VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ నేర నియంత్రణలో ముఖ్యమైన సహకారం అందిస్తోందని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు , సిబ్బందితో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి స్పెషల్ బ్రాంచ్ విభాగం పనితీరును ప్రశంసిస్తూ, మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా భద్రతా వ్యవస్థలో కీలక స్థంభం స్పెషల్ బ్రాంచ్ అందిస్తున్న సమాచారంతో నేరాలను ముందుగానే అడ్డుకోవడం సాధ్యమవుతోంది. ఇదే ఉత్సాహంతో మరింత క్రమశిక్షణతో, పారదర్శకతతో పని చేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి. ప్రతి పని సమయానికి పూర్తి చేయడం ద్వారా పోలీసుశాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ, ఉద్యోగ (Job) వెరిఫికేషన్లు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీ, ఇతర విభాగాలకు సమన్వయంతో సహకారం అందించడం అన్ని అంశాల్లో స్పెషల్ బ్రాంచ్ పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పర్వతాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

whatsapp image 2026 07 18 at 6.37.16 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top