వనపర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం వనపర్తి వనపర్తి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ బ్రహ్మోత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలుగా మాత్రమే కాకుండా, వనపర్తి పట్టణ ప్రతిష్టను చాటిచెప్పే 0మహోత్సవాలుగా నిలిచేలా అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తి భావం, సేవా తత్పరత కలిగిన పెద్దలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఉద్యోగస్తులు, అధికారులు, అనధికారులు, యువత, మహిళలు సహా ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవాల్లో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యే అవకాశముందని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం రూ.6 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే మార్చిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో మనకు ఇంకా సుమారు ఏడు నెలల సమయం ఉన్నందున ప్రతి నెలా ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తూ, కార్యక్రమాలను దశలవారీగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, గతంలో ఎన్నడూ లేని విధంగా “నా భూతో న భవిష్యత్” అన్న స్థాయిలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భక్తి, సంప్రదాయం, సంస్కృతి, సామూహిక సేవా భావాలకు ప్రతీకగా నిలిచే ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త రఘునాథచార్యులు, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఉంటాయి వనపర్తి శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవత పెద్దమ్మ తల్లి గుడిలో విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. ఈ పలుస శంకర్ గౌడ్ మట్లదుతు గ్రామ ప్రజలు అందరు కలసి నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి గుడి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీధ ఉంతాయాని శంకర్ గౌడ్ అన్నారు.రాజకీయాలకు అతితంగా పాల్గొంటున్నా ప్రజలు అందరం గ్రామాభివృద్ధి కోసం పనిచేద్దాం అన్నారు.గుడి నిర్మాణంలో కృషి చేస్తున్న గ్రామ పెద్దలను శంకర్ గౌడ్ అభినందించారు. ఈధే విధంగా గ్రామాములో ఐక్యత కోనసాగాలాని పలుస శంకర్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరీష మద్దిలేటి,గ్రామ పెద్దల్లు ఎల్లస్వామి, కూర్మన్న, యెంకన్న, బాబు,వెంకట్రామ రెడ్డి, రాములు, నాగమణి, గోపాల్, నర్సమ్మ, కుమ్మరి నారాయణ ,మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపూర్ మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను వెంటనే గ్రౌండింగ్ చేయించి పనులు ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులపై ఆధారపడకుండా స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మండలంలో ఇండ్లు మంజూరై ఇంకా ప్రారంభం కాని 58 ఇళ్లను, మదనాపూర్ మండలంలో ప్రారంభం కాని 28 ఇళ్లను తక్షణమే ప్రారంభించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు రుణాలు ఇప్పించి అయినా వెంటనే నిర్మాణాలు ప్రారంభించే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి అర్హులను వేగంగా గుర్తించి తమ లాగిన్ కు పంపాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. గుడిసెల్లో నివసించే వారే ప్రథమ ప్రాధాన్యతగా ఇండ్ల మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మునిసిపల్ వైస్ చైర్పర్సన్ సునీత పల్లవి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్ యూకో బ్యాంక్ లైన్‌లో వైద్యులు డాక్టర్ బంగారయ్య నూతనంగా నిర్మించిన ప్రపంచ్ ఆసుపత్రిని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవాభావంతో కూడిన వైద్య సేవలను అందించాలని, ఆపద సమయంలో ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజలను వ్యాపార దృక్పథంతో కాకుండా మానవత్వంతో ఆదుకోవాలని సూచించారు. వైద్య వృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని, ప్రతి వైద్యుడు సేవా తత్వంతో పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. దిన దిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో డాక్టర్ బంగారయ్య గారు ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బి కృష్ణ, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు sln రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
వనపర్తి జిల్లా కేంద్ర అభివృద్ధికి మరో కీలక అడుగు వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ టవర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారువనపర్తి జిల్లాను సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఈ IT టవర్ నిర్మాణం ద్వారా జిల్లా యువతకు స్థానికంగానే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, యువత తమ స్వస్థలంలోనే ఉద్యోగాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు వనపర్తికి రావడానికి ఈ టవర్ కీలక వేదికగా మారనుందని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడనున్న ఈ IT టవర్ ద్వారా డిజిటల్ సేవలు మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు జిల్లాకు ఆకర్షితమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనపర్తిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఐటి టవర్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బ్రహ్మచారి, బి కృష్ణ, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
శాంతియుత వనపర్తి నిర్మాణానికి పోలీసు శాఖతో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి వనపర్తి జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కొనసాగించడం, ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, అవాంఛనీయ సంఘటనలను ముందస్తుగా నివారించడం లక్ష్యంగా జులై 1 నుంచి జులై 31 వరకు “30 పోలీస్ యాక్ట్-1861” అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… జిల్లా పరిధిలో ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న ఎలాంటి కార్యక్రమమైనా సంబంధిత పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ స్థాయి సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని, “30 పోలీస్ యాక్ట్” నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రశాంతత మరియు సామాజిక శాంతిని పరిరక్షించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఏ సంస్థ, సంఘం లేదా వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించదలచినట్లయితే సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అనుమతి పొందాలని సూచించారు. చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల సహకారంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయగలమని ఎస్పీ తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
శాంతియుత వనపర్తి నిర్మాణానికి పోలీసు శాఖతో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి వనపర్తి జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కొనసాగించడం, ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, అవాంఛనీయ సంఘటనలను ముందస్తుగా నివారించడం లక్ష్యంగా జులై 1 నుంచి జులై 31 వరకు “30 పోలీస్ యాక్ట్-1861” అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… జిల్లా పరిధిలో ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న ఎలాంటి కార్యక్రమమైనా సంబంధిత పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ స్థాయి సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని, “30 పోలీస్ యాక్ట్” నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రశాంతత మరియు సామాజిక శాంతిని పరిరక్షించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఏ సంస్థ, సంఘం లేదా వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించదలచినట్లయితే సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అనుమతి పొందాలని సూచించారు. చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల సహకారంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయగలమని ఎస్పీ తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
మార్కెట్ జర్నల్ బాడీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వనపర్తి వనపర్తి మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలు, మార్కెట్‌లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. మార్కెట్ వ్యవస్థ పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.. మార్కెట్ ఆదాయం, వ్యయాల వివరాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డులను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా డైరెక్టర్లుగా తమ పదవి కాలం వారికి ఎమ్మెల్యే గారు శాలువాలతో సన్మానించ అభినందించారూ ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, డైరెక్టర్లు కృష్ణయ్య, గోపాల్ నాయక్, సురేష్, ఓమేష్, లతీఫ్, శారద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ పాఠశాలల విజయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకు నడవాలి వనపర్తి వనపర్తి బాలుర ఉన్నత పాఠశాల యందు “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు.. సవాళ్లు.. పరిష్కారాలు” అనే అంశంపై “వనపురి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం చర్చాగోష్టి నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై జిల్లా ఉపాధ్యాయ సంఘాల నాయకత్వంతో ఒక చర్చ గోష్టి నిర్వహించడం బహుశా రాష్ట్రంలోనే ఇది ప్రధమం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బత్తుల శ్రీనివాసులు చర్చ గోష్టికి అధ్యక్షత వహించగా చర్చాగోష్టిలో ఎస్ చంద్రశేఖర్, ఎంఈఓ గోపాల్పేట్ మరియు గజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం వనపర్తి జిల్లా నాయకులు మాట్లాడుతూ 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల విద్యార్థులు చదువుతూ ఉండగా, 12,000 ప్రైవేట్ పాఠశాలల్లో 37 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రధానంగా సోషియో ఎకనామిక్ ఇష్యూస్ కారణంగా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్ని ఆశ్రయిస్తున్నారని, పరిస్థితిని మార్చాలని అన్నారు. ఎస్ వరప్రసాదరావు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రుల వైఖరి మారాలని అన్నారు. అలాగే జెండర్ డిఫరెన్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో స్పష్టంగా ఆవుపడుతుంది అని తెలియజేశారు. బౌద్ధారెడ్డి పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భద్రత కారణాల రీత్యా అమ్మాయిల విషయంలో కస్తూరిబాలను గురుకుల స్కూళ్లను తల్లిదండ్రులు ఆశ్రయిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల నమోదు విషయంలో సర్పంచులు చొరవ తీసుకునేలా మనం ప్రయత్నించాలని అన్నారు. సూర చంద్రశేఖర్ పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బోధ నేతర కార్యక్రమాల కారణంగా ఉపాధ్యాయులు బాగా డిస్టర్బ్ అవుతున్నారని. దీన్ని అరికట్టాలని కోరారు.