VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది వనపర్తి వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహాసభ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు సమాజ అభివృద్ధిలో, వ్యాపార రంగంలో, సేవా కార్యక్రమాల్లో విశిష్ట పాత్ర పోషిస్తున్నారన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య సమాజాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తోందని, వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్యవైశ్య మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తోందని పేర్కొంటూ, వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఆర్యవైశ్య ఆడబిడ్డ శ్రీమతి మాధవి రమేష్ గారికి అవకాశం కల్పించడం ఒక నిదర్శనమని అన్నారు. ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యుల వ్యాపారాభివృద్ధి, స్వయం ఉపాధి, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వనపర్తిలో వ్యాపారం చేసుకుంటున్నా ఆర్యవైశ్యులందరూ ప్రశాంతంగా వారి వారి పనులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, వడ్డీ లేని రుణాలు, రైతు సంక్షేమ పథకాలు, అర్హులకు కొత్త రేషన్ కార్డులు వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఆర్యవైశ్యుల ఐక్యత సమాజానికి ఆదర్శమని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ రాష్ట్ర ఆర్యవైశ్య నేతలు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు కలకొండ రమేష్ చంద్ర కొండ్ల మల్లికార్జున్ మల్లిపెద్ది శంకర్ ఆర్ గణేష్ గుప్తా మహిళ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సామ్రాజ్యలక్ష్మి జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనపర్తి మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాధవి వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ పాలాది శ్రీనివాసులు నాగ బంద్ యాదగిరి ఇటికూరి వీరయ్య జర్నలిస్ట్ నాగబంది వెంకటరమణ పూరి సురేష్ పెబ్బేరు రమేష్ గుప్తా ఇటుకూరి బుచ్చయ్య పట్టణ అధ్యక్షులు బచ్చురాం జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు భీమ ప్రసన్నలక్ష్మి ఉపాధ్యక్షురాలు పిన్న వసంత నరేందర్ వై వెంకటేష్ చిదిరి రాజు ఆలుగడ్డ శ్రీనివాసులు కలకొండ శ్రీనివాసులు మారం గోవిందు గుప్తా ఆకుతోట రాఘవేందర్ వనపర్తి జిల్లాలోని చిన్నంబాయి పెబ్బేరు కొత్తకోట ఆత్మకూర్ పెద్దమందడి మండలాలకు చెందిన ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Read More »

ఓటమి, గెలుపులతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలలో నాయకులు ఉండాలి వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో పట్టణంలో “సర్”(ఓటర్ జాబితా సవరణ)జరుగుతున్న విధానాన్ని ముఖ్య నాయకులు,బి.ఆర్.ఎస్ పార్టీ బి.ఎల్. ఏలతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణములో మరింత చురుకుగా పనిచేసి మందకొడిగా సాగుతున్న ఓటర్ జాబితా నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బి.ఎల్. ఏలు “సర్”ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ అధికారులు చెబుతున్నారు అని రాష్ట్రంలో నిజమైన ప్రజాసంక్షేమ పాలన రావాలంటే నీతిమాలిన రాజకీయాలు పోయి నిజమైన ఓటర్లు గుర్తింపు పొందాలని అందుకే నాయకులు,కార్యకర్తలు,బి.ఎల్. ఏలు నిత్యం శ్రమించి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని ఓటర్ నమోదుతో పాటు వారి సమస్యలు కూడా గుర్తించి పరిష్కారదిశగా కృషి చేస్తూ నిత్యం ప్రజలలో ఉండాలని పిలుపునిచ్చారు. పట్టణ నాయకులు ఈ పదిరోజులు బూతులవారిగా తిరగడంవల్ల అవగాహనతో పాటు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ఈ సమీక్షలో పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,గట్టు యాదవ్,బి.లక్ష్మయ్య, వాకిటి.శ్రీధర్,కురుమూర్తి యాదవ్, కౌన్సిలర్స్ ఉన్నారు.

