రోడ్డు వెడల్పునకు సంపూర్ణ మద్దతు.. ప్రజల హక్కుల హరణాన్ని సహించం
వనపర్తి
పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు తాము పూర్తి మద్దతు ఇస్తామని, అయితే అభివృద్ధి పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తూ విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదని అఖిలపక్ష ఐక్యవేదిక స్పష్టం చేసింది. రోడ్డు విస్తరణ పనులను సోమవారం పరిశీలించిన ఐక్యవేదిక నాయకులు అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు వెడల్పు చేయాలనే నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అందుకు వ్యాపారులు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు అధికార బలంతో వ్యాపారులను దూషించడం, వారి దుకాణాలను అస్తవ్యస్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ పేరుతో పదివేల లోతులో కాలువలు తవ్వడం వెనుక ఉద్దేశమేమిటని నిలదీశారు. వ్యాపారులతో సామరస్యంగా చర్చించి, వారిని ఒప్పించి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు డా సతీష్ యాదవ్, బీఎస్పీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు ,టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బిజెపి నాయకులు రవి, రామస్వామి, శివకుమార్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు
