బుద్దారాం రిజర్వాయర్ ముంపు బాధితుల రాస్తారోకో వనపర్తి గోపాల్ పేట మండలం బుద్దారం పెద్ద చెరువు రిజర్వాయర్ నీటి ముంపు రైతులు భూములు కోల్పోతున్న మాకు నష్టపరిహారం పెంచాలని దాదాపు 2గంటలపాటు వాహనాలు నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వాయర్ లో మునిగిపోయిన శిఖం భూములకు మొదటి విడతగా రైతులకుగతములో 12లక్షల 40వేల రూపాయలు ఎకరాకు చెల్లించారని ఇట్టి భూములు ఎప్పుడూ నీటి మునకలో ఉంటాయని అన్నారు. రెండవ విడతలో దాదాపు 110ఎకరాల సారవంతమైన భూమి మునకకు గుర్రవుతున్నది అని ఈ భూములు రెండు పంటలు పండేవిగా అందులో వ్యవసాయ బావులు,బోర్లు వ్యవసాయయోగ్యంగా ఉన్నాయని ఇట్టి భూములకు కూడా ఎకరాకు 12లక్షల 40వేలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుందని దీన్ని రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ రాస్తారోకో లో సర్పంచ్.శేఖర్ గౌడ్,ఉప సర్పంచ్ శివాజీ,కావలి.కృష్ణయ్య,శేఖర్,నాగేంద్రం,లక్ష్మయ్య,పెద్ద వెంకటేష్ మాజీ ప్రజాప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.
Uncategorized
భూ తగాదాలను కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలి : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి వనపర్తి భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు న్యాయస్థానాల ద్వారానే పరిష్కరించుకోవాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ప్రజలకు న్యాయం, భద్రత, విశ్వాసం కల్పించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యం” అని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 22మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి కి ఫిర్యాదులు అందించార ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై ఎస్పీ వెంటనే స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు.
పల్లె పాటకు ప్రాణం పోసిన గాయకుడు సాయి చంద్ వనపర్తి ప్రముఖ గాయకుడు సాయిచంద్ వర్ధంతి ప్రభుత్వ ఆసుపత్రిలో బండారు శ్రీనివాస్ అధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాలుగొన్నారు. ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడాడు పల్లె పాటకు ప్రాణం పోసిన గాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ సాయి చంద్ అన్నారు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా” అంటూ ఉర్రూతలూగించిన స్వరం సాయి చంద్ ఆయన పాట వింటే రైతు నాగలి పట్టుకున్నా నాట్యం చేస్తాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన గొంతు ఒక ఆయుధమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి చందు మూడవ వర్ధంతి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ , ఇబ్రహీం , సానా బేగం, కృష్ణయ్య, మమత, కాసిం, అల్లిబాబు, పద్మ రామకృష్ణ పాల్గొనారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి వనపర్తి నపర్తి జిల్లా నూతన జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బాకరాజు శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సునీతా రెడ్డి సోమవారం కోర్టు కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై చర్చించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సంబంధించిన పోక్సో (POCSO) కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు న్యాయవ్యవస్థ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేసి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగ కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 63 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 2 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పి సీఈవో యాదయ్య అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రామ మందిరం అవకతవకలపై మోదీ మౌనం వీడాలి: సిపిఐ వనపర్తి అయోధ్య రామ మందిరం నిర్మాణంలో విరాళాలలో జరిగిన అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా విరాళంగా పంపిన సొమ్ము గోల్మాల్ జరిగిందని, హుండీ సొమ్ము చోరీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సిట్ వేసి చేతులు దులుపుకున్నారని, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాముని పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నిధుల గోల్మాల్పై సిబిఐ విచారణ చేపట్టకుండా చివరకు రాముడిని కూడా మోసం చేశారన్నారు. అనేక విషయాలపై మాట్లాడుతున్న నరేంద్ర మోడీ రామ మందిరం విరాళాల్లో అవకతవకలు, ఉండి డబ్బు చోరీపై నరేంద్ర మోడీ, బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపటం లేదన్నారు. బిజెపి నేతల తెర వెనుక పాత్ర లేకుండా ఇవన్నీ జరగమన్నారు. ఈ సంఘటనల్లో రామ మందిరం ప్రధాన పూజారి, ట్రస్ట్ చైర్మన్ వంటి ముఖ్యులను వదిలేసి సామాన్య ఉద్యోగులనే బాధ్యులను చేయటం దారుణం అన్నారు. యుద్ధం వచ్చిందని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని ఫలితంగా అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాయని, మరి దేశంలో ఎప్పుడు తగ్గిస్తారని ప్రశ్నించారు. దేశంలో ఏక పార్టీ పాలన తెచ్చేందుకు నిస్సిగ్గుగా ప్రలోభాలకు గురిచేసి ప్రాంతీయ పార్టీలను చీల్చి ఎంపీలను పార్టీలో చేర్చుకోవడం దుర్మార్గమన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలను చీల్చారని, త్రిపురలో అనామక పార్టీలో ఇతర పార్టీల ఎంపీలు చేరటం వెనుక బిజెపి పాత్ర ఉందన్నారు. సర్ పేరుతో కోట్లాది సామాన్య ప్రజల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. సర్ కోసం ఇచ్చే పత్రాలు నింపటం సామాన్యులకు రాదని, వారి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతు భరోసా రెండు విడతలు ఎగ్గొట్టారని, ఒక విడత రెండు ఎకరాలకు మాత్రమే వేశారని ఇప్పుడు మళ్లీ ఈనెల 30వ తేదీన ఖాతాల్లో రైతుబంధు వేస్తామని చెబుతున్నారని ఎన్ని ఎకరాలకు వేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున నాలుగు లక్షల ఇండ్లు మంజూరు చేశామంటున్నారని, అందులో ఎన్ని పూర్తయ్యాయో ఎన్ని పెండింగ్ ఉన్నాయో స్పష్టం చేయాలని కోరారు. గత పాలకుల తీరులోనే కాంగ్రెస్ పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు ఇవ్వాలన్నారు. అర్హులకు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం జూలై 10న వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా ఉందని జులై ఆరవ తేదీన ఇందిరాపార్క్ వద్ద ఇదే విషయమై ధర్నా ఉందని విజయవంతం చేయాలన్నారు. జూలై 10 ,11, 12 తేదీల్లో వనపర్తి లో ఉమ్మడి జిల్లా సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి తదితరులు హాజరవుతున్నారని విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్ ,రమేష్, మోష, నరసింహ శెట్టి, శ్రీహరి, గోపాలకృష్ణ, శేఖర్, శివకుమార్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్.అశ్విని దామోదర్ సతీమణి మృతిపట్ల సంతాపం వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్అ శ్విని దామోదర్ సతీమణి అశ్విని జయమ్మ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుమారుడు డాక్టర్. అశ్విని అమరేశ్వర్ గారిని ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు.
