VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే సాయంత్రం 6 గంటల కు జరిగింది. ఈ సందర్బంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్ని మాట్లాడారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం. వారిని ద్యర్యాన్ని కోల్పొనీయవద్దు. వారికి తొడుగా సమాజం నీలబదుద్దాం అన్నారు. AIDS అనేది ఇప్పుడు నియంత్రించగలిగే ఒక ఆరోగ్య పరిస్థితి . బీపీ, చక్కెర వ్యాధి లాగా ఎయిడ్స్ కుడా ఓక ధీర్గ కాల వ్యాధి సరైన మందులు, ART చికిత్సతో మీరు కూడా సాధారణ జీవితం గడపవచ్చు. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించండీ. వ్యాధి వచ్చిందని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు కుటుంబానికి, సమాజానికి ఎంతో విలువైనవారు. మీ ప్రేమ, మీ నైపుణ్యం, మీ కలలు అన్నీ ముఖ్యమైనవే అని అన్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. పోషకాహారం తీసుకోండి, మందులు వేళకు వేసుకోండి, పరిశుభ్రంగా ఉండండి. మీ నుండి ఇతరులకు వ్యాపించకుండా డాక్టర్ సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించండి బాధను గుండెల్లో దాచుకోవద్దు. నమ్మకమైన వ్యక్తులతో, కౌన్సెలర్లతో మాట్లాడండి. మాట పంచుకుంటే భారం తగ్గుతుందిఅని అన్నారు. మీకు నచ్చిన పని చేయండి, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. వైద్య శాస్త్రం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఆశను వదలకండి. ప్రతి ఒకరు కుడా ఎయిడ్స్ రోగులను భాదతో చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకు రావటం ప్రపంచ క్యాండిల్ లైట్ డే లక్ష్యం.కావున్న ఎయిడ్స్ రోగులను గౌరవిద్దాం. ఈ వ్యాధి తాకడం వల్ల, కలిసి తినడం వల్ల, దగ్గడం వల్ల రాదు. అపోహలు వీడండి. వ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమతో, దయతో మెలగడం మనందరి బాధ్యత.అన్నారు. ఈ ప్రోగ్రామ్ లోప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు 43వ ప్రవతుల ర్యాలీ ప్రదర్శన ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. డాక్టర్ వంశీకృష్ణ , సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పలుస శంకర్ గౌడ్ , సి ఎస్ ఓ రవి రవీందర్ రెడ్డి , డాక్టర్ బండారు శ్రీనివాస్ గారు హోప్ ఎన్ జీవో శేఖర్శి వకుమార్ , గుర్నాథ్ గౌడ్ , శ్రీమతి శివాని, భాగ్య. పద్మ మరియు ట్రాన్స్ జెండర్స్ తేజస్విని, సంయుక్త, భాస్కర్ వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు

Read More »

