ఇందిరమ్మ రాజ్యంలో గిరిజన అభివృద్ధికి పెద్దపీట వనపర్తి ఉక్కు మహిళ ఇందిరా గాంధీ కాలం నుంచి నేటి వరకు గిరిజన అభివృద్ధి కోసం పాటుపడ్డా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నేనని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఆశీర్వాదం స్వర్ణోత్సవ వేడుకల బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు 1976 లోనే గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల గిరిజన కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందుతున్నాయి అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారులను గిరిజనులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్న అన్నారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలోని గిరిజనులు ఉండే ప్రతి ఆవాస ప్రాంతంలో సేవాలాల్ ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, విద్యార్థులకు ఉన్నత విద్య, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు భరోసా రాయితీపైన అనేక పథకాలను అందజేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందిరమ్మ కాలం నుంచి గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలుస్తున్నారన్నారు. నేడు శనివారం రోజున వనపర్తి జిల్లా కేంద్రానికి ఇందిరమ్మ ఆశీర్వాద స్వర్ణోత్సవవేడుకల బస్సు యాత్ర వస్తుందని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గిరిజన సహోదరులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిజన నాయకులతో కలిసి బస్సు యాత్ర పోస్టర్ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచులు గిరిజన సంఘం నాయకులు గిరిజన యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
Uncategorized
ప్రజాసేవే మా లక్ష్యం ప్రజావాణిలో ప్రజలతో నేరుగా సంభాషించిన : జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా వనపర్తి ప్రతి సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో సోమవారం వివిధ ప్రాంతాల నుండి 25మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా కి ఫిర్యాదులు అందించారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై వనపర్తి అదనపు ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు. దీనితో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా జిల్లా అదనపు ఎస్పీ గారు చర్యలు తీసుకోవడంపై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో మొత్తం 25 ఫిర్యాదుల్లో 18- భూతగాదాల ఫిర్యాదులు, 05 భార్యభర్తల పిర్యాదులు 02 – పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వున్నాయి.
ఎస్.ఐ. ఆర్ పై ప్రజలకు విస్తృత ప్రచార నిమిత్తం మంగళవారం ఉదయం 2కే రన్ వనపర్తి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్)ప్రక్రియ పై ప్రజలకు విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి హాల్లో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలు అందరూ ఎస్.ఐ.ఆర్ లో భాగస్వాములై తమ ఓటు ను జాబితాలో నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని, అందులో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటలకు 2కె రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 25 నుండి జూలై 31 వరకు బి.ఎల్. ఒ లు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతారనీ, ఇప్పటికే ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు, 1-10-2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే యువత సైతం ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాలను జిల్లాలోని ఓటర్లందరికీ అర్థమయ్యే విధంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు.ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6.00 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుండి వయా కొత్త బస్టాండ్ మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు 2కె రన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజా ప్రతినిధులు , విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగ కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 72 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 4 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, జెడ్పి సీఈవో యాదయ్య అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి వనపర్తి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ 1952 ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటను మొదటి నుండి