VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

TG

whatsapp image 2026 05 06 at 3.56.30 pm

Grow commercial crops and get maximum profits

వాణిజ్య పంటలను సాగు చేసి అత్యధికంగా లాభాలు పొందండి వనపర్తి వనపర్తి :: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఉద్యానవనాలు , పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల మార్పిడిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు ప్రణాళికా సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ 140 కోట్ల మంది జనాభా కలిగిన భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు ఆయిల్ గింజలు, పప్పు దినుసులు లేవని వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొవటానికి మన ఫోరెన్సిక్ నిల్వలు బయటి దేశాలకు వెళ్లి పోతున్నాయని చెప్పారు. అందుకే మన దేశంలోనే ఆయిల్ గింజలు సాగు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. నూనె గింజల్లో అత్యధికంగా ఆయిల్ వచ్చే పంట కేవలం పామాయిల్ పంటకే ఉందని, అత్యధికంగా లాభసాటి పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ పంట అని కొనియాడారు. అందుకే రైతులు వరి పంట కాకుండా పామాయిల్, పప్పు గింజలు, కూరగాయల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. తన 90 ఎకరాల పొలంలో 75 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం మొక్కకు సబ్సిడీ నుంచి ఎరువులు, డ్రిప్, గుంతలు తవ్వడానికి, 4 సంవత్సరాల పాటు అంతర్ పంట సాగుకు సైతం ప్రభుత్వం సబ్సిడీనిస్తుందని అన్నారు. రైతులు పామాయిల్ పంట సాగు చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు అత్యధికంగా లాభాలు పొందాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రైతులు తమ భూములను సారవంతంగా ఉంచుకొని వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రైతు భూ సారా కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ (Former Producer Organisation) లో సభ్యత్వం తీసుకోవాలని తద్వార కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని సూచించారు. అదేవిధంగా ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పొందటం, సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవడం వంటివి చేయాలని చెప్పారు. పామాయిల్ పంట వేసుకునేందుందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పామాయిల్ సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు. రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాద్ రావు, మాజీ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కృపాకర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి, వీణా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ్ భాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

Grow commercial crops and get maximum profits Read More »

వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యంవనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యంవనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమానికి రెండు క్వింటాళ్ల బియ్యం వితరణ చేశారు. నిరంజన్ రెడ్డి తరపున బియ్యాన్ని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అందజేశారు.ఈ సందర్భంగా నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి గతంలో వృద్ధాశ్రమానికి ఐదేండ్లు అల్పాహారం,భోజనం అందించారని అన్నారు. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు ఎస్.రాము తమకు సహాయం అందించాలని కోరగా స్పందించిన నిరంజన్ రెడ్డి రెండు క్వింటాళ్ల బియ్యం వితరణ చేస్తూ ఇతరత్ర అవసరాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అని నందిమల్ల అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గంధం.పరంజ్యోతి, సూర్యవంశం.గిరి,స్టార్.రహీమ్,సునీల్ వాల్మీకి,గౌడ్ నాయక్,కృష్ణయ్య,రాజు తదితరులు ఉన్నారు.

వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యంవనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు వనపర్తి

అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు వనపర్తి అమెరికా సామ్రాజ్యవాదంతో ప్రపంచ మానవ మనుగడకే ముప్పని శాంతికాముకులు ఐక్యంగా ప్రతిఘటించి పోరాడాలని ఐప్సో, పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వనపర్తి లో అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపిఎస్ఓ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వద్దు- శాంతి ముద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నేతలు ప్రజలు విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జిల్లా ఐఫ్సో ప్రధాన సమన్వయ కార్యదర్శి యత్తం శివ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఎత్తం శివ, రమేష్, జలజ్వాల రాధాకృష్ణ,వనగంటి నాగేశ్వర్, భరత్, సీఎన్ శెట్టి పలుస శంకర్ గౌడ్,గంధంనాగరాజు, గణేష్, ఖాదర్ బాషా తదితరులు మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో పొరుగు దేశాలను ఆక్రమించి, దేశ నాయకత్వాన్ని అంతం చేసి భూగర్భ సంపదను నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటుందన్నారు. వెనుజుల అధ్యక్షుడు మధురొ దంపతుల అక్రమ నిర్బంధం, ఇరాన్ అయతుల్లా ఖుమేని హతం ఇందులో భాగవేనన్నారు. అమెరికాతో సాంగత్యం ఉన్న అన్ని దేశాలు అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం వల్ల నాశనమయ్యాయి అన్నారు. వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని లక్షలాదిమంది క్షతగాత్రులు అయ్యారన్నారు. చాలా దేశాలతో పాటు భారతదేశంలో విపరీతంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతకానితనం కూడా దీనికి కారణం అన్నారు. యుద్ధాలను ఆపితేనే మానవ మనుగడ అభివృద్ధి సాధ్యమని ఆ దిశగా ప్రపంచ దేశాలు సంఘటితమై అమెరికా ఆట కట్టించాలన్నారు. రక్త పిపాసి అమెరికా సామ్రాజ్యవాదాన్ని పొదుముట్టించేందుకు శాంతికాముక దేశాలన్నీ ఏకం కావాలని కోరారు. అందుకు భారతదేశం ముందు వరుసలో నిలవాలన్నారు. నేతలు కళావతమ్మ, గట్టు యాదవ్,గోపాలకృష్ణ, జయమ్మ, లింగన్న, మధు,ఖాదర్పాష, వెంకటమ్మ, పరంజ్యోతి, వంశీ, అరవిందు, శిరీష, అరుణ జ్యోతి కాలేజ్ డి.ఎం.ఎల్.టి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు వనపర్తి Read More »

New Industrial Projects Announced in Sangareddy

The Telangana government has announced new industrial projects in Sangareddy district to boost economic growth and create employment opportunities. Several companies are expected to set up manufacturing units in the region. Officials stated that these projects will strengthen industrial infrastructure and attract further investments. The development is likely to generate jobs for local youth and contribute to the overall economic progress of the district.

New Industrial Projects Announced in Sangareddy Read More »

Warangal Hosts Cultural Festival with Grand Celebrations

Warangal recently hosted a grand cultural festival showcasing Telangana’s rich heritage and traditions. The event featured folk dances, music performances, and art exhibitions, attracting large crowds from across the region. Organizers emphasized the importance of preserving cultural heritage and promoting local artists. The festival provided a platform for talented performers to display their skills and connect with audiences. Visitors appreciated the vibrant atmosphere and diverse cultural presentations.

Warangal Hosts Cultural Festival with Grand Celebrations Read More »

Farmers in Karimnagar Benefit from Improved Irrigation

Farmers in Karimnagar district are experiencing better crop yields due to improved irrigation facilities and water availability. Recent government initiatives have helped ensure consistent water supply to agricultural lands. Agriculture officials highlighted that modern irrigation methods and support programs are helping farmers increase productivity. The improved conditions have brought optimism among farmers, contributing to stronger rural development and economic stability.

Farmers in Karimnagar Benefit from Improved Irrigation Read More »

Hyderabad Sees Major Infrastructure Development Plans

The Telangana government has announced new infrastructure development plans for Hyderabad, focusing on improving road connectivity, metro expansion, and urban facilities. Several flyover and road expansion projects are currently underway to reduce traffic congestion. Officials stated that these initiatives aim to enhance the overall living standards and support the city’s rapid growth. The developments are also expected to attract investments and boost Hyderabad’s position as a major IT and business hub in India.

Hyderabad Sees Major Infrastructure Development Plans Read More »

Scroll to Top