డీసీఎంను తాళ్లతో లాగి సిపిఐ తీవ్ర నిరసన వనపర్తి పానగల్ మండలం మూడు గ్రామాల్లో కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వాణిజ్యగ్యాస్ సిలిండర్ ధర పెంపుపై సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. కేతేపల్లి లో డీసీఎం వాహనాన్ని తాళ్లతో కట్టి గ్రామపంచాయతీ వద్ద నుంచి కొంత దూరం లాగి డీజిల్ కొనలేక వాహనాలను ఇక తాళ్లతో లాగాల్సిందేనని సంకేతాలు ఇచ్చి నిరసన తెలిపారు. వెంగలాయపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్రజెండాలు ధరించి ధరల పెంపుపై నిరసన తెలిపారు. తెల్ల రాళ్లపల్లి బస్టాండ్ వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ వాణిజ్య వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 కు పెంచిందని దానితో హోటళ్లలో తినుబండారాలపై విపరీతంగా ధరలు పెరిగాయి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచమని ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన నరేంద్ర మోడీ ఎన్నికలు ముగియగానే లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఏకంగా రూ.3.50 పెంచి ప్రజలను దగా చేశారన్నారు. పెట్రోల్ పై మరో వారం రోజుల్లో రూ. పది పెంచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రష్యా చమురును తక్కువ ధరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడి కొనడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విజర్లాండ్ నుంచి నల్లధనం తెచ్చి ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. నరేంద్ర మోడీ ఏనాడూ కార్మికుల కర్షకుల సమస్యలను పట్టించుకోలేదని సంపన్నులకు ఊడిగం చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలను లేబర్ కోడులు తెచ్చి నిర్వీర్యం చేశారని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని, పని గంటలు 8 నుంచి 12 కు పెంచారని మోదీ ప్రజా వ్యతిరేక పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ పోరాడుతుందని బిజెపి ప్రజా సమస్యలను గాలికి వదిలి జైశ్రీరామ్ పేరుతో అధికారంలో కొనసాగుతోందని విమర్శించారు. బంగారం కొనదని, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని, పొదుపు పాటించాలంటున్నారని, సంసార జీవితం గడిపే వారికి వాటి అవసరం తెలుస్తుందనినరేంద్ర మోడీకి ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని వెంటనే తగ్గించాలని లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వంక గోపాల్, చందు,సంగనమోని రాముడు తదితరులు ధరల పెంపుకు నిరసన తెలుపుతూ డప్పులు కొట్టుకుంటూ పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, వార్డు సభ్యురాలు కురుమమ్మ, మాజీ వార్డు సభ్యుడు కమ్మావుల పెంటయ్య, రామదాసు, చిన్న ముత్యాలు, మంగలి వెంకటయ్య, బుడ్డ బాలస్వామి, హోటల్ రాముడు, సంగనమోని రాముడు, దొడ్ల బీరయ్య, సిపిఐ వెంగలాయిపల్లి గ్రామ కార్యదర్శి మల్లెపు బాలస్వామి, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ కాకం బాలస్వామి, గ్రామ శాఖ కార్యదర్శి సహదేవుడు సీనియర్ నాయకులు ఎర్రగుంట రాముడు, కాకంరాముడు, పరంధాములు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

భారతదేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వీఐపీలు ఖర్చులు తగ్గించుకోండి పొదుపు పాటించండి వనపర్తి భూగోళం లో జరుగుతున్న అనేక రకాల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో ఎగుమతి దిగుమతులు కూడా భారతదేశంపై ప్రభావం చూపాయిఇందులో ప్రధానమైనవి చమురు నిలువలు భారతదేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భారతీయులందరూ ముఖ్యంగా విఐపి హోదా ఉన్న పెద్ద వాళ్ళందరూ తమ తమ కాన్వాయువులో ఉండే వాహనాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుని ఆయిల్ నిల్వలను కాపాడుకోవాలని, పొదుపు పాటించాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్ ,13 వార్డు కౌన్సిలర్ బొడ్డు. పరశు రామ్,11 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నంది పేట్ తిరుపతయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ మెంబర్ నడిమింటి శివ శంకర్ కోరారు. అందులో భాగంగా ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ కాన్వాయులను 90 శాతం తగ్గించుకొని ఆర్థిక మాంద్యాన్ని కాపాడుకొనుటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోళ్ల కోరారు. కాన్వాయిల్లో డీజిల్, పెట్రోలు వాడకం ఎక్కువ అవుతున్నందున వాహనాల సంఖ్యను తగ్గించుకుంటే చమురు నిలువలు పెరుగుతాయని కోళ్ల వెంకటేష్ చెప్పారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని మోదీ సూచనలు పాటిస్తే బాగుంటుందని, రాజకీయ పార్టీలు వేరైనా సలహాలు సూచనలు అవసరం ఎంతైనా ఉందని కోళ్ళ వెంకటేష్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇందన పొదుపు, విదేశీ మరక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా ఆలోచించి స్వీయ నిర్ణయం తీసుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోళ్ళ వెంకటేష్ కోరారు. భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రతి భారతీయుడు రాజకీయ పార్టీలకు అతీతంగా పాటించాలని ఇవి రాజకీయాలు కాదు, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ కోసం పాటించాలని కోళ్ళ వెంకటేష్ తెలిపారు