Read More »

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వనపర్తి పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని 40 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారి సమన్వయంతో రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు డీడీలు చెల్లించి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితికి పూర్తిగా ముగింపు పలికిందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రస్తుతం రైతులు డీడీ చెల్లించిన రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరవుతున్నాయని, మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్లను పారదర్శకంగా రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరైన ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా వాటిని క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, పెబ్బేరు పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, సురేందర్ గౌడ్, రంజిత్ కుమార్, యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి వనపర్తి వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అధికారులు సమష్టిగా పని చేసి విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో సి.యం సెక్యూరిటీ ఎ.ఎస్.ఎల్ కార్యక్రమానికి సి.యం స్పెషల్ సెక్యూరిటీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. కొత్తకోట సంత వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు ఎ.ఎస్.ఎల్ కాన్వాయి నిర్వహించిన అనంతరం పాఠశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ పై ఉన్న ప్రత్యేక దృష్టి కారణంగా కేవలం ఒక పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్నారని, ఈ ప్రభుత్వ కార్యక్రమానికి అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ హెలిప్యాడ్ ఏర్పాటు, బారికేడింగ్ బాధ్యతలను ఆర్ అండ్ బి అధికారులకు బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేశారు. వేదిక, విద్యార్థులను తీసుకురావడం, పద్ధతిగా కూర్చోబెట్టడం జిల్లా విద్యా అధికారికి బాధ్యతలు అప్పగించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైవ్ కవరేజీ వంటివి చూసుకోవాలని సమాచార శాఖ అధికారిని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో రాజీ లేకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి మాట్లాడుతూ పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ కంట్రోల్, వేదిక వద్ద ముఖా ముఖి కార్యక్రమం సజావుగా జరిగే విధంగా పోలీస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కార్యక్రమం ఆసాంతం ప్రశాంతంగా నిర్వహించే విధంగా చూడాలని పోలీస్ అధికారులకు, బాధ్యతలు అప్పగించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సి.యం. సెక్యూరిటీ ఇంచార్జి శ్రీధర్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.

Read More »

ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వనపర్తి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) CPM పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెబ్బేరు మండల విద్యా అధికారి ఎంఈఓ కి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పెబ్బేరు మండలంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలపై సర్వే నిర్వహించడం జరిగింది . సర్వేలో వచ్చిన సమస్యలను సిపిఎం పార్టీగా ఎంఈఓ జయ రాములు కి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు , సిపిఎం కార్యదర్శి మాజీ ఎంపీటీసీ జి బాలయ్య మాట్లాడుతూ పెబ్బేరు మండలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తూ ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు 21 వేల రూపాయలు నాలుగో తరగతి ఐదో తరగతి విద్యార్థులకు 30 వేల రూపాయలు పైతరగతులకు 50 వేల నుండి 60 వేల రూపాయల వరకు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు పాఠ్యపుస్తకాల పేరుతో వేల వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు స్కూల్ యూనిఫాంలో పేరుతో ప్రైవేటు పాఠశాల యజమాన్యమే వ్యాపారాలు చేస్తూ వేల రూపాయలు గడిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారు కోర్టు తీర్పు 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అమలు చేయాలి కానీ వాటిని నిబంధనలకు ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు పాటించటం లేదు నిబంధనల ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు ఏ తరగతి విద్యార్థికి ఎంత ఫీజు తీసుకోవాలో నోటీస్ బోర్డులో రాయాలని కోరారు ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సిపిఎం పోరాటాలు ఉదృతం హెచ్చరించారు ఈ సిపిఎం నాయకులు ఆర్ భాస్కర్ ఎం వెంకటస్వామి పి ఊసన్న జి మన్యం తదితరులు పాల్గొన్నారు

Read More »

అర్హుల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత బిఆర్ఎస్, బి.ఎల్. ఏలు తీసుకోవాలి వనపర్తి అర్హుల ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రెవల్లి గ్రామ పంచాయతీలో నాయకులతో కలసి “సర్”(ఓటర్ జాబితా సవరణ) జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సమయం లేనందున బి.ఎల్.ఏలు ప్రత్యక్షంగా ప్రజలను కలసి వారికి అవగాహన కల్పించి తుది డ్రాప్టింగ్ లో ఖచ్చితంగా ఓటు నమోదు చేయించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ సరస్వతి గారిని అడిగి మండలములో జరుగుతున్న సర్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలుసుకున్నారు. కొన్ని బూతులలో బి.ఎల్. ఓలకు ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల వారిపై తీవ్ర ఒత్తిడి ఉందని అవసరమైన సిబ్బందిని సమకూర్చి సకాలములో ఓటర్ జాబితా సవరణ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు నిరంజన్ రెడ్డి వెంట శివరామ్ రెడ్డి,ఖాజా, భాస్కర్ రెడ్డి,నిరంజన్,సుధాకర్ రెడ్డి,బి.ఎల్. ఓలు హైమావతి, హరీశ్వర్ రెడ్డి ఉన్నారు

