పలు రోడ్ల సమస్యలు విద్యుత్ సమస్యలు తాగునీటికి సంబంధించి పాటు పలు సమస్యలపై ప్రజలు నేరుగా ఎమ్మెల్యేతో మాట్లాడారు వారు పేర్కొన్న సమస్యలను ఎమ్మెల్యే గారు తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. గంట వ్యవధి పాటు నడిచిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక పనులకు సంబంధించి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడం ఎమ్మెల్యే గారి పనితనానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వే టు న్యూస్ సంస్థ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు

Read More »

అశాస్త్రీయ కనీస వేతనాల పెంపుపై పునాసమీక్షించాలి వనపర్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల పెంపు హేతుబద్ధంగా లేదని అశాస్త్రియ వేతనాల పెంపు నిర్ణయం పున సమీక్షించి కార్మికులకు కనీస వేతనాలు 26 వేలకు పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఎంసిఎచ్ ఆసుపత్రులలో విడివిడిగా పారిశుద్ధ్య,సెక్యూరిటీ,పేషంట్ కేర్,విభాగాల కార్మికుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినగా 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల పెంపు పట్ల హర్షంవ్యక్తం చేస్తున్నమని అయితే పెంచిన వేతనాలు ప్రజల ఆర్థిక కనీస అవసరాలు తీరే విధంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతన సలహా మండలి సిఫార్సులు ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు.కనీస వేతన మండలి సిఫార్సులు ప్రకారం అన్ స్కిల్డ్ కార్మికులకు 20వేల 250 రూపాయల నుండి పని నైపుణ్యం బట్టి నాలుగు కేటగిరీలగా 28 వేల వరకు కనీస వేతనాలు పెంపు నిర్ణయించాలని ఉన్నప్పటికీ సిఫార్సు అంశాలకు విరుద్ధంగా ఆశాస్త్రీయంగా వేతనాల పెంపు నిర్ణయం ఉన్నదని దీనితో కార్మికులు తీవ్రమైన ఆర్థిక నష్టంతో పాటు శ్రమ దోపిడికి గురి చేసే ద్వంద విధానాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కనీస వేతనం 26 వేలకు పెంచాలని కార్మికులు కార్మిక సంఘాలు దశాబ్దం తరబడి అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తాజాగా పెంచిన కనీస వేతనాలతో కార్మికులకు పెద్దగా ఎలాంటి లబ్ధి చేకూరాదని అన్నారు. కనీస వేతనాలపై ఈనెల ఐదవ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలో సెమినార్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ కనీస వేతన మండలి బోర్డు సభ్యులు ఎం.డి యూసుఫ్, యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, ఇతర ముఖ్య అతిథులు, వక్తలుగా హాజరవుతున్నారని తెలిపారు. కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని సెమినార్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు గంధం శ్రీను, నరసింహ,లింగం శేట్టి, నరేందర్,అనిల్,రవి,శ్యాం, షాబాద్,మహేష్, ఆంజనేయులు,శ్రీహరి, అశోక్,ఆనంద్,కిషోర్, భరత్,కళావతి,ఇందిరా,పార్వతమ్మ, కవిత,భాగ్యమ్మ,సంతోష, మంజుల,పెంటమ్మ,నాని,లక్ష్మి ప్రమీల,రాములమ్మ,శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Read More »

బి.రాములును పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనపర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బి. రాములు ని మంగళవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. రాములు కి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. రాములు గారు త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.

Read More »

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనే పరమావధిగా పనిచేస్తాం వనపర్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన కలలు కన్న స్వప్నాలను సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి నిమిషం పనిచేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం వనపర్తి పట్టణం లోని మెడికల్ కళాశాల చౌరస్తాలో ఏర్పాటుచేసిన జయశంకర్ గారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన ఎందరో యువకుల కుటుంబాలను సైతం గుర్తుంచుకొని వారికి చేదోడు వాదోడుగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు గత పాలకులు తెలంగాణ విప్లవగలం గద్దర్ గారిని ఎన్నో రకాలుగా అవమానపరిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కూతురు వెన్నెలమ్మకు సముచిత స్థానాన్ని కట్టబెట్టి గౌరవించుకుంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నిమదించిన శ్రీకాంతాచారి తల్లి గారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా స్థానం కల్పించి గౌరవించుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీ గారిని ఎన్నో అవమానాల పాలు చేశారని అలాంటి అందర్శ్రీ గారు రాసిన గీతానికి నేడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ సుష్మాస్వరాజ్ గారు మీరా కుమారి గారు ఈ ముగ్గురమ్మల కృషితోన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల ఊబిగా మార్చేశారని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట కోసం తెలంగాణ తల్లిగా పేరుందిన సోనియా గాంధీ గారు ప్రకటిస్తే గత ప్రభుత్వ పాలనలోని కొందరు దొంగలు తామే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ప్రగల్బాలు పలుకుతున్నాడు విడ్డూరమని విమర్శించారు. సోనియా గాంధీ గారి కాళ్లు మొక్కిన నాయకులు నేడు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకుండా పదేళ్లు అవమానపరచారని ఆయన గుర్తు చేశారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారుల సంక్షేమం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులకు కావలసిన అంశాలపై దృష్టి సారించి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవీరమే పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు యువకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు

Read More »

సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది వనపర్తి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం చిరస్మరణీయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఎందరో విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలు ఉద్యోగులు కర్షకులు కార్మికులు విద్యార్థులు ఎంతోమంది రోడ్లపైకి వచ్చి నిరసనను బలంగా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, అనేక రాజకీయ ఒత్తిళ్లు మరియు సవాళ్లను ఎదుర్కొంటూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు చూపిన చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పది సంవత్సరాలు గత పాలకుల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు . గత రెండున్నర సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందని నిరుపేదలకు సంక్షేమ కొన్నాను అందుతున్నాయన్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

చివరి శ్వాసవరకు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ సారు వనపర్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయములో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ పతాకం , పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తన 16వ ఏటనే తెలంగాణ ప్రాధాన్యత వివరిస్తూ ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మకద్రోహ పార్టీగా మొదటి నుండి రామ్ మనోహర్ లోహియా,జయప్రకాష్ నారాయణ, ఎన్. టి.ఆర్ పునరుద్ఘాటించారు అని వారి మార్గదర్శనములో కెసిఆర్ తన శ్వాస, ధ్యాస తెలంగాణ రాష్ట్ర సాధనగా ఉద్యమం 14ఏండ్లు అహింసహితంగా ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాధించి ప్రజలలో నెలకొన్న నిరాశ, నిస్పృహలు దూరం చేసిన మాహా నాయకుడు కె. సి.ఆర్ అని కొనియాడారు. జయశంకర్ గారి ఓడవని ముచ్చట పుస్తకం కెసిఆర్ స్పూర్తిగా తీసుకొని రాష్టాన్ని సాధించి 9ఏండ్లు సుపరిపాలన అందించారని అన్నారు. కెసిఆర్ 9ఏండ్ల సుపరిపాలన చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధ్వంస పాలన చూసి విసిగి పోయారని ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు రైతు భరోసా రైతు బీమా,రైతు రుణ మాఫీ చేయకుండా యూరియా సకాలంలో పంపిణీ చేయకుండా,కరెంట్ కోతలతో సతాయించినా పంటలు పండించిన పంటలు కొనుగోలు చేయకుండా రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ ఆగం కాక తప్పదు అని అంతేకాకుండా మహిళలకు 2500,తులం బంగారం , నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు,విద్యార్థినులకు స్కూటీలు,కె.సి.ఆర్ కిట్టు,గ్యాస్ సబ్సిడీ,దళిత బంధు,బి.సి.బంధు వంటి పథకాలకు మంగళం పాడారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు మళ్ళీ కె.సి.ఆర్ రావాలని కోరుకుంటున్నారని జయశంకర్ గారి ఆశయాలు స్పూర్తిగా తీసుకొని కె.సి.ఆర్ అడుగుజాడలలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏకదీక్షతో పోరాడిన సిపిఐ : రమేష్ వనపర్తి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా సిపిఐ జాతీయ రాష్ట్ర పార్టీలు పోరాడాయని, ప్రత్యేక తెలంగాణలో అమరుల ఆశయ సాధనకు అవసరమైతే మరో పోరాటం చేయాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తి ఆఫీస్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ కళావతమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. నిజాం నుంచి తెలంగాణ ప్రజల విముక్తికి సిపిఐ పోరాడి విజయం సాధించింది అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని ఉద్యమాలు చేసిందన్నారు. అయినా ఫలితం రాకపోవడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తోనే తెలంగాణ ప్రజల అభివృద్ధి సాధ్యమని భావించిందన్నారు‌.నీళ్లు నిధులు నియామకాల పట్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకోవడంపై సిపిఐ చలించిందన్నారు‌. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని సిపిఐ జాతీయ కమిటీ తీర్మానించిందని, ఆంధ్ర రాయలసీమ ప్రాంత సిపిఐ, అనుబంధ సంఘాల నేతలు మద్దతు పలికారు అన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించాయన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అమరుల ఆశయాలు నీళ్లు నిధులు నియామకాలు సాధించకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటంతో తెలంగాణ ప్రజలు దానికి బుద్ధి చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకీ పట్టం కట్టారన్నారు. రెండున్నర ఏండ్లు గడిచిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు,అమరుల ఆశయాలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు, కాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాల హామీలు అమలయ్యేదాకా, అమరుల కుటుంబాలకు న్యాయం జరిగేదాకా సిపిఐ పోరాడుతుందని ప్రజలు అండగా నిలవాలన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, నేతలు చిన్న కుర్మయ్య లక్ష్మీనారాయణ శేఖర్ వంశీ ఎర్ర కురుమయ్య శిరీష రూప తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 59 దరఖాస్తులు వచ్చాయి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Read More »

Scroll to Top