Read More »

సామూహిక కార్మికుల పండగలలో పాలుపంచుకుంటే ఆత్మసంతృప్తి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తి పట్టణ తోపుడు బండ్ల సంఘం ప్రతి ఏటా నిర్వహించే “కోట మైసమ్మ పండుగకు”అనవాయితీ ప్రకారం మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి 10వేల ఆర్థిక సహకారం జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ద్వారా అందజేశారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి కార్మికులతో ఫోన్ లో మాట్లాడుతూ గ్రామ దేవతల్ని ప్రతి సంవత్సరం ఆరాధించడం వల్ల కార్మిక కుటుంబాలతో పాటు పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ పండుగలు కార్మికుల మధ్య ఐక్యత,స్నేహభావం పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమములో తోపుడు బండ్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగశేషన్న,రాఘవేంద్ర మరియు రాములు,మల్లయ్య కార్మికులు ఉన్నారు

Read More »

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి వనపర్తి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రణాళికా ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి వీసిలో పాల్గోన్నారు. సీఈఓ మాట్లాడుతూ తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను చేపడుతూ భారత ఎన్నికల కమిషన్ కీలక షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం, 2026 జూన్ 15 నుండి 24 వరకు బీ ఎల్ వో లకు, సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అనంతరం, జూన్ 25 నుండి జూలై 24 వరకు నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో బీ ఎల్ వో లు ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. సర్వే అనంతరం, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే ఆగస్టు 30 వరకు స్వీకరించడం జరుగుతుందని, అభ్యంతరాల్ని సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత, చివరగా అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను (Final Voter List) అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణ విజయవంతం చేయాలన్నారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్ తెలియజేయాలనీ సూచించారు. అదేవిధంగా, రాజకీయ పార్టీలు బిఎల్ఎ లను నియామకం చేసుకొని వారి జాబితా సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రణాళికా ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్)కు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ను ప్రజలందరికి తెలియజేయాలన్నారు. ఇక ఎస్ ఐ ఆర్ లో భాగంగా నిర్వహిస్తున్న మాపింగ్ ప్రక్రియ వనపర్తి లో 79.81 శాతం పూర్తి అయిందని, ఇంకా వేగవంతం చేసి మాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని, అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ కోరారు. సమావేశం లో సి సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డి సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, జిల్లా ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా పోరాటాలకు ఊపిరులూదిన ప్రజానాట్యమండలి : శ్రీనివాసులు వనపర్తి దేశ స్వాతంత్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు ప్రజలను చైతన్యం చేసి ముందుకు నడిపించిన ఘన చరిత్ర ప్రజానాట్యమండలి సొంతమని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం సిపిఐ ఆఫీస్ వద్ద ప్రజానాట్యమండలి 4వ జిల్లా మహాసభ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యం మండలి జిల్లా అధ్యక్షుడు గోపాల అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. 1943లో ప్రజానాట్యమండలి ఏర్పడిందని దేశ స్వాతంత్రం కోసం ఆటపాటతో ప్రజల్లో స్వాతంత్ర ఆకాంక్షను రగిలించి, పోరాటాల్లోకి నడిపించిందన్నారు. ‘బాంచన్ నీ కాల్మొత్త దొర’అని పెట్టి చేసి జీవిస్తున్న తెలంగాణ ప్రజల విముక్తికి ఆటపాటతో ప్రజానాట్యమండలి ప్రజలను చైతన్యం చేసి నిజాం పాలనను కూల్చిందన్నారు. ఆనాడు కవులు కళాకారులు ఒక చేత పెన్ను ఒక చేత గన్ను పట్టుకొని పోరాడారన్నారు. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో ప్రజానాట్యమండలి కవులు కళాకారులు ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం రగించారన్నారు. ధూమ్ దాం పేరుతో ఊరువాడ ప్రతిధ్వనించిందన్నారు. ప్రజల సమస్యలపై జరిగిన పోరాటాల్లోను ప్రజానాట్యమండలి కీలకపాత్ర పోషించింది అన్నారు. ఎర్రజెండా బిడ్డలుగా ప్రజానాట్యమండలిని ప్రజల కోసం బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పార్టీ ఉన్న ప్రతి గ్రామంలో ప్రజానాట్యమండలి కళాకారులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు యువతను ఆకర్షించేందుకు కళాశాలల్లో పాఠశాలలను పాటల పోటీలు కవితల పోటీలు పెట్టాలన్నారు. వారికి ప్రజా, విద్యార్థుల సమస్యలను వివరించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఐదో మహాసభ నాటికి జిల్లా ప్రజానాట్యమండలిని బలోపేతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంకా గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా నాయకులు కళావతమ్మ, విజయుడు, శ్రీరామ్, రవీందర్, జయమ్మ, శ్యాంసుందర్, శిరీష, కుతుబు, వెంకటేష్, చందు, లక్ష్మీనారాయణ, ఇజ్రాయిల్, కుమార్, రూప తదితరులు పాల్గొన్నారు.

