VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

యువత ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి వనపర్తి కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా మే 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వనపర్తి జిల్లా నుంచి జాబ్ మేళాలో వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన 17 మందికి ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతకు కలెక్టర్, ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా, యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫుట్‌బాల్, వాలీబాల్, హాకీ తదితర క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి క్రీడలు ఎంతో అవసరమని, ఫిట్‌నెస్‌ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖ కు సంబంధించిన బ్రాండింగ్ కిట్లను కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారూ

Read More »

నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డితో కలిసి శనివారం వనపర్తి పట్టణంలోని శ్రీనివాసపూర్‌లో రూ.7.50 కోట్ల (రూ.5 కోట్లు ఇప్పటికే మంజూరు కాగా, అదనంగా మరో రూ. 2.50 కోట్ల) వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ భవన నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ మ్యాప్‌ను పరిశీలించి, జరుగుతున్న నిర్మాణ పనులను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భవనం వద్ద నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్మించాలని, అలాగే కాంపౌండ్ వాల్ మరియు ఎలివేషన్ పనులను ఆకర్షనీయంగా, నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. భవన నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న వారికి ఇంటి స్థలాలు అందజేస్తామని ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి హామీ ఇచ్చారు. భవన నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఈ ఈ విజయ్ మోహన్, డి ఈ లక్ష్మి నారాయణ, ఏ ఈ భాస్కర్, తహసీల్దార్ రమేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ వనపర్తి ఉమ్మడి గోపాల్ పేట రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన వరి,మక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దాదాపు 4గంటల పాటు ఎర్రటి ఎండలో ధాన్యం రోడ్డుపై పారబోసి ధర్నాకి దిగారు. ధాన్యాన్ని తరుగు లేకుండా తడిసిన ధాన్యాని కూడా ప్రతి గింజతో సహా కొనుగోలు చేయాలని డిమాండ్ రైతులకు సంఘీభావం తెలిపిన జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ రైతులు ఉసురు పోసుకున్న రేవంత్ ప్రభుత్వం ఆగం కాక తప్పదు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కన్నీటితో తమ పంట తగలబెట్టుకుంటే ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సహించరానిది అని దుయ్యబట్టారు.జిల్లా కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా ధర్నా విరమించమని రైతులు పట్టు బట్టారు. రైతుల ధర్నాకు అశోక్ చివరిదాకా ఉండి సంఘీభాం తెలిపారు. ఈ కార్యక్రమములో రమేష్ మాజీ సర్పంచ్,చంద్రశేఖర్,మన్నే నాయక్,రాజేష్,నరసింహ,తదితరులు ఉన్నారు.

Read More »

అధికారులు బాధ్యతాయుతంగా ప్రజల అర్జీలని సత్వరం పరిష్కరించి న్యాయం చేయాలి వనపర్తి దళారీ వ్యవస్థ అనేది సమూలంగా లేకుండా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల అర్జీలపై నిర్లక్ష్యం వద్దని, వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఉన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు తోడుగా అదనంగా మరిన్ని పథకాలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. విద్యా వైద్యంపై ప్రధాన దృష్టి సారించి, వీటికి ప్రధానంగా నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రజల అర్జీలను, దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. దళారీ వ్యవస్థ అనేది సమూలంగా లేకుండా చేయాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల అర్జీలపై నిర్లక్ష్యం వద్దని, వాటిని వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఎటువంటి సమస్య లేకుండా భూభారతి కి సంబంధించి రైతుల నుంచి వచ్చే అర్జీలను శరవేగంగా పరిష్కరించాలని సూచించారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు పరిమితులకు లోబడి ఇండ్లను నిర్మించుకోవాలని, పరిమితికి మించి ఇండ్ల నిర్మాణం చేసుకోవడం ద్వారా తిరిగి అప్పులపాలయ్యే అవకాశం ఉంటుందని ఆ దిశగా అధికారులు పర్యవేక్షణ సాగించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతి వ్యక్తికి సరైన సమాచారం అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 65 ఏళ్లలో కేవలం రాష్ట్ర అప్పు రూ. 65 వేల కోట్లు ఉంటే, గత ప్రభుత్వం పది ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. యువత పక్కదారి పట్టకుండా, డ్రగ్స్ వైపు మల్లకుండా క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయం ఛైర్మెన్ గోవర్ధన్ సాగర్, వనపర్తి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ మాధవి, పెబ్బేరు మునిసిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కొత్తకోట మునిసిపల్ ఛైర్పర్సన్ అరుణ, ఆత్మకూరు మునిసిపల్ ఛైర్పర్సన్ నాగమణి, అమరచింత మునిసిపల్ ఛైర్పర్సన్ సువర్ణ, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్డివో సుబ్రహ్మణ్యం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పుష్పాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వనపర్తి పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన బోడి కృష్ణయ్య రేణుకల కుమార్తె సాహితి పుష్పాలంకరణ కార్యక్రమానికి గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిల్లల జీవితాల్లో కొన్ని మర్చిపోలేని రోజులు ఉంటాయని అలాంటి వాటిని తల్లిదండ్రులు వేడుకగా చేసుకోవడం అభినందించాల్సిన అవసరం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బంధుమిత్రులతో ఐక్యత నెలకొంటుంది అన్నారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు యువకులు తదితరులు పాల్గొన్నారు