Read More »

చింతల హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు వనపర్తి ఆషాఢ మాసం అంత్యంత పవిత్రమైన ‘ముహూర్త శైవయోగం’ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ ఆలయంలో ఉన్న పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 13న ఏర్పడిన ఈ పవిత్ర శైవయోగం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారని, పరమశివునికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ పరమశివుడి కృపాకటాక్షాల వలన ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు

Read More »

తగ్గిన వర్షాలతో రైతుల ఆందోళన ఆదుకోవాలి : రాబర్ట్ వనపర్తి ఎల్ నినో ప్రభావంతో తగ్గిన వర్షాలతో సాగుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి రాబర్ట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రం 17 జిల్లాలలో లోటు వర్షపాతం నమోదయిందన్నారు. వనపర్తి జిల్లాలో వర్షాలు తగ్గటంతో 7.39 శాతం భూమి సాగు అయిందన్నారు. పడిన కొద్దిపాటి వర్షాలకే పత్తి కంది తదితర మెట్ట పంటలను వేసినా మొలకెత్తక నష్టపోయారన్నారు. భూగర్భ జలం తగ్గటంతో బోర్లు కూడా నీరు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోందని,వరికి బదులు ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు పండించే రైతులకు ఎకరాకు రూ. 8000 ప్రోత్సాహక నగదు అందజేయాలన్నారు. నకిలీ కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, మెట్ట పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. పంట మార్పిడి కోసం అవసరమైన చర్యలు అవగాహన కల్పించాలన్నారు. పండించిన మెట్ట పంటకు గ్యారెంటీగా మద్దతు ధర లభించేందుకు మార్కెట్ శక్తులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అన్ని స్థాయిల్లో ఆదుకునేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు కే ఎల్ ఐ భీమా జూరాల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలన్నారు. పాలమూరు రంగారెడ్డి మొదటి మోటారు వెట్ రన్ కు అధికారులను సీఎం ఆదేశించారని, ఇది శుభ పరిణామమని, అలాగే ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే రైతులను సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. నేతలు రమేష్, యూసుఫ్, వంశీ పాల్గొన్నారు.

Read More »

సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి వనపర్తి పెబ్బేరు మండల కేంద్రంలో జి సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించి విజయవంతం చేయాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ప్రచారాన్ని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు మూలస్తంభమని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు, ఓటరు జాబితాలో పేరు లేకపోయిన వారు, చిరునామా మార్పు, పేరు లేదా ఇతర వివరాల సవరణ, తొలగింపు వంటి సేవలను ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా పొందవచ్చని తెలిపారు. ఓటరు జాబితా పరిశుభ్రంగా, పారదర్శకంగా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే సంబంధిత బూత్ లెవల్ అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ప్రజలకు ఈ కార్యక్రమంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ చేపట్టిన ఆటో ప్రచారం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి వార్డు, ప్రతి వీధి, ప్రతి కాలనీకి ఈ ప్రచారం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి ఈ కార్యక్రమం గురించి తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, బాధ్యతాయుతమైన ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకునేందుకు ముందుగా ఓటరు జాబితాలో పేరు నమోదు కావడం తప్పనిసరి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ లు సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Read More »

రాజకీయ జగడాలు కాదు.. సాగు జలాలు ఇవ్వాలి: కూనంనేని సాంబశివరావు వనపర్తి రాష్ట్రంలో రాజకీయ దిగడాలు మాని సాగు జలాలను అందించేందుకు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సిపిఐ ఉమ్మడి జిల్లా మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి రిజర్వాయర్ నింపి నీళ్లు ఇవ్వాలని హరీష్ రావు, కేటీఆర్, నింపితే తెగి కొట్టుకుపోయి నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని దీనిపై నీచ రాజకీయాలు, బూతు పురాణం సరికాదని, సంయమనం పాటించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ వ్యాఖ్యలను తీరును సిపిఐ ఖండిస్తోందన్నారు. మూడేళ్ల క్రితం కాలేశ్వరం పిల్లర్లు కుంగుబాటుపై మూడేళ్ల క్రితం నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ పరిశీలించి సిడబ్ల్యుసికి నివేదిక పంపిన ఇంతవరకు సిడబ్ల్యుసి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాలేశ్వరం విషయంలో రాజకీయ నిర్ణయాలు సరికాదని సిడబ్ల్యుసి నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం తెలంగాణ ఏ ప్రాజెక్టుకు ఇంతవరకుజాతీయ హోదా ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రకు పోలవరం కు జాతీయ హోదా కల్పించినందుకు తెలంగాణ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తేనే సమన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల కెఎల్ఐ నెట్టెంపాడు బీమా కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని ఐదు ఆరు లక్షల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. భారత గడ్డపై సిపిఐ కి వందేళ్లు దాటిందనా ప్రజల పక్షాన నిటారుగా నిలబడి రాజీలేని పోరాటం చేస్తోందని, సమరశీల పోరాటాల ద్వారా ఎర్రజెండా మరింత ఎరుపెక్కిందన్నారు. కమ్యూనిస్టు పార్టీపై కారుకూతలు కూసేవారు ఒక్కరోజైనా కమ్యూనిస్టుగా బతికితే దాని మాధుర్యం తెలుస్తుందని, మనిషి మనిగడ కోసమే పుట్టిన సిద్ధాంతం కమ్యూనిజం అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎర్రజెండా పోరాట చాయలు ఉంటాయని దోపిడీ రహిత పేదల రాజ్యం స్థాపించడమే ఎర్రజెండా లక్ష్యమన్నారు. రాజకీయ శిక్షణ తరగతులు పార్టీకి జీవం లాంటివని తాజా రాజకీయ అంశాలతో పాటు సిద్ధాంతాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంధితగా పయనిస్తుందని దాన్ని దాచి పెట్టేందుకే నరేంద్ర మోడీ పొదుపు మంత్రం పటిస్తున్నారన్నారు. హిందుత్వ ఎజెండాతో ఓట్ల లబ్ది పొందేందుకు, రాజ్యాంగ వ్యవస్థను తుంగలో తొక్కినందుకు రాజ్యాంగ పీడికకు బిజెపి ఉరితాళ్లు పేనుతోందన్నారు. దేశ సంపద కొందరి చేతిలో కేంద్రీకృతమయ్యే విధానాలను అనుసరిస్తుందని, పేదల సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, అలాంటప్పుడు కార్పొరేట్లకు బహుళ జాతి కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఉచితపథకాలపై విష ప్రచారం చేస్తున్న కేంద్రం, మౌన జాతి కంపెనీలకు ఇస్తున్న లక్షల కోట్ల రాయితీపై ఎందుకు ప్రచారం చేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, పేదల గుడిసెలను కూలిస్తే పాలకుల గుండెల్లో గుణపాలు దిగుతాయని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 9 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నామని సెప్టెంబర్ 1న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలన్నారు. ఈరోజు సిపిఐ నేత జితేందర్ రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ విప్లవోద్యమ చరిత్ర అంశంపై తరగతులు బోధించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ, రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య, కేశవులు గౌడ్, సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి గద్వాల జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు నారాయణపేట జిల్లా కార్యదర్శి నరసింహులు వివిధ జిల్లాల నాయకులు రమేష్ సురేష్ శ్రీరామ్ మోష శ్రీహరి గోపాలకృష్ణ రాబర్ట్ భాస్కర్ అబ్రహం డంగు కుర్మయ్య రవీందర్ వంక గోపాల్ కాకం బాలస్వామి కృష్ణవేణి గీత శ్యామల చెన్నమ్మ లావణ్య కురుమ లక్ష్మి శ్రీ విద్యా పద్మావతి భార్గవి ఇందిరా సంతోష్ శ్రీను దేవానంద్ పెంటయ్య లక్ష్మీపతి నరసింహ శెట్టి లక్ష్మీనారాయణ శెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

Scroll to Top