VETA NEWS MEDIA

2026-09-17
Offcanvas
Edit Template

Uncategorized

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు వనపర్తి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలే కాకుండా, అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలనే కాకుండా, ఇంకా అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సహచర అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం మోటార్లను ఆన్ చేసి ప్రారంభించారు. రూ.87.53 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో మొత్తం 4,235 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయడంతో పాటు చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సుమారు రూ.36 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కర్నే తాండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి జిల్లాలో 3384 ఎకరాలకు, నాగర్ కర్నూల్ జిల్లాలో 851 ఎకరాలు కలిపి మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ప్రాజెక్టు పేరును గిరిజనుల ఇష్టదైవం అయిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఇదే కాకుండా పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. అనంతరం వనపర్తి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ తో కలిసి సర్జ్ పూల్ వద్ద ప్రారంభమైన నీటి ప్రవాహానికి పూజలు చేసి పూలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

కలియుగ దైవం శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథుడిని దర్శించుకున్న మాజీ ఎం.పి.రావుల. వనపర్తి వనపర్తి మండలం పెద్దగూడెం శివారులోని తిరుమలయ్య గుట్ట మీద వెలసిన ఆరాధ్యదైవం తిరుమలనాతుణ్ణినీ మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానం పలికి ఘనంగా సన్మానించారు. శ్రావణ మాసం సందర్భంగా తిరుమలయ్య గుట్ట మీద అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి అని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారని రావుల అన్నారు. రాబోవు కాలములో కె.సి.ఆర్ గారి నాయకత్వములో నిరంజన్ రెడ్డి సహకారంతో తిరుమలయ్య గుట్టను పర్యాటక పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జాతరలో వెలసిన మిఠాయి దుకాణాలలో స్వీట్ ఖరీదు చేసి తనతో పాటు వచ్చిన భక్తులకు,నాయకులకు పంచి ఆనందాన్ని,బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. రావుల చంద్రశేఖరరెడ్డి గారి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్,ఉంగ్లం. తిరుమల్,ధర్మా నాయక్,మాధవ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,బీచ్యనాయక్, కృష్ణా నాయక్,నాగరాజు నాయక్,యాదయ్య, కొత్తకోట.బాలయ్య, లక్ష్మణ్ గౌడ్ శివప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Read More »

ప్రజా పోరాటాల సూరీడు సురవరం : సిపిఐ వనపర్తి ప్రజా పోరాటాల సూర్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అన్నారు. శనివారం సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థినేతగా జీవితం ప్రారంభించి ఏఐవైఎఫ్ నేతగా ఎదిగి కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు అన్నారు. రెండుసార్లు ఎంపీగా పని చేశారని జీవితమంతా ఉద్యమాలతోనే గడిచిందన్నారు. దేశంలో సిపిఐ బలోపేతానికి గ్రామాలకు సైతం వెళ్లిన చరిత్ర ఆయనదన్నారు. కమ్యూనిస్టుగా ఆదర్శభావాలతో నిరాడంబర జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. దేశ విదేశాల్లో మేధావిగా, గంభీరమైనవక్తగా ప్రశంసలు పొందారన్నారు.వలస జిల్లా బతుకులను వెలుగులోకి తెచ్చిన సురవరం ఉమ్మడి పాలమూరు వలస బతుకులపై ఆయనపలు వేదికల్లో గళమెత్తరన్నారు. కరువు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం అవసరం నొక్కి చెప్పటమే గాక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారన్నారు. పాలమూరు జిల్లా ఆకలి చావులను రాష్ట్ర కేంద్ర పాలకుల దృష్టికి ఇచ్చేందుకు జిల్లా నుంచి హైదరాబాద్కు పాదయాత్రలు నడిపారని, ఆకలి చావులను నివారించేందుకు పార్టీ పక్షాన అన్నం, అంబలి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. వనపర్తి జిల్లాతో ప్రత్యేక అనుబంధం వనపర్తి జిల్లాతో సురవరం సుధాకర్ రెడ్డి కి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వనపర్తి జిల్లా ఆఫీసును ఆయన జాతీయ కమిటీ సభ్యుడిగా ఉండగా ప్రారంభించారన్నారు. అనారోగ్యంలోను హైదరాబాద్ వెళ్తే వనపర్తి లో పార్టీ పరిస్థితిపై ఆరా తీసేవారన్నారు. అనారోగ్యంలోనూ వనపర్తి జిల్లా కమిటీ అవసరాల కోసం రూ. 20000 సొంత డబ్బు అందజేసిన గొప్ప మనసు ఆయనదన్నారు. ఉన్నత కులంలో పుట్టి, పార్టీ కోసం పేదల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారబోసిన ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులు కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమన్న, సురేష్,ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సభ్యురాలు వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వనపర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వనపర్తి నంది హిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన గొప్ప ప్రజా యోధుడని కొనియాడారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి, ఆనాటి అణచివేత, దోపిడీ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని అన్నారు. సామాన్య ప్రజలను ఏకం చేసి వారికి అండగా నిలిచిన పాపన్న గౌడ్, బలహీన వర్గాలకు ఆత్మవిశ్వాసం కల్పించారని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన ఆయన స్ఫూర్తి నేటి తరానికి కూడా ఆదర్శమని తెలిపారు. తెలంగాణ గడ్డపై ప్రజల కోసం పోరాడిన వీరుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు . సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

