కార్పొరేట్ల కు వత్తాస్తు పలుకుతున్న నరేంద్ర మోడీ విధానాలను నిరసిస్తూ జయప్రదమైన రైతు, కార్మిక సంఘాల జైల్ బరో కార్యక్రమం వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ లోAITUC, CITU, TUCI, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంట పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. పోలీసులకు కార్మిక సంఘాల నాయకులు మధ్య తోపులాట జరిగింది అనంతరం కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మిక సంఘాల నాయకులను విడుదల చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకొని నినాదాలు చేశారు, పోలీసులు సొంత పూచీకత్ పై కార్మిక సంఘాల నేతలను విడుదల చేశారు, ఈ రాస్తారోకోను ఉద్దేశించి AITUC జిల్లా కార్యదర్శి మోష, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ,CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు R N రమేష్,మండ్ల రాజు,TUCI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్మయ్య, అరుణ్ కుమార్, ఏఐకేస్ జిల్లా కార్యదర్శి రాబట్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేష్ ఆచారి జిల్లా ఉపాధ్యక్షులు జి ఎస్ గోపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అజయ్, మేకల ఆంజనేయులు తెలంగాణ ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజన్న, వెంకటయ్య. మాట్లాడుతూకార్పొరేట్ల ఆక్రమణకు, న్యాయమైన వేతనాలను తిరస్కరించడానికి వ్యతిరేకంగా కార్మికులు, రైతుల ఐక్యతను చాటడమ. అన్ని పంటలను రాష్ర్ట ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు హామీ కల్పించడంతో పాటూ, సిటు ప్లస్ 50 శాతం ఫార్ములాతో లెక్కించిన మేరకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ కల్పించాలన్న డిమాండ్ దీనికి తోడు, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాన్ని పెంచాలని, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా తిరస్కరించాలని, ప్రతిపాదిత విత్తన బిల్లు, 2025ను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణ, ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి.కార్మికులందరికీ నెలకు రూ.31 వేలు చొప్పున కనీస వేతనం చెల్లించాలి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ని పునరుద్ధరించి, 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.700 దినసరి వేతనం అమల్జేయాలి.సార్వత్రిక సామాజిక భద్రత ఫించను నెలకు రూ.10 వేలు చొప్పున అందజేయాలి.ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రతిపాదించిన సి2 ప్లస్ 50 శాతం ఫార్ములాతో అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దేశ వ్యవసాయ రంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలా అమెరికాతో చేసుకున్న అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలి.వ్యవసాయ, ఆహార శుద్ధి, ఆహార ఎగుమతులు, అలాగే వ్యూహాత్మక ఎంఎస్‌ఎంఇ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)లను అనుమతించరాదు.భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఎ)ని రక్షించి మరింత బలోపేతం చేయాలి.ఎఫ్‌సిఐ గోదాముల స్థానంలో అదానీ – లీప్ ఇండియా గుత్తాధిపత్యానికి తెర దించాల విద్యుత్ ప్రయివేటీకరణ బిల్లు 2025, విత్తన బిల్లు 2025, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. సహకార సంస్థల్లో కార్పొరేట్ సంస్థల ఆక్రమణలను ఆపేయాలి. అన్నదాతల నేతృత్వంలో ప్రజాస్వామిక సహకార సంస్థలను బలోపేతం చేయాలి.సమగ్రమైన రుణ మాఫీ పథకాన్ని ప్రకటించి అప్పుల ఊబిలో నుంచి గ్రామీణ ప్రజలను గట్టెక్కించాలి. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలి. బలవంతపు భూసేకరణను, కార్పొరేట్ భూసమీకరణను ఎటువంటి పరిస్థిత్లోనూ చేపట్టకూడదు.భూ సేకరణ చట్టం 2013, అటవీ హక్కుల చట్టం 2006, పీసా 1996 చట్టాల ప్రకారం భూ హక్కులను పరిరక్షించాలి. ఎరువులు, ఇంధనం, వంటగ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలను నియంత్రించాలి. సబ్సిడీలను పునరుద్ధరించాలి. రైతులందరికీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటల బీమా, పశువుల బీమా కల్పించాలివాటర్‌షెడ్లను అభివృద్ధి చేసి ప్రతి పొలానికి నీటి సౌకర్యం కల్పించాలి.వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పారదర్శకమైన సహాయాన్ని అందజేయాలి. ఇందుకోసం తగిన నిధులు కేటాయించాలి.విద్య కోసం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6 శాతం నిధులు కేటాయించాలి.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, అలాగే జిడిపిలో 3 శాతం నిధులను పరిశోధన, అభివృద్ది రంగానికి కేటాయించాలి. ఈ కార్యక్రమం నికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి లీల, లక్ష్మి, డి హెచ్ పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, ఎంపీ ఆర్డీ నాయకులు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో AITUC నాయకులు చిన్న కురుమన్న, శ్రీను, నరసింహ, నరేందర్,గాంధీ, పెద్ద మొగులయ్య,రిక్షా రాములు, టి యు సి ఐ నాయకులు గణేష్, పెంటయ్య దేవమ్మ,C రాజు, సిఐటియు నాయకులు బొబ్బిలి నిక్సన్, సూర్యవంశం రాము, బుచ్చమ్మ,ఎస్ రాజు,సునీత, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు
Uncategorized
కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్ మియాని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్ మియా గారు ఇటీవల నిమ్స్ హాస్పటల్ లో సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెబ్బేరు పట్టణంలో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ మియా గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు తీసుకోవాలని సూచించారు. వారు త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి విశ్వరూపం రాజశేఖర్ సాయినాధ్ ఎల్లారెడ్డి వడ్డె రమేష్ సాయిరెడ్డి సంబురాము వేణు మూర్తి అఖిల్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మేఘారెడ్డి విజ్ఞప్తికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి వనపర్తి, పెబ్బేరు సివరేజ్ (మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులకు) రూ.29.20 కోట్లు మంజూరు. వనపర్తికి రూ.20 కోట్లు పెబ్బేరుకు రూ.9.20 కోట్లు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్చార్జి మంత్రిదామోదర్ రాజనర్సింహ కి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు కి , వాకిటి శ్రీహరికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలలో (సివరేజ్) మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ.29.20 కోట్లతో సివరేజ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా సివరేజ్ ప్రాజెక్టు చేపట్టాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుని ప్రాజెక్టులకు ఆమోదం కల్పించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) 2.0 కింద, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో LS కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో వనపర్తి మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, పెబ్బేరు మున్సిపాలిటీకి రూ.9.20 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో ఇళ్ల నుంచి, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడే మురుగునీటిని శాస్త్రీయంగా సేకరించి, సివరేజ్ వ్యవస్థ ద్వారా తరలించి, శుద్ధి చేసి సురక్షితంగా నిర్వహించే సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయి. తద్వారా పట్టణ పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వనపర్తి నియోజకవర్గంలో పట్టణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్ వనపర్తి సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులేనని, మానవాతీతులు కాదని నాస్తిక సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భాస్కర్ అన్నారు. ఆగస్టు 16న వనపర్తి బండారు నగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘ భవనంలో జరగనున్న ఉమ్మడి జిల్లా ‘నాస్తిక అధ్యయన తరగతుల’ కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ.. శాస్త్రీయ సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. శాస్త్రీయ సమాజంతోనే వేగంగా దేశ ప్రగతి సాధ్యమన్నారు. నాస్తిక సమాజం దోపిడీ నుంచి కష్టజీవుల విముక్తి కోసం జరిగే కృషికి తోడుగా నిలుస్తుంది అన్నారు. ‘నాస్తికత్వం’ ఒక సంస్కృతిక ఉద్యమంగా, చైతన్య శక్తిగా ప్రజలను తీర్చిదిద్దుతుంది అన్నారు. హేతువాద నాస్తిక ఉద్యమాలు మూఢశాస్త్ర ప్రచారాలకు, దేవుని పేరిట జరిగే మోసాలకు వ్యతిరేకంగానే కాక .. మతం పేరుతో సాంఘిక ఆర్థిక వ్యత్యాసాలను పెంచి పోషించే