ఉచిత పోలీస్ శిక్షణ ప్రవేశ పరీక్షలు వనపర్తి పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి,మధుకర్ స్వామి డి . సి పి సారధ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామక శిక్షణ అందించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ఆదివారం విజయవంతంగా జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పరీక్షకు సుమారు 242 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా పోలీస్ నియామక శిక్షణ అందించనున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ , సాహితి కళావేదిక అధ్యక్షులు శ్రీ శంకర్ గౌడ్ , సత్తార్ , శివలింగం , రమేష్ , ఉప్పరి తిరుమలేష్ , కండ్రెని వెంకటేష్ , బి. రాము పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ మాట్లాడుతూ, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రతినిధులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లాలో పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎం.సి.హెచ్. (మాతా శిశు ఆరోగ్య కేంద్రం)లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొంతమంది చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 46 వేల మంది చిన్నారులకు 343 పోలియో బూత్‌ల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. ఏదైనా కారణంతో బూత్‌ల వద్ద చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులను గుర్తించి, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. 5 సంవత్సరాల లోపు ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన వారు తమ ప్రాంతంలోని ఆశా వర్కర్‌ను సంప్రదించి చిన్నారులకు వెంటనే పోలియో చుక్కలు వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి వనపర్తి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనతాండాలని అభివృద్ధి చెందాయని వనపర్తి నియోజకవర్గ పరిధిలోని తండాల అభివృద్ధికి రెండున్నర సంవత్సరాలలో 45 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేపట్టిన బస్సు యాత్ర శనివారం కొల్లాపూర్ నుంచి వనపర్తి నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు అన్ని గ్రామాల నుంచి 8000 మందితో ర్యాలీగా వెళ్లి బస్సు యాత్రకు స్వాగతం పలికారు. వనపర్తి పట్టణ శివారు మెట్టుపల్లి నుంచి మోటార్ సైకిల్ ర్యాలీతో అంబేద్కర్ చౌరస్తా కు చేరుకున్న నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి రాజీవ్ చౌరస్తా మీదుగా ఇందిరాగాంధీ పార్కు వద్దకు చేరుకొని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఅనంతరం రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు మురళి నాయక్, రామచంద్రనాయక్, బాలు నాయక్ రాందాస్ నాయక్, ఎంపీ బలరాం నాయక్మా జీ ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ రాములు నాయకులతో పాటు బేలయ్యనాయక్ రవీందర్ నాయక్ లు మాట్లాడారు గిరిజన రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద స్వర్ణోత్సవ బస్సుయాత్ర వనపర్తి కి చేరుకున్న సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో తమకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన గిరిజన సహోదరులందరికీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొదటగా కృతజ్ఞతలు తెలియజేశారు.స్వతంత్రం వచ్చిన నాటి నుంచి గిరిజనుల సంక్షేమానికి పాటుపడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండున్నర సంవత్సరాలలో గిరిజన తండాలలో ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని, ఉచిత కరెంటు నిస్తోందని, రేషన్ కార్డును అందజేసి నిరుపేద గిరిజనులకు సన్నబియాని పంపిణీ చేస్తూ మూడు పూటలా భోజనాన్ని అందిస్తుందని వారన్నారు. గిరిజనులు రిజర్వేషన్ కేటాయించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను మననం చేసుకుంటూ ఈ యాత్ర చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున తమకు స్వాగతం పలికి ఈ సమావేశానికి హాజరైన మీరు ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరువకూడదన్నారు. గతంలో తండాలకు వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి తండాకు పటిష్టమైన తారు రోడ్లు నిర్మించుకున్నామని వారి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజనుల పక్షపాతి అని గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారని వారి పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్, శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, గిరిజన నాయకులు మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచ్ వాళ్లే నాయక్, గిరిజన గ్రామ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు, అన్ని మండలాల గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు