ఎల్‌నినో కమిటీ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకం హర్షణీయం వనపర్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి ని నియమించడం హర్షించదగిన విషయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడం, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతమైన కార్యాచరణ అమలు అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డా. జి. చిన్నారెడ్డి గారి అనుభవం, పరిపాలనా దక్షత రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో కమిటీ సమర్థవంతంగా పనిచేసి రైతాంగానికి, ప్రజలకు అండగా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు
AICC SC డిపార్ట్‌మెంట్ రాష్ట్ర కార్యవర్గంలో కొంకి వెంకటేష్ కి చోటు వనపర్తి వనపర్తి నియోజకవర్గం గోపాల్‌పేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకి వెంకటేష్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఎస్సీ డిపార్ట్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజా సేవా దృక్పథంతో ఎంతోకాలంగా పనిచేస్తున్న కొంకి వెంకటేష్ గారికి ఈ పదవి రావడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ విభాగం అభివృద్ధికి మరింత కృషి కృషి చేయాలని ఆకాంక్షించారు కొంకి వెంకటేష్ గారికి లభించిన ఈ గౌరవం వనపర్తి నియోజకవర్గానికి, ముఖ్యంగా గోపాల్పేట మండల కాంగ్రెస్ శ్రేణులకు గర్వకారణమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
స్కావెంజర్ పనులు చేయాలని వేధిస్తే ఊరుకోం : మోష వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం స్లీపర్లను కొందరు హెడ్మాస్టర్లు టీచర్లు స్కావెంజర్లు పనులు కూడా చేయాలని వేధిస్తున్నారని ఇలా చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్లీపర్ల యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడు మోష హెచ్చరించారు. ఆదివారం వనపర్తి ఆఫీస్ లో అభిమన్యు అధ్యక్షతన నిర్వహించిన వనపర్తి జిల్లా స్వీపర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ బడులలో పార్ట్ టైం స్వీపర్లుగా వారిని మొదట రూ. 75 వేతనంపై నియమించిందని తర్వాత పలు పోరాటాల ఫలితంగా రూ.1643, ఇప్పుడు రూ. 5200 కు పెంచిందన్నారు. వారికి రోజుకు రూ. 170 మాత్రమే పడుతుందన్నారు. ఉపాధి హామీ కూలికి కూడా రోజు రూ.307 ఇస్తున్నారని ఇది అంతకంటే చాలా తక్కువ అన్నారు.ఉదయమే పాఠశాలలు ఊడ్చి శుభ్రం చేయడం, తాగునీళ్లు పెట్టటం మాత్రమే వారి పనులు అన్నారు. తర్వాత ప్రభుత్వం పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రం చేయటం మొక్కలకు నీళ్లు పెట్టటానికి అదనంగా స్కావెంజర్లను నియమించింది అన్నారు. ఏవో కారణాలవల్ల స్కావెంజర్లను ప్రభుత్వం తొలగించిందని,ఈ కారణంగా పాఠశాలల్లో ఉండే హెచ్ఎంలు స్వీపర్ పనితో పాటు స్కావెంజర్ పనులు కూడా చేయాలని, రోజంతా పాఠశాలలోనే తమతో పాటు పని చేయాలని వేధిస్తున్నారన్నారు. పార్ట్ టైం స్వీపర్లు రూ. 170 వేతనానికి రోజంతా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. తమను వేధిస్తున్నట్లు పలు పాఠశాలల స్వీపర్లు ఫిర్యాదులు చేస్తున్నారని, కొత్తకోట మండలంలో వేధింపులు మరి ఎక్కువగా ఉన్నాయన్నారు. పార్ట్ టైం స్వీపర్లు ఫుల్ టైం ఎలా పనిచేస్తారని, హెచ్ఎంలు ఉపాధ్యాయులు ఆలోచించాలన్నారు. స్కావెంజర్ల పనులు స్వీపర్లను చేయమని వేధించటం ఆపాలన్నారు. వారికి చేతనైతే ప్రభుత్వం నుంచి ఫుల్ టైం ఉద్యోగులుగా ఆర్డర్ ఇప్పించి అప్పుడు అడగాలన్నారు. స్వీపర్లను రెగ్యులర్ చేయాలని కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దశల వారి పోరాటం చేస్తామన్నారు. ఈనెల 30వ తేదీన పెబ్బేర్ లో ఏఐటియుసి జిల్లా మహాసభలు జరుగుతాయని జిల్లాలోని స్వీపర్లు సభలకు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, స్వీపర్ల నేతలు గోపాల్ గౌడ్ మాలిక్ శోభారాణి చంద్రమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కిష్టగిరి గ్రామంలో భూముల సమగ్ర రీ-సర్వే అవగాహన సదస్సు (గ్రామసభ) పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ వనపర్తి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “భూ భారతి” భూముల సమగ్ర రీ-సర్వే కార్యక్రమం పై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో శనివారం ఒక ప్రత్యేక గ్రామసభ (అవగాహన