ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ కృషి చేయాలి : జిల్లా ఎస్పీ
వనపర్తి
కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీసుశాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శనివారం జిల్లాపోలీసు కార్యాలయంలో కోర్ట్ లైజన్ , కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ లతో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్., గారు సమావేశం నిర్వహించి కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం, నిందితులకు చట్టపరమైన శిక్షలు ఖచ్చితంగా పడేలా చర్యలు తీసుకోవడంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కేసుల్లో నిందుతులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు అనుగుణంగా కేసులు పెండింగులో లేకుండా చూసుకోవాలని అన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. సాక్షులను,బాధితులను సమయానికి కోర్టులో హాజరు పరిచేలా చూసుకోవాలని, బాధితులకు,సాక్షుల కు కేసుకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలని అన్నారు. కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సై లకు తెలియజేయాలని, అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి పలువురు కోర్టు కానిస్టేబుళ్లను అడిగి కేసుల పురోగతిపై సూచనలు చేశారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్స్,(NBW) సమన్స్ సమీక్షించి త్వరగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ కోర్టులో హాజరుపరిచి NBW లను పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, డిసిఆర్భి డిఎస్పీ, బాలాజీ నాయక్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి, జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
