పెట్టుబడి దారీ దోపిడీ వ్యవస్థను కూల్చి సమసమాజం,సోజలిజం సాధించడమే సుందరయ్యకు ఘనమైన నివాళి వనపర్తి సిపిఎం పార్టీ నిర్మత పుచ్చల పల్లి సుందరయ్య 41వ వర్ధంతి నీ సిపిఎం పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో హమాలీ సంఘం కార్యాలయంలో సిపిఎం నాయకులు ఆర్ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు . సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు మాట్లాడుతూ , పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1న నెల్లూరు జిల్లా అలగానిపాడు లో భూస్వామ్య కుటుంబంలో జన్మించారని భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం, దోపిడి రాజ్యం పెట్టుబడిదారీ సమాజం రద్దు కోసం పనిచేశారని అన్నారు. సోషలిజం స్థాపనకు ఎనలేని కృషి చేశారన్నారు. 1985 మే 19న అనారోగ్యంతో మరణించారన్నారు ఆయన జీవించినంత కాలం నిరాడం వరకు నిరాడంబరతకు పెట్టింది పేరని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా 1952 నుండి 1954 వరకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 17 సంవత్సరాలు శాసనసభ్యులుగా పని చేశారని తను సైకిల్ పైనే ప్రయాణం చేసే వార నీ కొనియాడారు. కుల వివక్ష అంతం కోసం కుటుంబంతోనే పోరాటం ప్రారంభించి సమాజంలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమిచారన్నారు.1932 లోనే అలగానిపాడు లో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించారన్నారు. కార్మికులను ,పేదలను దోపిడీకి గురిచేస్తున్న పెట్టుబడి దారి వ్యవస్థను కూల్చీ సోషలిజం స్థాపించడమే సుందరయ్య గారికీ ఘనమైన నివాళి అని అన్నారు . భారత దేశంలో సంపద కొంతమంది దగ్గర పోగుబడుతున్నది.90శాతం మంది పేదలుగా, నిరుపేదలుగా జీవనం కొనసాగిస్తున్నారు . నిరుద్యోగ సైన్యం పెంచి పోషించే వ్యవస్థ పెట్టుబడి దారి వ్యవస్థ అన్నారు . మహిళాలను ఆటబొమ్మలుగా చూయించేది ,అత్యాచారాలు జరగడం సహజమే అనే ధోరణి ఈ వ్యవస్థలో ఉన్నదన్నారు . కులం ,మతం పేరుతో సమాజాన్ని నిలువున చీల్చింది పెట్టుబడి దారి వ్యవస్థ అని మండి పడ్డారు . పెట్రోల్ ,డీజిల్ ,ఆదాచేయండి ,బంగారం కొనుగోలు చేయకండి అంటూ స్వయానా ప్రధాని ప్రచారం చేయడం వెనుక దాగివున్న ఉన్న అసలు రహస్యం సంక్షోభమే అన్నారు .పెట్టుబడి దారి వ్యవస్థ ఆర్థిక అసమానతలు ,సామజిక ,రాజకీయ అసమానతలు పెంచి పోషించే దుర్మార్గపు వ్యవస్థ అన్నారు . ఈ వ్యవస్థ మార్పుకోసం నేటి యువత ,కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలనీ ఆయన పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఊసన్న హమాలి యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు గంగాధర్ వెంకటేష్ రాజు నరసింహ బిసన్న తదితరులు పాల్గొన్నారు
శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాల సన్నాహక సమావేశం వనపర్తి మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కవులు, సాహితీవేత్తలు సమావేశమై మే 28న మొట్టమొదటి వనపర్తి శాసనసభ్యులు సురవరం.ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని వనపర్తి మాజీ మంత్రి స్వగృహంలో సన్నాహక సమావేశం నిర్వహించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. శ్రీ సురవరం.ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాలలో ముఖ్య వక్తలుగా సాగునీటిరంగ నిపుణులు శ్రీ వి.ప్రకాష్,శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే మరియు ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు.గిరిజా మనోహర్ బాబు పాల్గొంటారని అదేవిధంగా ఈ ఉత్సవ సమావేశములో ప్రస్తావించే పలు అంశాల గురించి చర్చించారు అని అశోక్ తెలిపారు. ఈ సన్నాహక సమావేశములో సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస.శంకర్ గౌడ్ సాహితీవేత్తలు వీరయ్య , బలరామ్ ,నారాయణ రెడ్డి ,బైరోజు. చంద్రశేఖర్ ,మల్యాల.బాలస్వామి ,సత్తార్ ,చంద్రశేఖర్ ,కిరణ్ గారు జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, జోహెబ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుతో సంస్థాగత నిర్మాణం పటిష్టంచేపట్టాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుతో సంస్థాగత నిర్మాణం పటిష్టం చేపట్టాలి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకితమై సభ్యత్వ నమోదు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం వనపర్తి జిల్లా బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మన వనపర్తిలో 70వేల 500 సభ్యత్వం జరిగింది. సాకులు చెప్పి సభ్యత్వ నమోదులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. పార్టీ పట్ల విధేయత, చిత్తశుద్ధి, అంకితభావం ఉన్న కార్యకర్తలకు పార్టీ పదవులలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పట్ల స్పందించే నాయకులు నిత్యం ప్రజలలో ఉండే నాయకులే పార్టీ పదవులు వస్తాయని పేర్కొన్నారు. దుష్ప్రచారం వల్ల గత ఎన్నికలో ఓడిపోయాం. కార్యకర్తల శిక్షణనే పార్టీకి శ్రీరామరక్ష. తెలంగాణ సోయి లేనివాళ్లు నీటి పాలకులుగా ఉండడం దురదృష్టకరమన్నారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌లో గుర్తింపు ఉంటుందని అన్నారు. హామీలు విస్మరించిన నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్,వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,జగదీశ్వర్ రెడ్డి,లక్ష్మా రెడ్డి,ఎద్దుల.కరుణ శ్రీ,,కృష్ణా నాయక్,జాతృ నాయక్,రఘుపతి రెడ్డి,బోర్ల.భీమన్న,గంధం. బాలపీరు,గంధం.పరంజ్యోతి, వెంకట్ సాగర్,మండల,పట్టణ అధ్యక్షులు మాణిక్యం,రాళ్ళ.కృష్ణయ్య,దిలీప్ రెడ్డి ,వేణు యాదవ్,బి.బాలరాజు, వెంకట్ స్వామి,పెద్దింటి.వెంకటేష్,పృథ్వీ రాజ్ ,కౌన్సిలర్స్ మురళీ సాగర్ శ్రీకర్ గౌడ్,భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి,ఏర్వ.అరుణ శ్రీనివాసులు,స్వాతి హరిబాబు, శంకరమ్మ బాబు నాయక్,సూర్యవంశం.గిరి, హేమంత్ ముదిరాజ్,జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము తదితరులు పాల్గొన్నారు.
కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డుల పాలక మండలిని ప్రకటించిన ప్రభుత్వం వనపర్తి ఖిల్లా ఘణపురం, పెద్దమందడి గోపాల్పేట ఉమ్మడి మండల అన్నదాతల వ్యవసాయ మార్కెట్ యార్డుల సమస్యలు తొలగించేందుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే గారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, గోపాల్పేట ఉమ్మడి మండలాలకు మార్కెట్ యార్డులను మంజూరు చేసింది ఈ క్రమంలో శనివారం ఆయా మార్కెట్ యార్డులకు సంబంధించిన పాలకమండలి పేర్లను ప్రకటించింది ప్రభుత్వం పాలక మండలి పేర్లను ప్రకటించిన సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఖిల్లా ఘణపురం, పెద్దమందడి మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా క్యామ నవనీత W/o క్యామరాజు ఖిల్లా ఘణపురం ని, ఉపాధ్యక్షులుగా కొత్త కాపు వెంకటేశ్వర్ రెడ్డి s /o బాల్ రెడ్డి దొడగుంటపల్లి ని అధికారికంగా ప్రకటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలకమండలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మొక్కజొన్న రైతులకు లారీలు గన్ని బ్యాగుల కొరత తీర్చాలి: సిపిఐ వనపర్తి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు లారీలు, గన్ని బ్యాగుల కొరత తీర్చాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే శ్రీరామ్ డిమాండ్ చేశారు. సోమవారంవనపర్తి మార్కెట్ యార్డును సందర్శించి మొక్కజొన్న వరి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. మాట్లాడుతూ.. వనపర్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు కొనుగోలు చేయక పేరుకుపోయాయన్నారు. కొన్నింటినితూకం వేసి నెలరోజులైనా లారీలు రాక తరలించలేదని రైతులు వాటి వద్ద రాత్రి పగలు కావలి కాస్తున్నారన్నారు. మార్కెట్లో పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు అలాగే ఉన్నాయని గన్ని బ్యాగులు లేక కాంటాలు వేయలేదని,ఖాళీ సంచులు తెస్తే తూకం వేస్తామని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఖాళీ సంచులు కొనాలని గణపురం మండలం అప్పారెడ్డిపల్లి రైతుల నుంచి 1100 ఖాళీ సంచుల కోసం రూ. 33000 వసూలు చేశారన్నారు. వరి వేరుశనగ రైతులకు ఉచితంగా ఖాళీ సంచులు ఇస్తున్నారని మక్కజొన్న రైతుల వద్ద డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. డబ్బులు వాపస్ ఇవ్వాలని తగినన్ని ఖాళీ సంచులను ఉచితంగా సరఫరా చేయాలన్నారు. మద్దతు ధరరూ.2400 కొంత సరుకు మాత్రమే కొన్నారని, తక్కిన వాటిని రైతులు రూ. 1700లకే ప్రైవేటు వారికి అమ్ముతున్నారని మొత్తం సరుకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ధర్నా చేస్తామని హెచ్చరించారు. గణపురం గోపాల్పేట వనపర్తి మండల రైతులు పాల్గొన్నారు.
సంసార జీవితం లో ఉంటే సామాన్యుల బాధలు తెలిసేవి : సిపిఐ వనపర్తి ప్రధాని మోదీ సంసార జీవితం గడిపితే బంగారం అవసరం, ధరల పెరుగుదల భారం తెలిసేదని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ అన్నారు. సోమవారం గోపాల్పేట బస్టాండ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు రూ.3.50కు పెంపు, వాణిజ్య సిలిండర్ ధర రూ. 993 కు పెంచటానికి వ్యతిరేకంగా ధర్నా చేసి నిరసన తెలిపారు. సిపిఐ నేతలు, ఆటోల డ్రైవర్లు ఆటోకు తాళ్లు కట్టి కొంత దూరం లాగుతూ డీజిల్ కొనలేక భవిష్యత్తులో ఆటోలను తాళ్లతో లాగాల్సిందేనని సంకేతాలు ఇచ్చారు. మాట్లాడుతూ.. బంగారం కొనొద్దని, పెట్రోల్ డీజిల్ వాడకల్లో పొదుపు పాటించాలని ప్రధాని ప్రజలకు సలహాలు ఇస్తున్నారని, సంసార జీవితం గడిపితే బంగారు అవసరం, సామాన్యులకు పెట్రోల్ డీజిల్ అవసరం ఎంతో తెలిసేదని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో లబ్ధికి ప్రపంచంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడ పెరిగిన భారతదేశంలో పెంచమని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్ ధర పెంచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దీనివల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతాయని సామాన్యుడు కొనలేని దుర్భర స్థితి ఏర్పడుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ పై సంకాలను తగ్గిస్తే వాడి ధరలు పెంచాల్సిన అవసరమే లేదని సుంకాలను తగ్గించి పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రష్యా భారతదేశానికి తక్కువ ధరకు సమరును సరఫరా చేస్తామని చెబుతున్న ట్రంప్ కు భయపడి కొనకుండా ధరలు పెంచి పేదలపై భారం వేసారన్నారు. మళ్లీ వారం రోజుల్లో పెట్రోల్ లీటర్ పై మరోరూ. 