VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

ఆదికవి మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన రచించిన రామాయణం తరతరాలకు ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను బోధించే మహోన్నత కావ్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోనూ నూతనంగా ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి రచించిన రామాయణం కేవలం ఒక కావ్యం మాత్రమే కాదనీ. మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే మహాగ్రంథమని. శ్రీరాముని జీవితంలోని ధర్మనిష్ఠ, సత్యసంధత, కర్తవ్యపాలన, త్యాగం వంటి విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకుంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన అవకాశాలు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు లభించాలని చాటిచెప్పే మానవతా విలువలు నేటికీ ఎంతో ప్రాసంగికమని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి విగ్రహాల ఏర్పాటు ఆయన పట్ల ప్రజలకు ఉన్న గౌరవానికి, ఆయన ఆదర్శాలను భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి బోధించిన ధర్మం, సత్యం, మానవతా విలువలను ఆచరణలో పెట్టడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. ఆయన జీవితం, ఆశయాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు, పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 10 26 at 4.26.04 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top