భూ వివాదాల్లో చట్టాన్ని గౌరవించి కోర్టును ఆశ్రయించాలి : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి
ప్రజలకు సత్వర, పారదర్శక, న్యాయబద్ధ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ప్రజల నుంచి నేరుగా 25 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు సివిల్ స్వభావం కలిగినవని, వాటికి శాశ్వత పరిష్కారం కోర్టు ద్వారానే సాధ్యమని స్పష్టం చేసిన ఎస్పీ, భూ వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, బెదిరింపులు, దౌర్జన్యాలు లేదా మోసాలకు పాల్పడితే పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, వేగవంతమైన స్పందనతో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, న్యాయం మా ప్రధాన కర్తవ్యమని ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం, న్యాయం లక్ష్యంగా పోలీసుశాఖ ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