కనీస వేతనం 26,000 పెంచాలి వనపర్తి మూడు సంవత్సరాల కాల వ్యవధి ముగిసి కాలం చెల్లిన ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేయకుండా ప్రభుత్వం వాటికే అనుమతి పెంచుతూ పోవడం పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల సంక్షేమానికి గొడ్డలి పెట్టు లాంటిదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారిశుద్ధ్య సెక్యూరిటీ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల జాయింట్ సమావేశం జరిగింది. అనంతరం కార్మికుల తక్షణ దీర్ఘకాలిక సమస్యలపై, సంబంధిత ఏజెన్సీ యాజమాన్యం,యూనియన్ నాయకులు, కార్మికుల మధ్య చర్చలు జరిపారు.ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఏజెన్సీలను మూడు సంవత్సరాల వ్యవధితో ఎంపిక చేసి కార్మికుల జీతభత్యాలు నిర్ణయించి అమలు చేస్తున్నారని అన్నారు. మూడు సంవత్సరాల వ్యవధి ముగిసి ఏడాది గడసిపోయిన కూడా నేటికీ ఏజెన్సీలను రద్దు చేయకుండా వాటి స్థానంలో కొత్త ఏజెన్సీలను ఎంపిక చేయకుండా కాలయాపన చేస్తూ పాత వారికి అనుమతులు ఇవ్వడం చేత కార్మికులకు మూడేళ్లకు పెరగాల్సిన జీతాలు పెరగకపోగా తీవ్రమైన ఆర్థిక నష్టంతోపాటు, ఆస్పత్రుల మెడికల్ కళాశాల నూతన భవనాలు, వార్డులు పడకల సామర్థ్యం అనుగునంగా కార్మికుల సంఖ్య పెరగలేదని దీనితో కార్మికులకు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల వ్యవస్థను రద్దుచేసి నేరుగా కార్పొరేషన్ ద్వారానే వేతనాలు అందించాలని, కనీస వేతనం 26వేలకు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జాతీయ పండగ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి యూనిఫార్మ్స్ బూట్లు క్రమం తప్పకుండా అందించడం కాకుండా కార్మికులకు భద్రతవస్తువులైన గ్లౌజ్ లు, బెల్లం, కొబ్బరి, నూనె, సబ్బులు అందించాలని, నాణ్యమైన క్లీనింగ్ రసాయన వస్తువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు లక్ష్మి, మన్నెమ్మ,భారతి, సహిదా బేగం,బొజ్జమ్మ,పిర మ్మ, శ్రీదేవి భూదేవి శారద సుజాత, జయలక్ష్మీ, గోవిందమ్మ,శ్రీ గంగా, పుష్ప, నరసింహ,మద్దిలేటి, షంషిద్దీన్,కృష్ణ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పోల్కంపల్లి శాంతాదేవికి పాకాల యశోద రెడ్డి పురస్కారం వనపర్తి తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మహిళా సాహిత్య సాంస్కతిక సంస్థ, పాలమూరు వారి ఆధ్వర్యంలో ఆచార్య పాకాల యశోదా రెడ్డి 97వ జయంతి సందర్భంగా వారి రచనల సమగ్ర సాహిత్య సదస్సును రెండు ఆగస్టు 9 ,10వ తేదీలలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహబూబ్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదా రెడ్డి పురస్కారం -2026 గాను వనపర్తి వాస్తవ్యులు 7 దశాబ్దముల నుండి 65 నవలలు 100కు పైగా కథలు రాసిన ప్రసిధ్ధ నవలా కథా రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారికి ప్రకటించడం జరిగింది. శాంతా దేవి గారు అనారోగ్యం కారణంగా సభకు రాలేకపోయారు. అందుగురించి ఈ రోజు వారి స్వగృహంలో నవలా సామ్రాజ్ఞి పోల్కంపల్లి శాంతాదేవి గారికి ఆచార్య పాకాల యశోదా రెడ్డి సాహితీ పురస్కారం -2026 అందించారు. మెమెంటో శాలువాతో ఘనంగా సత్కరించి 5000 నగదు పురస్కారాన్ని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రావూరి వనజ , జి. శాంతా రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు మంత సక్కుబాయి ఘాలి లలితా ప్రవల్లిక అందజేశారు . ఈ కార్యక్రమంలో పి. సుజాత, పి. సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా పోల్కంపల్లి శాంతా దేవి గారు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు బిజినేపల్లి ముద్దుబిడ్డ డా. పాకాల యశోదా రెడ్డి గారు తెలంగాణ మాండలిక భాషను, ముఖ్యంగా పల్లె జీవన శైలిని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తన రచనల్లో సజీవంగా చిత్రించిన ప్రముఖ తెలుగు సాహితీవేత్త అని , ఆమె తెలంగాణ భాషకు ప్రత్యేక గౌరవాన్ని తీసుక వచ్చారని వారి సమగ్ర సాహిత్య సదస్సును నిర్వహించిన పాలమూరు మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమన్నారు. సంస్థ ఆహ్వానం మేరకు నేను పాలమూరు సభకు రాలేకపోయినా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రావూరి వనజ శాంతా రెడ్డి తదితరులు వనపర్తి లోని మా స్వగృహానికి విచ్చేసి ఈ పురస్కారాన్ని అందించడం హర్షణీయమన్నారు.