వ్యక్తులు, వ్యవస్థ, వర్గాలకువ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి శాస్త్రీయ దృక్పథంగల సమాజం వైపు నడిపిస్తుందన్నారు. ఇందుకోసం ఆగస్టు 16 న వనపర్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘ భవనంలో ‘నాసిక అధ్యయన తరగతులు, జిల్లా నాస్తిక సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కె విజయ్ కుమార్ ‘గతి తార్కిక భౌతిక వాదం’తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యులు అంబటి నాగయ్య ‘మతము -చరిత్ర’అంశాలపై ఉపన్యసిస్తారు అన్నారు. సభకు సిపిఐ జిల్లా నేత రమేష్ అధ్యక్షత వహిస్తారని, సిపిఐ జిల్లా నేత కే విజయరాములు, సిపిఎం జిల్లా నేత పుట్ట ఆంజనేయులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నేత మైత్రి యాదయ్య సందేశాలు ఇస్తారన్నారు. ఏఐటీయూసీ జిల్లా నేత గోపాలకృష్ణ ఆహ్వానం పలకగా, ఎస్ భక్తరాజ్ ముగింపు పలుకుతారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కరపత్రాల ఆవిష్కరణలో శ్రీరామ్, రమేష్ ,భక్తరాజ్, ప్రసాద్, శేఖర్, జనార్ధన్, గంధం నాగరాజు, వంశీ, బాలెమియా తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తి వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట మండలం, కానాయిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి శిరీష సాయి గారి చిన్న కుమార్తె గత రెండు రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న TX హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. అనంతరం చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని, అత్యంత జాగ్రత్తగా బిడ్డను చూసుకోవాలని ఆసుపత్రిలోని సంబంధిత వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నరోత్తం రెడ్డి గారు, వార్డు సభ్యులు కొత్త వెంకటయ్య గారు, బుగ్గపల్లి చిన్న వెంకటయ్య గారు, బుగ్గపల్లి శివాజీ తదితరులు చిన్నారిని పరామర్శించారు.
డా” నందిని సిద్ధారెడ్డి సాహిత్య సమాలోచన గ్రంథావిష్కరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి “సాహిత్య సమాలోచన” గ్రంథావిష్కరణ సభలో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా, గ్రంథావిష్కర్తగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రంథాన్ని ఆవిష్కరించి, తెలుగు సాహిత్యానికి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ సభలో సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు ఆచార్య మృణాళిని, ఆచార్య కోయ కోటేశ్వర్, నాలేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర 72వ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వనపర్తి వనపర్తి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 72వ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నేడు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వివి రమణ, వనపర్తి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి మన్మోహన్రావు, వెంకట్రామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ గౌడ్ లు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పాల్గొన్న క్రీడాకారులు ఎందరో వనపర్తి లో జరిగిన స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండే బాల్ బాడ్మింటన్ లో ప్రతిభను కనబరుస్తున్న క్రీడాకారులను ముందుగా అభినందించారు. క్రీడల వల్ల శారీరక దృఢవత్వమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా వారికి లభిస్తుందని తద్వారా వారు విద్యపై గాని ఇతర విధులపై గాని మనసులను లగ్నం చేసే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర టీం నుండి జాతీయస్థాయిలో పాల్గొని బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటి ట్రోఫీని అందుకునే ప్రయత్నం చేయాలని సూచించారుఅసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి వి రమణ, వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన్మోహన్రావు, వెంకటరామిరెడ్డిలు వనపర్తి లో జరుగుతున్న టోర్నమెంట్లో రాష్ట్రం నలుమూలల నుండి ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రీడాకారులు, ఎంపైర్లు, సెలెక్ట్ సెలెక్ట్ కమిటీ సభ్యులు, దాదాపు 250 మంది పాల్గొంటున్నారని వారు వివరించారు. టోర్నమెంట్లో విజేతల ఫలితాలను వనపర్తి జిల్లా బాల్పేట అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ గౌడ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఉమ్మడి జిల్లా జట్టుపై నిజామాబాద్ జిల్లా జట్టు 35 -29 35-14 తేడాతో గెలుపొందింది.