VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఇటీవల వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎం. లింగాచారి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, నూతన బాధ్యతలలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు,శాఖ ఎక్సైజ్ శాఖల మధ్య సమన్వయం ప్రజా ప్రయోజనాల సాధనలో కీలకమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం తయారీ మరియు రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంలో రెండు శాఖలు సమిష్టిగా పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతలను కాపాడటం ప్రతి ప్రభుత్వ శాఖ యొక్క ఉమ్మడి బాధ్యతని పోలీసు, ఎక్సైజ్ శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తూ అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉండాలని ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి కలిసి కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

whatsapp image 2026 07 17 at 4.30.30 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top