Read More »

చేతి రాత విద్యార్థుల జీవితంపై ప్రభావం చూపుతుంది వనపర్తి విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై చక్కని ప్రభావం చూపుతుందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం స్థానిక రేడియంట్ హై స్కూల్ లో న్యూ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేతిరాత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల అందమైన చేతిరాత వారిలో క్రమ శిక్షణను,ఏకాగ్రతను, తప్పులు లేకుండా రాసే చిత్తశుద్ధిని అలవాటు చేస్తుందన్న పరిశోధకుల అభిప్రాయాన్ని గుర్తు చేశారు.చక్కని చేతిరాత విద్యార్థులకు మంచి మార్కులను,గురువుల అభిమానాన్ని పొందేలా చేస్తుందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.వేసవి సెలవులలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ వైపుగా ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన తెలిపారు.ఈనాటి కార్యక్రమంలో చేతిరాత శిక్షణ నిపుణులు తరుణ్ మాస్టర్,వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్,రామన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మెన్ దేశి రాములు,బండారు శ్రీనివాస్,నాగేశ్వర రెడ్డి,మద్దిలేటి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక క్రీడావారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయ మైదానంలో హుషారుగా సాగిన క్రికెట్ టోర్నమెంట్ వనపర్తి క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని, యువత క్రీడలను అలవాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో గురువారం క్రికెట్ టోర్నమెంట్‌ను ఉత్సాహ భరితంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో పోలీసు, రెవెన్యూ, ప్రెస్ మీడియా, ఉపాధ్యాయుల జట్లు పాల్గొన్నాయి. హుషారుగా సాగిన ఈ పోటీల్లో పోలీసు జట్టు విజేతగా నిలవగా, ఉపాధ్యాయుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు . అదనపు ఎస్పీ రాజేష్ మీనా పోలీసు జట్టుకు నాయకత్వం వహించి అర్ధశతకం సాధించారు. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మ్యాచ్‌ను వీక్షించి క్రీడాకారులను అభినందించారు. టోర్నమెంట్ విజేతలు మరియు రన్నరప్ జట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, ఎల్ ఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని, యువత క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. శారీరక దారుఢ్యం క్రీడల ద్వారానే సాధ్యమని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. డిఐజి ఎల్ ఎస్ చౌహన్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. ఏ ఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రెవెన్యూ, పోలీస్, ప్రెస్ మీడియా, విద్యాశాఖ అధికారులు, జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి సుధీర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