వ్యతిరేకించిన జయశంకర్ 1952 మలికి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ,తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న వివక్ష నీటి దోపిడి నిధుల కొరతను తన రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రజలకు మేధావులకు స్పష్టంగా వివరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వంటి అనేక పరిశోధనాత్మక పుస్తకాలను కరపత్రాలను రాశారు , రాజకీయ పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమకారులను యువకులను విద్యార్థులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తో కలిసి రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడాన్ని చూడాలని ఆయన చివరి కోరిక ఉండెను 2021 జూన్ 21న ఆయన మరణించడం జరిగినది అని జయశంకర్ గారి గురించి పార్టీ నాయకులను ఉద్యమకారులను కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ , జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ గంధం పరంజ్యోతి మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం, సింగిల్ విండో చైర్మన్ రఘువర్ధన్ రెడ్డి, గులాం ఖాదర్ ఖాన్ ,నీల స్వామి, కౌన్సిలర్ మురళి సాగర్, ప్రేమ్ నాథ్ రెడ్డి, కాంటెస్ట్ కౌన్సిలర్ నాగన్న యాదవ్, స్టార్ రహీం, మైనార్టీ అధ్యక్షుల జోయెబ్ , ఎర్ర శ్రీను, ఆవుల రమేష్, జె ఏ సి చైర్మన్ వేణుగోపాల్ నాయుడు, సూర్యవంశం గిరి, నందిమల్ల రమేష్ ,యుగంధర్ రెడ్డి , కాంటెస్ట్ కౌన్సిలర్ సునీల్ వాల్మీకి (సోషల్ మీడియా),వెంకటేష్ సాగర్ ,జానంపేట శ్రీను, ధర్మ నాయక్, బాబు నాయక్ సత్యం ,ఏకే పాషా ,ఖాదర్షా ఆరిఫ్ ,గంధం విజయ్ కుమార్ ,గొర్ల బాలయ్య, కాంటెస్ట్ కౌన్సిలర్ ఆంగోత్ కవిత నాయక్,సూర్యవంశం ముని కుమార్, జయశంకర్ అకాడమీ విజయ్ మోహన్ , ఇంతియాజ్ ,నాచనల్లి రాజు సాగర్, బీరయ్య కుమార్ ,సిరువాటి శంకర్, పో తలపల్లిరాజు , గన్నోజు మోహనాచారి, ఉండేకోటి శివ,తోట శ్రీనువజ్రాల సాయిబాబా, రఘు,తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ యోగా సాధన చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి యోగాతో ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించగలరని.. కాబట్టి నిత్యం యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో యోగా శిక్షకురాలు సుగుణ సుమారు 40 నిమిషాల పాటు యోగా సాధన చేయించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ అందరికీ “యోగా డే” శుభాకాంక్షలు తెలిపారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం మన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. యోగా ఒక్కరోజు నిర్వహించి మానేసే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు. శారీరక దృఢత్వం ప్రతి ఒక్కరికీ అవసరమని, రాబోయే రోజుల్లో యోగాతో పాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో కీలకమని, ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.నషా ముక్త్ భారత్ ఏర్పాటు కై ప్రతిజ్ఞ నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో ఉమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, డీఎస్పీ గిరి ప్రసాద్, యోగ శిక్షకురాలు సుగుణ, జిల్లా రవాణా అధికారి, ఆయుష్ శాఖ అధికారులు వసుంధర , విశ్వశాంతి ప్రతినిధులు, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ సరస్వతి, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధికోసమై కృషి చేయాలి వనపర్తి తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధి కోసమై కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు అన్నారు. ఆదివారం జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నూతనంగా మెడికల్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఉద్యమ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలైన తెలంగాణ ఏర్పాటు చేసుకున్న నీళ్లు నిధుల విషయంలో కొంతవరకు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 12,13 ఏళ్లయిన నియామకాల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని జయశంకర్ సార్ ముఖ్య ఆశయం నియామకాలే అన్నారు. జయశంకర్ సార్ జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి పోరాడిన గొప్ప వ్యక్తి అని, ఆంధ్ర పాలకులు ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని నిర్బంధాలు విధించిన ఆయన ఉద్యమంలో వెను తిరగలేదని విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు చైతన్యాన్ని రగిలించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నిస్వార్ధంగా తెగించి పోరాటం చేసిన ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించిందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం ఇస్తామని వాగ్దానం చేసిందని ఇప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా కొలిక్కి రాలేదని కమిటీల పేరుతో కాలయాపన జరుగుతుందని ఈ విషయంపై వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఇది కూడా జయశంకర్ సార్ ఆశమే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఖాదర్ పాషా, యాదగిరి, సత్యం సాగర్,రమేష్,లతీఫ్, యోగానంద రెడ్డి, తిరుపతయ్య యాదవ్, నిరంజన్ వలి,రాము,ఆనంద్ శర్మ, రామాంజనేయులు,బండలయ్య, గువ్వల చెన్నయ్య, చీర్లజనార్ధన్, టప్ప మురళి,కిరణ్ కుమార్,షఫీ,గోపాలకృష్ణ, మురళి,రమేష్,రతన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సూగురు ఉపసర్పంచ్ వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పెబ్బేరు మండలం సూగురు గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ ఉషాన్ వివాహానికి హాజరై నూతన వధూవరులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేసారు. అనంతరం కుటుంబ సభ్యులని, గ్రామ ప్రజల యోగ క్షేమాలు అడిగారు. గ్రామ మాజీ సర్పంచ్ వెంకట సేసమ్మ వేణుగోపాల్ యొక్క ఆరోగ్య పరిస్థితులను గ్రామ సర్పంచ్ యాదమ్మ పర్శరాం ద్వార తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వేణుగోపాల్ తో తనకు ఉన్న సంబంధాలను నెమరు వేసుకున్నారు. వేణు గోపాల్ కుమారుడి కి గుండె కు స్టంట్ వేసిన విషయాలను, తగు జాగ్రత్తలను తెలియజేసారు. కార్యక్రమం లో మండల అధ్యక్షులు వనం రాములు సోషల్ మీడియ కన్వీనర్ వడ్డె రమేష్,హనుమన్న, శ్రీను, మూర్తి,పులి, జయన్న, మధు యూత్ హర్ష, దశరథ్, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు
మరో గొప్ప పురస్కారం అందుకున్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ డా”సతీష్ యాదవ్ వనపర్తి తమిళనాడు రాష్ట్రం ఊటీ లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ achive ment అవార్డ్ ను ఆయన పొందారు. ఉత్తమంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను, ర్యాంకర్లను ప్రోత్సహిస్తున్నందుకు గుర్తింపుగా dr APJ అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ achive ment అవార్డ్ ను ఇంటర్ నేషనల్ పీస్ కౌన్సిల్ ఆర్గనేషన్ వారు శనివారం ఊటీ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించి వారిని ప్రోత్సహిస్తున్నందుకు అలాగే తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు సహాయం చేయడం గుర్తించిన కొందరి రిఫరెన్స్ తో ఈ అవార్డు అందుకున్న డా” సతీష్ యాదవ్. ఇప్పటికే సమాజ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ కూడా పొందిన సతీష్ యాదవ్ కు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా….. వనపర్తి ప్రజలకు, మిత్రులకు, పత్రికా, మీడియా మిత్రులకు సతీష్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్ జడ్జ్ డాక్టర్ ప్రభు రంగరాజన్, డాక్టర్ జార్జ్ పీటర్, అధ్యక్షుడు డాక్టర్ కిమ్, U.N.I.P.C సంస్థ కోఆర్డినేటర్స్ఉ, మ్మడి పాలమూరు జిల్లా మాజీ రిజిస్టర్ డా” మల్లారెడ్డి ,ఉబ్బలి విశ్వనాథం పాల్గొన్నారు
యూరప్ లోని ప్రఖ్యాత ESCP బిజినెస్ స్కూల్‌లో డ్యుయల్ మాస్టర్ డిగ్రి విజయవంతంగా పూర్తి చేసిన తూడి నవనీత్ రెడ్డి వనపర్తి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తనయుడు నవనీత్ రెడ్డి గారు యూరప్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలో ఏకకాలంలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేశారు.ESCP Business Schoolలో విధ్యనభ్యసించిన ఆయన మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(MBA) పట్టాను ప్రాన్స్ లో , మాస్టర్ ఆఫ్ సైన్(MSc) పట్టాను జర్మనీలో పూర్తి చేశారు. రెండు దేశాల్లోని విద్యా ప్రమాణాలను సమర్థవంతంగా అధిగమిస్తూ ఆయన ఈ ఘనత సాధించారు. ఈనెల 19న ప్రాన్స్ లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో నవనీత్ రెడ్డి తల్లిదండ్రులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి- శారద దంపతులు, సోదరుడు మనోజ్ రెడ్డి పాల్గొన్నారు .1819లో స్థాపించబడిన ESCP Business School ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేయడం ద్వారా నవనీత్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో తన విద్యా ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్ష కలిగిన విద్యార్థులకు నవనీత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నరు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.