VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి నియోజకవర్గం గోపాల్‌పేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకి వెంకటేష్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఎస్సీ డిపార్ట్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజా సేవా దృక్పథంతో ఎంతోకాలంగా పనిచేస్తున్న కొంకి వెంకటేష్ గారికి ఈ పదవి రావడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ విభాగం అభివృద్ధికి మరింత కృషి కృషి చేయాలని ఆకాంక్షించారు కొంకి వెంకటేష్ గారికి లభించిన ఈ గౌరవం వనపర్తి నియోజకవర్గానికి, ముఖ్యంగా గోపాల్పేట మండల కాంగ్రెస్ శ్రేణులకు గర్వకారణమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

whatsapp image 2026 07 19 at 6.25.02 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top