ఖమ్మం జిల్లా జట్టుపై రంగారెడ్డి జిల్లా జట్టు 35-22, 35-14 తేడాతో విజయం సాధించింది. మహబూబ్నగర్ జిల్లా జట్టుపై వరంగల్ జిల్లా జట్టు 35-23, 35-10 పాయింట్లు తేడాతో విజయం సాధించింది.మహిళా విభాగంలో మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ మొదటి రౌండ్ లలో ముందంజలో ఉన్నాయి.పురుషుల విభాగంలో రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, జట్లు సెమీఫైనల్కు చేరనున్నాయి.మహిళా విభాగంలో వరంగల్ ,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జట్లు సెమి ఫైనల్ చేరనున్నాయి
మంత్రి పొన్నం ప్రభాకర్ కి పలు భవనాలను మంజూరు చేయాలని ప్రతిపాదనలిచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఆయన చాంబర్‌లో కలిసి పలు కీలక అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల నివేదికలను సమర్పించారు.వనపర్తి నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు, బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మొత్తం నాలుగు బీసీ సంక్షేమ విద్యాసంస్థల నూతన భవనాలు, అలాగే శాస్త్రీయ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌తో కూడిన జిల్లా రవాణా కార్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులోశాస్త్రీయ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌తో కూడిన జిల్లా రవాణా కార్యాలయ నూతన భవనం చిట్యాల, (వనపర్తి) ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలుర) నూతన భవనం కడుకుంట్లలో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల (బాలుర) నూతన భవనం పెబ్బేరులో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల (బాలికల) నూతన భవనం వెల్టూరులో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల (బాలికల) నూతన భవనాలు ఉన్నాయి వనపర్తి జిల్లాకు అవసరమైన రవాణా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు, బీసీ విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు అందించేందుకు ఈ భవనాల నిర్మాణం ఎంతో అవసరమని మంత్రి కి వివరించారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య, ప్రస్తుత వసతులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన భవనాలను మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఈ ప్రతిపాదనలను పరిశీలించి, ఆయా శాఖల పరిధిలో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే వీటికి మంజూరీలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పట్ల సానుకూలంగా స్పందింన మంత్రి గారికి ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రశ్నించే గొంతుకలకు మతం ఉరి : శ్రీరామ్ వనపర్తి ప్రశ్నించే గొంతుకలకు బిజెపి మతం ఉరి వేస్తోందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ వనపర్తి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరామ్, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ఆరోపించారు. శనివారం వనపర్తి పార్టీ ఆఫీస్ ఆవరణలో జాతీయ పార్టీ పిలుపుమేరకు ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ పోస్టర్లను ఆవిష్కరించారు. హిందుత్వ, రామ మందిరం పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజా సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నారు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను మతం దేవుని పేరు చెప్పు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాక్రో జనతా పార్టీ యువత నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో ఆందోళన చేస్తే క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేసిన చివరకు ప్రభుత్వం దిగివచ్చి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరించక తప్పలేదు అన్నారు. మార్పు మొదలైందని ప్రజలు తిరగబడితే తలవంచక తప్పదు అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను, అధిక ధరలు తగ్గిస్తామని సామాన్యులను, స్విస్ బ్యాంకు నుంచి నల్లదనం వెనక్కు తెచ్చి ప్రతి రైతు ఖాతలోరూ. 