లైంగిక నేరాలను అరికట్టడం లో కీలకంగా పోక్సో చట్టం
జిల్లా న్యాయ సేవాధికర సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.దీప
వనపర్తి
వనపర్తి జిల్లా మదనపూర్ మండలం లో జిల్లా పరిషత్, కస్తూరిబా విద్యాలయాల్లో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ సెక్రటరీ కె.దీప గారు మాట్లాడుతూ నల్సా- సురక్షిత్ బచ్పన్ అభియాన్ – 2026 (పోక్సో -2012) న్యాయ అవగాహన సదస్సు ల్లో భాగంగా పోక్సో-2012 చట్టం గురించి పాఠశాల విద్యార్థుల కు ముఖ్య సూచనలు చేశారు.గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఆన్లైన్ లో వేధింపులు, ఇంటర్నెట్ సోషల్ మీడియా యాప్ ల వినియోగం పై మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100 లు మీకు అండగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్లు డి.కృష్ణయ్య, డి సి పిఓ రాంబాబు ఆయా పాఠశాల ల ప్రిన్సిపల్ లు, విద్యార్థులు పాల్గొన్నారు.