మే 24న మాజీ ఎమ్మెల్యే గుమ్మడం జయరాములు 41 వర్ధంతి వనపర్తి మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు గుమ్మడం జయరాములు గారి 41 వర్ధంతి అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో మే 24న జరుపబడును. అందరూ విజయవంతం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తికి సేవ చేసిన బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలను మర్చిపోయిన ప్రజాప్రతినిధులకు గత పది సంవత్సరాలుగా కళ్ళు తెరిపించిన అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకు వచ్చి మాజీ ఎమ్మెల్యేల జయంతులు, వర్ధంతిలు చేసి ప్రజలకు కూడా క్యాలెండర్ ద్వారా తెలిపిందని, అందుకు అనుగుణంగామాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు గుమ్మడం జయరాములు 41 వర్ధంతి అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో మర్రికుంట పాలకేంద్రం దగ్గర 24వ తారీఖు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు జరుగుతుందని. అన్ని ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఈ సందర్భంగా ప్రజలకు, పత్రికా, మీడియా విలేకరులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నామని సతీష్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి ఎన్నికల అధికార ప్రతినిధి కొత్త గొల్ల శంకర్, బిఎస్పి నాయకులు మైబూస్, లోక్సత్తా నాయకులు రాజ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు శివకుమార్ రాములు, రాజనగరం రామస్వామి, చందు, రమేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం వనపర్తి వనపర్తి మొట్టమొదటి ఎం.ఎల్.ఏ సురవరం.ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతినీ ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి సాహితీవేత్తలతో కలసి వారి స్వగృహంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి,సాహితీవేత్త,న్యాయవాది సురవరం.ప్రతాప్ రెడ్డి గారి జీవిత చరిత్రను ఆవిష్కరించడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. తన రచనలతో కేంద్ర సాహితీ అవార్డు పొందిన మహానీయుడు సురవరం అని సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావులు అదేవిధంగా దళిత దండోరా స్థాపించి అణగారిని వర్గాలకు అండగా నిలిచిన అపరమేధావి సురవరం ప్రతాప్ రెడ్డి అని నిరంజన్ రెడ్డి కొనియాడారు. గోల్కొండ పత్రిక స్థాపించి జర్నలిస్టులకు ఆదర్శప్రాయునిగా నిలిచిన సురవరం 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. సురవరం.ప్రతాప్ రెడ్డి గారి పేరు స్థిరస్థాయిగా ఉండాలని వారి పేరిట గ్రంథాలయం,సురవరం పార్కులో వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశామని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇట్టి సురవరం జయంతి ఉత్సవాలలో ముఖ్యతిధులుగా వారి జీవితంపై పరిశోధన చేసిన గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు మరియు సాగునీటి రంగంలో పరిశోధన చేసి,సాగునీటి రంగంలో పనిచేసి సాగునీటి రంగ నిపుణులుగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండే సాగునీటి రంగంతో పాటు తెలంగాణ అస్తిత్వవాదంతో పాటు రాజకీయ సామాజిక అంశాలు విశ్లేషణ చేస్తున్న సహచర ఉద్యమకారుడు వి.ప్రకాష్ గారు పాల్గొంటారని కాబట్టి సాహితీవేత్తలు,విద్యావేత్తలు,సమాజం పట్ల పట్టింపు ఉన్న విజ్ఞులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అని మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా మాజీ అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస.శంకర్ గౌడ్ సాహితీవేత్తలు వీరయ్య,బలరామ్,బైరోజు.చంద్రశేఖర్,కిరణ్,తిరుమలేశ్,జోహెబ్ హుస్సేన్,కుమార్,తోట.శ్రీను ఉన్నారు.

Read More »

రైస్ మిల్లర్లు వరి ధాన్యం వేగంగా అన్లోడ్ చేసుకోవాలి వనపర్తి రైస్ మిల్లర్లు వరి ధాన్యం లారీలను ఎక్కువ సమయం నిరీక్షింప చేయకుండా వేగంగా అన్లోడ్ చేసుకోవాలని, అదేవిధంగా ధాన్యంలో కోతలు విధించడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండలం పరిధిలోని సాయి గోపాల ఇండస్ట్రీస్‌ను సందర్శించి వరి అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా, మండల పరిధిలోని పాతపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం, చెలిమిల గ్రామ శివారులలో మెప్మా వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లర్లకు పలు కీలక సూచనలు చేశారు. రైస్ మిల్లర్లు వరి ధాన్యం లారీలను ఎక్కువ సమయం నిరీక్షింప చేయకుండా వేగంగా అన్లోడ్ చేసుకోవాలని, అదేవిధంగా ధాన్యంలో కోతలు విధించడానికి వీల్లేదని సూచించారు. రైతులు ధాన్యం యొక్క తేమ శాతం నిర్దేశించిన దానికన్నా తక్కువే ఇస్తున్నారన్నారు. వరి ధాన్యంలో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించవద్దని స్పష్టం చేశారు. అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, మిల్లులు మరియు గోదాముల వద్ద వేచి ఉన్న లారీలను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సూచించారు. ట్రక్ షీట్లను వెంటనే వాట్సాప్ ద్వారా పీపీసీ ఇన్‌చార్జ్‌లకు పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో ట్యాబ్ ఎంట్రీలు త్వరగా పూర్తై రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అవుతాయని తెలిపారు. పాత పల్లి, చెలిమెల గ్రామాల వద్ద వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి దాన్యం నమోదు రిజిస్టర్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ ఇన్‌చార్జ్‌లకు సూచనలు చేస్తూ, తేమశాతాన్ని పరిశీలించి వెంటనే రైతులను నిరీక్షింప చేయకుండా తూకం చేసి లోడ్ చేయాలని సూచించారు. రైతులు వరిని శుభ్రపరిచి తీసుకురావాలని అవగాహన కల్పించాలని తెలిపారు. దీంతో మిల్లర్లు కోతలు విధించే ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ప్రశ్నించగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కొంత లారీల కొరత ఉందని రైతులు చెప్పగా అదనపు లారీ లు పంపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వరి ధాన్యం తరలింపు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అదేవిధంగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని వర్షం వస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇన్చార్జిలకు సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, ఎంపీడీవో ప్రవీణ్, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.

Read More »

Scroll to Top