15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. స్వాతంత్రానికి ముందు నుంచి నేటి వరకు కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా విభజించి నిర్వీర్యం చేశారన్నారు. పారిశ్రామికవేత్తలు సంపన్నులకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకు రోజుకి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచారన్నారు. అమెరికాతో స్వేచ్ఛ వ్యాపార ఒప్పందంతో రైతులకు ఉరితాలు పేనారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వి బి జి రాంజీగా మార్చి మార్చి, 90% గా ఉన్న కేంద్ర వాటాను 40 కి తగ్గించుకోవడంతో పథకం ప్రమాదంలో పడిందన్నారు. వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. వనపర్తి లో చైతన్య యాత్ర ఆగస్టు 9 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ముగింపుగా సెప్టెంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, నేతలు కళావతమ్మ, రమేష్, మోష, శ్రీ రామ్, పృధ్వి నాదం, శేఖర్, చిన్న కుర్మన్న, వంశీ, శిరీష, లక్ష్మీనారాయణ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
కష్టజీవుల ద్రోహి బిజెపి.. గద్దె దించేందుకు పోరాడాలి : సిపిఐ వనపర్తి కష్టజీవుల ద్రోహి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వంక గోపాల్ పిలుపునిచ్చారు. సిపిఐ కేంద్ర కమిటీ పిలుపుమేరకు బిజెపి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పానగల్ మండలం తెల్లరాల్లపల్లి, కేతేపల్లి, వెంగలాయిపల్లి, బండపల్లి, బహదూర్ గూడెం చౌరస్తాల మీదుగా పాన్గల్ కు సుమారు పది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రను సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు,NFIW ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, కేతేపల్లి మాజీ సర్పంచ్ కళావతమ్మ ఎర్రజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు తెల్ల రాళ్లపల్లి, కేతేపల్లి, పానగల్ బస్టాండ్ లో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను, ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని రైతులను, ధరలు తగ్గిస్తామని సామాన్యులను, ఉపాధి కల్పిస్తామని కూలీలను మోసం చేశారన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా చేసి కార్మికుల హక్కులను కాలరాచారన్నారు. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో వారితో పోటీపడి మార్కెట్లో ఉత్పత్తులను అమ్మ లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్యుల కష్టాన్ని దోచి సంపన్నులకు పెట్టే పాలన సాగిస్తున్నారని చరమగీతం ఫలితాలు అన్నారు. సంపన్నులు దోపిడీకి వ్యతిరేకంగా రైతులు కార్మికులు అన్ని వర్గాలకు అండగా పోరాడుతుందని కార్మికరాజ్యం వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తుందన్నారు. మతం, అయోధ్య పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, రామ మందిరం నిధులు దోచుకున్న నరేంద్ర మోడీ మాట్లాడటం లేదన్నారు. మతంపై దేవునిపై బిజెపికి నమ్మకం లేదని అధికార ఒక్కటే వారి పరమావదని విమర్శించారు. దేశంలో సి జె పి పేరుతో యువత తిరగబడితే నరేంద్ర మోడీ తోకముడిచారని, శ్రమజీవులు తిరగబడితే బీజేపీ అధికారం మోసపు పాలన, సంపన్నులకు అనుకూల పాలన అంతమవుతుందన్నారు. పాదయాత్రల ప్రధాన డిమాండ్ అధిక ధరలు తగ్గింపు, యువతకు ఉద్యోగాలు, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, దళితులు ఆదివాసులపై దాడులు ఆపటం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయటం, బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు ప్రధాన డిమాండ్ తో పాదయాత్ర ఈనెల 6 నుంచి 14 వరకు జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, సిపిఐ వనపర్తి నియోజకవర్గం కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, కేతేపల్లి ఉప సర్పంచ్ కృష్ణవేణి, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, సిపిఐ మాజీ మండల కార్యదర్శి శివకుమార్, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ బాలస్వామి, చెన్నమ్మవార్డు సభ్యులు కురుమమ్మ, డంగు లక్ష్మి, మాజీ వార్డు సభ్యుడు పెంటయ్య, తెల్లర్లపల్లి, కేతేపల్లి, బొల్లారం, వెంగళాయిపల్లి సిపిఐ గ్రామ కార్యదర్శిసహదేవుడు,కాకం చిన్న నారాయణ, మల్లెపు బాలస్వామి, చల్మారెడ్డి, చిన్న ఎల్లయ్య, బయ్య కురుమయ్య, రామాంజనేయులు, మల్లేష్, భరత్, ఎస్ రాముడు, పరశురాముడు, మేస్త్రి రాముడు, తెలుగు లక్ష్మి, దేవమ్మ, వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు