VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

ఆకాశమంత ప్రచారం.. వెంట్రుక మందం అభివృద్ధి అన్న చందంగా పాలన సాగుతోందని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు విమర్శించారు. వనపర్తి జిల్లా గోపాలపేట నుంచి వస్తుండగా తాడిపర్తి గ్రామం మీదుగా తాండా, చెన్నూరు గ్రామాలకు వెళ్లే రహదారి దుస్థితిని గమనించిన నాయకులు, ప్రయాణికుల ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కోట్లాది రూపాయల నిధులు వచ్చాయని ప్రచారం చేసుకోవడం అభివృద్ధి కాదని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, సోషల్ మీడియాలో విమర్శకులను కించపరచడం మానుకోవాలని సూచించారు. గ్రామాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, నాణ్యమైన విద్య, వైద్యం, అందుబాటులో నిత్యావసరాలు, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. ప్రజల అవసరాల కోసం నిధులను వినియోగించి, గ్రామీణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, నాయకులు డిమాండ్ చేశారు.

whatsapp image 2026 10 27 at 12.50.53 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top