VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మికులు శత్రువులు కార్మికుల శ్రమను దోచి సంపదను లూఠీ చేసే కార్పొరేట్ శక్తులు మిత్రులుగా మారారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆల్ ఇండియా ట్రేడియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు పెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పెబ్బేర్ మార్కెట్ యార్డ్ నుండి సాయిరాం ఫంక్షన్ హాల్ వరకు వందలాదిమంది కార్మికులతో పట్టణంలో భారీ కార్మిక ప్రదర్శనగా నిర్వహించారు. మహాసభల ప్రారంభ సూచికంగా ఏఐటీయూసీ జెండాను ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.బాలరాజ్ ఆవిష్కరించారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్.బాలరాజు మాట్లాడుతూ:- బ్రిటిష్ కాలం నుండే అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా కార్మికుల సంక్షేమానికి సమాధి కట్టే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడులు కేవలం కార్పొరేట్ శక్తులు, దోపిడి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు తీసుకువచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఇప్పటికే అనేక పర్యాయాలు సార్వత్రిక సమ్మెలు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిజెపి విధానాలను నిరసిస్తున్నామని బయటకు చెబుతున్న అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రాష్ట్రంలో కూడా దశలవారీగా అమలు చేసేందుకు కుట్రలు చేసిందని అందులో భాగంగానే ఇండస్ట్రియల్ పాలసీలో 12 గంటల పని విధానం తప్పుడు జీవోను రేవంత్ రెడ్డి సర్కార్ దొడ్డిదారిన తీసుకొచ్చిందని ఆరోపించారు. 12 సంవత్సరాలుగా కార్మికులకు కనీస వేతనాలు పెరగలేదని తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలు కూడ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనం బోర్డు సిఫారసులకు విరుద్ధంగా ఉన్నాయని వేతనాల పెంపు పారదర్శకత లేదని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం.నరసింహ, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గోపాలకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు గాంధీ, పెద్ద మొగులయ్య,రాములు, శ్యాంసుందర్,భాస్కర్, భరత్,సిపిఐ జిల్లా నేత రమేష్,చిన్న కురుమయ్య, మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా నేత పి.కళవతమ్మ,కృష్ణవేణి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్, రవీందర్,శ్రీను,నరసింహ, నరేందర్,అంజి,ఇజ్రాయిల్, ప్రజానాట్యమండలి కళాకారులు గోపాల్,చందు వివిధ రంగాల అసంఘటిత రంగాల కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 07 30 at 5.12.04 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top