Read More »

ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం వనపర్తి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆస్తులు కూడబెట్టడం కంటే, వారికి అందించగలిగే గొప్ప ఆస్తి నాణ్యమైన విద్య అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యా రంగ అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రపంచంలో విద్యా రంగంలో ముందంజలో ఉన్న జపాన్, జర్మనీ, ఇండోనేషియా వంటి దేశాల విద్యా విధానాల్లోని ఉత్తమ పద్ధతులను తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఆధునిక విద్య, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా పోటీ పడేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తని, నేటి విద్యార్థులను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జిల్లా నాయకులు బ్రహ్మం చారి, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Read More »

మార్పు కోసం ప్రజల ఎదురుచూపు.. తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం: రమేష్ వనపర్తి దేశంలో బిజెపి పాలన మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, తరిమి కొట్టే సమయం ఎంతో దూరంలో లేదని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం వనపర్తి మండలం చిమనగుంటపల్లి, చిట్యాల, శ్రీనివాసపూర్ సిపిఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా తో స్వేచ్ఛ వ్యవసాయ వాణిజ్య ఒప్పందంతో రైతులను, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి దేశ కార్మికులకు అన్యాయం చేశారన్నారు. నీట్ పేపర్ లీకేజీ తో విద్యార్థులు నిరుద్యోగులను ముంచారన్నారు. సీజెపి పోరాటంలో యువత ప్రజాగ్రహానికి నరేంద్ర మోడీ తలవగ్గక తప్పలేదన్నారు. ధరలను తగ్గిస్తామని అన్నింటికీ ధరలు పెంచి సామాన్యుడి బతకలేని పరిస్థితి కల్పించారన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయటం లేదన్నారు. వీటన్నింటిపై సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో వివరిస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే బిజెపిని కొట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు అన్నారు. శ్రీ రాము భాస్కరు గోపాలు కృష్ణవేణి శేఖర్ జయమ్మ చిన్న కుర్మన్న ఉదయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

Read More »

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం: రమేష్ వనపర్తి విద్యార్థులు నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్ రమేష్ అన్నారు. మంగళవారం సిపిఐ ఆఫీస్ వద్ద ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ అధ్యక్షత వహించారు. మాట్లాడుతూ.. 1936లో ఉత్తరప్రదేశ్ లక్నో బెనారస్ విశ్వవిద్యాలయంలో బబురుద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంతో ఏఐఎస్ఎఫ్ పోరాడుతుందన్నారు. విద్యా రంగానికి కేంద్రం 10% రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయన్నారు. నీట్ పరీక్ష పరీక్ష పత్రం లీకేజీ తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. బీజేపీ పోరాటానికి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ కూడా మద్దతు పలికాయి అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నడపడంలో కేంద్రం ఇప్పలమైందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 23 వేలకు కుదిస్తామనటం దుర్మార్గమన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 8000 కోట్లు బకాయి చెల్లించడంలో విఫలమయ్యారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు చదువు అంది ఎందుకు అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.

Read More »

