యూరప్ లోని ప్రఖ్యాత ESCP బిజినెస్ స్కూల్లో డ్యుయల్ మాస్టర్ డిగ్రి విజయవంతంగా పూర్తి చేసిన తూడి నవనీత్ రెడ్డి
వనపర్తి
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తనయుడు నవనీత్ రెడ్డి గారు యూరప్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలో ఏకకాలంలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేశారు.
ESCP Business Schoolలో విధ్యనభ్యసించిన ఆయన మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(MBA) పట్టాను ప్రాన్స్ లో , మాస్టర్ ఆఫ్ సైన్(MSc) పట్టాను జర్మనీలో పూర్తి చేశారు. రెండు దేశాల్లోని విద్యా ప్రమాణాలను సమర్థవంతంగా అధిగమిస్తూ ఆయన ఈ ఘనత సాధించారు. ఈనెల 19న ప్రాన్స్ లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో నవనీత్ రెడ్డి తల్లిదండ్రులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి- శారద దంపతులు, సోదరుడు మనోజ్ రెడ్డి పాల్గొన్నారు .1819లో స్థాపించబడిన ESCP Business School ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేయడం ద్వారా నవనీత్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో తన విద్యా ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్ష కలిగిన విద్యార్థులకు నవనీత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నరు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