10 పెంచేందుకు సిద్ధమవుతున్నారని పోరాడి నిలువరించాలన్నారు. అధికారం ఉందా లేకున్నా సిపిఐ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం సంపన్నుల కుమ్ముగాచి సామాన్యులపై భారం వేసి కార్మిక కర్షక హక్కులను హరిస్తోందన్నారు. సామాన్యుల సమస్యలను పట్టించుకోకుండా మతం పేరుతో యువత ప్రజలను మభ్యపెట్టి జైశ్రీరామ్ నినాదంతో అధికారంలో కొనసాగేందుకు పాచికలు కదుపుతున్నారని జాగ్రత్తగా ఉండి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, జె. చంద్రయ్య, గోపాల్పేట మండలం కార్యదర్శి మంకలి శాంతన్న, సహాయ కార్యదర్శి కురుమూర్తి,పొలికెపాడు గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చన్న నేతలు ఆటో డ్రైవర్లు రాములు బాలకృష్ణ చంద్రశేఖర్ రఘు వెంకటేష్, బండారు వెంకటయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 40 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
డోలాహరణ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి వనపర్తి పట్టణం 9వ వార్డుకు చెందిన చీర్ల జయమ్మ – చీర్ల శ్రీనివాసులు సాగర్ గార్ల ఆహ్వానం మేరకు శ్వేత సాగర్ ప్రణయ్ సాగర్ ల డోలాహరణ కార్యక్రమం సోమవారం వారి నివాసానికి వెళ్లి ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టు శ్రీనివాస్ హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయురారోగ్యాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, గంధం బాల పీరు, నీల స్వామి వెంకట్ సాగర్, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఇమ్రాన్, శేఖర్, చిట్యాల రాము, మంద రాము, హలీం, కుమార్, తోట శీను, సిరివాటి శంకర్, ముని కుమార్,చీర్ల శ్రీనివాసులు,బెదడు కుమార్, చీర్లశాంతయ్య,గోవర్ధన్ సాగర్,భగీరథ శ్రీను,సూర్య నారాయణ,రవి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యూసుఫ్(గ్రీన్ యార్డ్స్)కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వనపర్తి బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు యూసుఫ్ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో కేక్ కట్ చేసి యూసుఫ్ కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. యూసుఫ్ గారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర నాయకులు మెట్టు.శ్రీనివాస్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,జోహెబ్హు స్సేన్,సూర్యవంశం.గిరి,నీలస్వామి,వెంకట్ సాగర్,చంద్రశేఖర్,పోతులపల్లి.రాజు,మంద రాము,అలీమ్ తదితరులు ఉన్నారు.
క్రీడాకారుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది వనపర్తి క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ… క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యూత్ మరియు స్పోర్ట్స్ వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వనపర్తిలో 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ 2కే రన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా హాజరై అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభించారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి బస్ డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు ఈ 2కే రన్ సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 99 డేస్ ప్రజా పాలనలో భాగంగా యువజన మరియు క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల పట్ల ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, క్రీడల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగంగా మారాలని సూచించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని, అందరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వనపర్తి జిల్లాలో బాక్సింగ్ స్పోర్ట్స్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏ ఎస్ పి రాజేష్ మీనా మాట్లాడుతూ క్రీడలను అలవాటు చేసుకోవడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కలిగి ఉండాలని తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలమని తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన మరియు క్రీడల వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ మరియు స్పోర్ట్స్ వీక్, టూరిజానికి సంబంధించిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. యూత్ మరియు స్పోర్ట్స్ వారోత్సవాల్లో భాగంగా ఈ వారం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి తెలిపారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్, యూత్ పార్లమెంట్, స్వచ్ఛదనం మరియు పచ్చదనం, వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న యువతకు సన్మాన కార్యక్రమాలు వంటివి వారోత్సవాల రోజువారి కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలాజీ నాయక్, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.