ఎస్ రవీందర్ గౌడ్ పి ఆర్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విజయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకు నడవాలని అన్నారు. డి కృష్ణయ్య యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ఉనికి ఉపాధ్యాయుల ఉనికితో ముడిపడి ఉందని, అందుకు అందరూ ప్రయత్నించి పాఠశాలల్ని కాపాడుకోవాలని, అలాగే ప్రభుత్వం కూడా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేవిధంగా నియామకాలు జరపాలని అభిప్రాయపడ్డారు. టి మహిపాల్ రెడ్డి పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఎక్కడైతే ఉపాధ్యాయులు అంకితభావంతో సృజనాత్మకంగా పనిచేస్తున్నారో అక్కడ విద్యార్థుల నమోదు మెరుగ్గా ఉందని, అందుకు భిన్నంగా ఉన్నచోట పరిస్థితి బాగాలేదని, అందుకే ఉపాధ్యాయులు సమాజ భాగస్వామ్యం తో కలిసి నడవాలని, జవాబుదారుతనాన్ని కలిగి ఉండాలని, అప్పుడే నమోదు పెంచుకోగలమని అన్నారు. బి సుధాకర్ చారి, రూప్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భాషలకు సంబంధించి విద్యార్థులు చదవడం రాయడం సరిగ్గా వచ్చి ఉండాలి, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించాలని, అలాగే పాఠశాలల ను అందంగా తీర్చిదిద్దాలని, అప్పుడే తల్లిదండ్రుల నమ్మకాన్ని చురగొనగలమని అన్నారు. అవసరమైతే జిల్లా అన్ని సంఘాల బాధ్యులతో టీం గా ఏర్పడి ప్రయత్నిద్దామని, అందుకు మేము సిద్ధమేనని అన్నారు. ఎస్ శ్రీనివాసరావు ఎస్ టి యు జిల్లా సీనియర్ నాయకులు మాట్లాడుతూ మంచి అంశాన్ని ఎజెండగా తీసుకున్నారని అభినందిస్తూ, ఎక్కడైతే గ్రామ సమాజ భాగస్వామ్యం సరిగ్గా ఉంటుందో అక్కడ మంచి ఫలితాలు వస్తాయని, యాంత్రికంగా పనిచేస్తే ఫలితాలు రావని, అందుకే ఉపాధ్యాయులు తదనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. ఆర్ శ్రీనివాసులు టిపిఆర్టియు జిల్లా నాయకులు మాట్లాడుతూ తాను గతంలో పనిచేసిన పాఠశాలలో 7 మంది విద్యార్థుల సంఖ్య 65కు పెరిగిందని, మన పని విధానమే తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూడగొంటుందని అన్నారు. హరిప్రసాద్ ఎస్టియు జిల్లా సెక్రెటరీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత పాఠశాలల్ని వేధిస్తుందని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఫలితం ఉంటుందని అన్నారు. ఆర్ నరసింహారావు ఎస్ జి టి ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఒక జట్టుగా పని చేయాలని, తమ కృషిని గ్రామస్తులకు కూడా అర్థం చేయించాలని, గ్రామ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ లాంటి కొత్త నైపుణ్యాలను పాఠశాల అడాప్ట్ చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్రమక్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో, విద్యార్థుల నమోదును పెంపొందించుకునేటందుకు జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం పాల్గొని, నిర్మాణాత్మకంగా పలు సూచనలు చేయడం జరిగింది. అవసరమైతే ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు జట్టుగా ఏర్పడి కృషి చేద్దామని కూడా ముందుకు రావడం జరిగింది. బహుశా రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా కేవలం విద్యార్థుల నమోదుపై ఒక జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల అగ్రనాయకత్వం ఒక చర్చ గోష్టి నిర్వహించడం, చాలా సానుకూలంగా స్పందించడం శుభ పరిణామం. ఈ కృషి.. ఈ సమన్వయం ఇలాగే కొనసాగితే మంచి ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థులు నమోదు పెంచేందుకు భవిష్యత్తులో దోహద పడుతుందని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి వనపర్తి ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగానికి సార్థకత ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం డి.ఆర్.ఒ. యం. సూర్యప్రకాష్, డి. సెక్షన్ సూపరింటెండెంట్ డి. మదన్ మోహన్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవి విరమణ చేస్తున్న డి.ఆర్. ఒ సూర్య ప్రకాష్, డి. సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్ వనపర్తి జిల్లాకు మంచి సేవలు అందించారని కొనియాడారు. మదన్ మోహన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుదీర్ఘంగా సేవలు అందించారని చెప్పారు. నిస్వార్థంగా నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. నిబద్ధతతో ప్రజలకు సేవలు అందిస్తే భగవంతుడు ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులకు మంచిని చేకూరుస్తారని అన్నారు. జిల్లాలో యువ ఉద్యోగులు చాలా మంది ఎంపిక అయ్యారని అందరూ నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పదవి విరమణ పొందుచున్న డి.ఆర్.ఒ సూర్యప్రకాష్, మదన్ మోహన్ వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పదవి విరమణ పొందిన సూర్య ప్రకాష్, మదన్ మోహన్ లను ఘనంగా సత్కరించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.