సదస్సు) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు, హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో (రోవర్స్, డీజీపీఎస్ విధానం ద్వారా) ఈ రీ-సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని వివరించారు. ప్రతి అంగుళం భూమికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, వివాదరహిత భూ రికార్డులను రూపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. రైతులందరూ క్షేత్రస్థాయికి వచ్చే సర్వే బృందాలకు సహకరించి, తమ భూములకు సంబంధించిన సరైన వివరాలను అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సదస్సులో పాల్గొన్న ఉన్నతాధికారులు రీ-సర్వే ప్రక్రియ, రికార్డుల నమోదు, తదుపరి కేటాయించే ‘భూధార్’ ఐడీ కార్డుల ప్రాధాన్యత గురించి గ్రామ ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. గ్రామంలోని రైతులు అడిగిన పలు అనుమానాలకు అధికారులు వేదికపైనే నివృత్తి చేశారు. ఈ అవగాహన సదస్సులో సహాయ సంచాలకులు (AD SLR) శ్రీనివాసులు, వనపర్తి ఆర్డీఓ (RDO) సుబ్రహ్మణ్యం, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, వనపర్తి ఎంపీడీఓ (MPDO), మండల పరిషత్ అధికారి (MPO), కిష్టగిరి గ్రామ సర్పంచ్, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు (గ్రామ స్థాయి అధికారులు) మరియు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సర్”ప్రక్రియలో పాల్గొంటూనే ప్రజా సమస్యలు గుర్తించండి వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా “సర్”జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తూ ఈరోజు బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి పెద్దమందడి మండలంలో విస్తృతంగా పర్యటించారు. చిలుకటోనీపల్లి, బలీదుపల్లి, వెల్ టూరు,మదిగట్ల, మోజర్ల,చిన్న మందడి,పెద్ద మందడి, జగత్పల్లి గ్రామాలలో ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి బి.ఆర్.ఎస్ శ్రేణులు,బి.ఎల్. ఓలు అర్హులైన ఓటర్స్ తుది జాబితాలో ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు కార్యకర్తలు ప్రతిరోజూ సర్ ప్రక్రియలో పాల్గొంటూనే ప్రజా క్షేత్రంలో సమస్యలు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డివెంట వాకిటి శ్రీధర్ ,జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి,వేణు యాదవ్,కుమార్ యాదవ్,అశోక్,సేనాపతి,పురుషోత్తంరెడ్డి,కురుమూర్తి,శ్రీనివాసులు,మొగిలయ్య,వెంకటన్న,ఆంజనేయులు,నరసింహ, హనుమంత్, బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
స్పెషల్ బ్రాంచ్ సమాచారమే జిల్లా భద్రతకు బలమైన కవచం : జిల్లా ఎస్పీ వనపర్తి స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ నేర నియంత్రణలో ముఖ్యమైన సహకారం అందిస్తోందని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు , సిబ్బందితో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి స్పెషల్ బ్రాంచ్ విభాగం పనితీరును ప్రశంసిస్తూ, మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా భద్రతా వ్యవస్థలో కీలక స్థంభం స్పెషల్ బ్రాంచ్ అందిస్తున్న సమాచారంతో నేరాలను ముందుగానే అడ్డుకోవడం సాధ్యమవుతోంది. ఇదే ఉత్సాహంతో మరింత క్రమశిక్షణతో, పారదర్శకతతో పని చేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి. ప్రతి పని సమయానికి పూర్తి చేయడం ద్వారా పోలీసుశాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ, ఉద్యోగ (Job) వెరిఫికేషన్లు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీ, ఇతర విభాగాలకు సమన్వయంతో సహకారం అందించడం అన్ని అంశాల్లో స్పెషల్ బ్రాంచ్ పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పర్వతాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ కృషి చేయాలి : జిల్లా ఎస్పీ వనపర్తి కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీసుశాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శనివారం జిల్లాపోలీసు కార్యాలయంలో కోర్ట్ లైజన్ , కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ లతో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్., గారు సమావేశం నిర్వహించి కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం, నిందితులకు చట్టపరమైన శిక్షలు ఖచ్చితంగా పడేలా చర్యలు తీసుకోవడంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కేసుల్లో నిందుతులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు అనుగుణంగా కేసులు పెండింగులో లేకుండా చూసుకోవాలని అన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. సాక్షులను,బాధితులను సమయానికి కోర్టులో హాజరు పరిచేలా చూసుకోవాలని, బాధితులకు,సాక్షుల కు కేసుకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలని అన్నారు. కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సై లకు తెలియజేయాలని, అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి పలువురు కోర్టు కానిస్టేబుళ్లను అడిగి కేసుల పురోగతిపై సూచనలు చేశారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్స్,(NBW) సమన్స్ సమీక్షించి త్వరగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ కోర్టులో హాజరుపరిచి NBW లను పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, డిసిఆర్భి డిఎస్పీ, బాలాజీ నాయక్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి, జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
సర్”(ఓటర్ జాబితా సవరణ)సామాజిక బాధ్యత వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి సర్ ” ప్రక్రియను వేగవంతం చేయాలని బి.ఆర్.ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తూ వనపర్తి మండలములో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా చందాపూర్, దత్తాయిపల్లి,శ్రీనివాసపూర్,చిన్నగుంటపల్లి, అప్పాయిపల్లి, నాగమ్మ తండా, కాసింనగర్ , తదితర గ్రామాలలో ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి బి.ఎల్. ఓలకు బి.ఆర్.ఎస్ శ్రేణులకు పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా “సర్ “ప్రక్రియ పొడిగింపు విషయములో రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ కృషి చేసిందని మన శ్రేణులు అప్రమత్తమై అర్హులైన ఓటర్స్ తుది జాబితాలో ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వెంట మాణిక్యం, రఘువర్ధన్ రెడ్డి,ధర్మా నాయక్,మాధవ్ రెడ్డి,దేవర్ల.నరసింహ,మహేశ్వర్ రెడ్డి,నరేష్, విష్ణు యాదవ్, కుమ్మరి సత్యం, గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు ఉన్నారు.
I.I.I.T లో ప్రతిభ చూపిన విద్యార్థికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానం వనపర్తి పట్టణంలోనీ 11వార్డు(రాం నగర్ కాలనీ)కి చెందిన నాగనమోని.శ్రీలత రాములు కుమారుడు తేజేశ్వర్ ఇటీవల జరిగిన I.I.I.T పోటీ పరీక్షలలో ఆల్ ఇండియా స్థాయిలో 792ర్యాంక్ సాధించి గుజరాత్ రాష్టం గాంధీనగర్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో తేజేశ్వర్ ను సన్మానించి అభినందించారు. I.I.I.T లో తేజేశ్వర్ సీటు సాధించి పట్టణ ప్రతిష్ఠ పెంచడం హర్షణీయమని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి పేద ప్రజలకు సేవచేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ప్రశంసించారు. నూతన వస్త్రాలు బహుకరించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కె.మాణిక్యం,కౌన్సిలర్ స్వాతి హరిబాబు,రఘువర్ధన్ రెడ్డి,ధర్మా నాయక్, హేమంత్ ముదిరాజ్ గంగ ప్రసాద్,మహేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు
జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం. లింగాచారి వనపర్తి వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఇటీవల వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎం. లింగాచారి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, నూతన బాధ్యతలలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు,శాఖ ఎక్సైజ్ శాఖల మధ్య సమన్వయం ప్రజా ప్రయోజనాల సాధనలో కీలకమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం తయారీ మరియు రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంలో రెండు శాఖలు సమిష్టిగా పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతలను కాపాడటం ప్రతి ప్రభుత్వ శాఖ యొక్క ఉమ్మడి బాధ్యతని పోలీసు, ఎక్సైజ్ శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తూ అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉండాలని ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి కలిసి కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.