కార్పొరేట్ల కు వత్తాస్తు పలుకుతున్న నరేంద్ర మోడీ విధానాలను నిరసిస్తూ జయప్రదమైన రైతు, కార్మిక సంఘాల జైల్ బరో కార్యక్రమం వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ లోAITUC, CITU, TUCI, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంట పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. పోలీసులకు కార్మిక సంఘాల నాయకులు మధ్య తోపులాట జరిగింది అనంతరం కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మిక సంఘాల నాయకులను విడుదల చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకొని నినాదాలు చేశారు, పోలీసులు సొంత పూచీకత్ పై కార్మిక సంఘాల నేతలను విడుదల చేశారు, ఈ రాస్తారోకోను ఉద్దేశించి AITUC జిల్లా కార్యదర్శి మోష, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ,CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు R N రమేష్,మండ్ల రాజు,TUCI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్మయ్య, అరుణ్ కుమార్, ఏఐకేస్ జిల్లా కార్యదర్శి రాబట్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేష్ ఆచారి జిల్లా ఉపాధ్యక్షులు జి ఎస్ గోపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అజయ్, మేకల ఆంజనేయులు తెలంగాణ ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజన్న, వెంకటయ్య. మాట్లాడుతూకార్పొరేట్ల ఆక్రమణకు, న్యాయమైన వేతనాలను తిరస్కరించడానికి వ్యతిరేకంగా కార్మికులు, రైతుల ఐక్యతను చాటడమ. అన్ని పంటలను రాష్ర్ట ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు హామీ కల్పించడంతో పాటూ, సిటు ప్లస్‌ 50 ‌శాతం ఫార్ములాతో లెక్కించిన మేరకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పి)ను ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ కల్పించాలన్న డిమాండ్‌‌ దీనికి తోడు, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాన్ని పెంచాలని, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా తిరస్కరించాలని, ప్రతిపాదిత విత్తన బిల్లు, 2025ను ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ ‌ప్రైవేటీకరణ, ప్రీ పెయిడ్‌ ‌స్మార్ట్‌ ‌మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్‌ నాలుగు లేబర్‌ కోడ్లను తక్ష‍ణమే రద్దు చేయాలి.కార్మికులందరికీ నెలకు రూ.31 వేలు చొప్పున కనీస వేతనం చెల్లించాలి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ని పునరుద్ధరించి, 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.700 దినసరి వేతనం అమల్జేయాలి.సార్వత్రిక సామాజిక భద్రత ఫించను నెలకు రూ.10 వేలు చొప్పున అందజేయాలి.ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రతిపాదించిన సి2 ప్లస్‌ 50 శాతం ఫార్ములాతో అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దేశ వ్యవసాయ రంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలా అమెరికాతో చేసుకున్న అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలి.వ్యవసాయ, ఆహార శుద్ధి, ఆహార ఎగుమతులు, అలాగే వ్యూహాత్మక ఎంఎస్‌ఎంఇ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష‍ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)లను అనుమతించరాదు.భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఎ)ని రక్ష‍ించి మరింత బలోపేతం చేయాలి.ఎఫ్‌సిఐ గోదాముల స్థానంలో అదానీ – లీప్‌ ఇండియా గుత్తాధిపత్యానికి తెర దించాల విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లు 2025, విత్తన బిల్లు 2025, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. సహకార సంస్థల్లో కార్పొరేట్‌ సంస్థల ఆక్రమణలను ఆపేయాలి. అన్నదాతల నేతృత్వంలో ప్రజాస్వామిక సహకార సంస్థలను బలోపేతం చేయాలి.సమగ్రమైన రుణ మాఫీ పథకాన్ని ప్రకటించి అప్పుల ఊబిలో నుంచి గ్రామీణ ప్రజలను గట్టెక్కించాలి. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్ష‍ల చొప్పున పరిహారం అందజేయాలి. బలవంతపు భూసేకరణను, కార్పొరేట్‌ భూసమీకరణను ఎటువంటి పరిస్థిత్లోనూ చేపట్టకూడదు.భూ సేకరణ చట్టం 2013, అటవీ హక్కుల చట్టం 2006, పీసా 1996 చట్టాల ప్రకారం భూ హక్కులను పరిరక్ష‍ించాలి. ఎరువులు, ఇంధనం, వంటగ్యాసు, పెట్రోలు, డీజిల్‌ ధరలను నియంత్రించాలి. సబ్సిడీలను పునరుద్ధరించాలి. రైతులందరికీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటల బీమా, పశువుల బీమా కల్పించాలివాటర్‌షెడ్లను అభివృద్ధి చేసి ప్రతి పొలానికి నీటి సౌకర్యం కల్పించాలి.వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పారదర్శకమైన సహాయాన్ని అందజేయాలి. ఇందుకోసం తగిన నిధులు కేటాయించాలి.విద్య కోసం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6 శాతం నిధులు కేటాయించాలి.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, అలాగే జిడిపిలో 3 శాతం నిధులను పరిశోధన, అభివృద్ది రంగానికి కేటాయించాలి. ఈ కార్యక్రమం నికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి లీల, లక్ష్మి, డి హెచ్ పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, ఎంపీ ఆర్డీ నాయకులు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో AITUC నాయకులు చిన్న కురుమన్న, శ్రీను, నరసింహ, నరేందర్,గాంధీ, పెద్ద మొగులయ్య,రిక్షా రాములు, టి యు సి ఐ నాయకులు గణేష్, పెంటయ్య దేవమ్మ,C రాజు, సిఐటియు నాయకులు బొబ్బిలి నిక్సన్, సూర్యవంశం రాము, బుచ్చమ్మ,ఎస్ రాజు,సునీత, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు

Read More »

Scroll to Top