VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్)ప్రక్రియ పై ప్రజలకు విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి హాల్లో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలు అందరూ ఎస్.ఐ.ఆర్ లో భాగస్వాములై తమ ఓటు ను జాబితాలో నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని, అందులో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటలకు 2కె రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 25 నుండి జూలై 31 వరకు బి.ఎల్. ఒ లు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతారనీ, ఇప్పటికే ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు, 1-10-2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే యువత సైతం ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాలను జిల్లాలోని ఓటర్లందరికీ అర్థమయ్యే విధంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6.00 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుండి వయా కొత్త బస్టాండ్ మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు 2కె రన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజా ప్రతినిధులు , విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top