ఏఐటీయూసీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా Kమోష ఎన్నిక
వనపర్తి
ఏఐటీయూసీ వనపర్తి జిల్లా 4వ మహాసభలు పెబ్బేరులో (శుక్రవారం) ముగిశాయి. నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా టి శ్రీహరి ప్రధాన కార్యదర్శిగా kమోష లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా రఘు, శ్యాంసుందర్, సహాయ కార్యదర్శిలుగా శ్రీరామ్, గోపాలకృష్ణ, కోశాధికారిగా ఏ భాస్కర్ 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం వేదికపై చేతులు కలిపి ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, ఉప ప్రధాని కార్యదర్శి ఎం నరసింహ మాట్లాడుతూ.. జిల్లాలో ఏఐటియుసి బలోపేతానికి కృషి చేయాలన్నారు. అసంఘటితరంగా కార్మికులను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడాలన్నారు. బిజెపి కార్మిక ప్రజాస్వామ్యం వ్యతిరేక విధానాలను, పెట్టుబడి దారి అనుకూల విధానాలను అమలు చేస్తోందని ప్రతిఘటించి పోరాడేందుకు జిల్లాలో కార్మికులను ఏకం చేయటం అవసరమన్నారు.
