VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

పట్టణంలోనీ 11వార్డు(రాం నగర్ కాలనీ)కి చెందిన నాగనమోని.శ్రీలత రాములు కుమారుడు తేజేశ్వర్ ఇటీవల జరిగిన I.I.I.T పోటీ పరీక్షలలో ఆల్ ఇండియా స్థాయిలో 792ర్యాంక్ సాధించి గుజరాత్ రాష్టం గాంధీనగర్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో తేజేశ్వర్ ను సన్మానించి అభినందించారు. I.I.I.T లో తేజేశ్వర్ సీటు సాధించి పట్టణ ప్రతిష్ఠ పెంచడం హర్షణీయమని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి పేద ప్రజలకు సేవచేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ప్రశంసించారు. నూతన వస్త్రాలు బహుకరించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కె.మాణిక్యం,కౌన్సిలర్ స్వాతి హరిబాబు,రఘువర్ధన్ రెడ్డి,ధర్మా నాయక్, హేమంత్ ముదిరాజ్ గంగ ప్రసాద్,మహేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు

whatsapp image 2026 07 17 at 4.19.42 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top