Read More »

పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ పైసిపిఐ తీవ్ర నిరసన వనపర్తి వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలిపారు. పెట్రోల్ లీటర్కు రూ. మూడు చొప్పున పెంచిన ధరను తగ్గించాలని, నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ రద్దు వల్ల నష్టపోయిన ప్రతి విద్యార్థికి NTA నుంచి రూ. లక్ష నష్టపరిహారం ఇప్పించాలని నినాదాలు చేశారు. సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పశ్చిమాసియాలో యుద్ధం ఉన్న ధరలు పెంచబోమని చెబుతూ వచ్చిన కేంద్రం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధర రూ. మూడు పెంచి ప్రజలను నిలువున మోసం చేసిందన్నారు. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ పై ఏకంగా రూ. 993 పెంచడమే గాక వంట గ్యాస్ కూడా సరఫరా లో విఫలమైందన్నారు. అవసరానికి సరిపడా వంట గ్యాస్ ఇవ్వటం లేదన్నారు. ఇప్పుడు పెట్రోల్ ధర రూ. మూడు పెంపుతో నిత్యవసరం వస్తువుల ధరలు పెరిగి సామాన్యునిపై భారం పడుతుందని, ధరలను తగ్గించాలన్నారు. నీట్ పరీక్ష పత్రం లీక్ తో కష్టపడి చదువుకున్న విద్యార్థుల బతుకులు ఆగమయ్యాయి అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని తమ పిల్లలకు రూ. లక్షలు అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించాలని నీట్ రద్దుతో వారిపై మళ్లీ కోచింగ్ భారం పడనుందని, ఎన్టిఏ నుంచి ప్రతి విద్యార్థికి రూ. లక్ష నష్టపరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ ప్రభుత్వంగా మారిందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నేతలు కళావతమ్మ విజయుడు రవీందర్ గోపాలు లక్ష్మీనారాయణ జయమ్మ శిరీష కృష్ణయ్య చందు వెంకటేష్ ఎర్రన్న శ్యాంసుందర్ వంశీ కుమార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లాలో ఇండ్ల గణన ప్రక్రియకు ప్రజలు సహకరించాలి : అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్ వనపర్తి జిల్లాలో 2027 జనగణనలో భాగంగా మే 11 నుండి ఇంటింటి గణన కార్యక్రమం ప్రారంభమైందని, ఇందుకోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించి, ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ గణనలో భాగంగా ప్రతి ఇంటి పరిస్థితి, ఇంటి నిర్మాణ స్వభావం, గదుల సంఖ్య, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, వంట ఇంధనం (LPG, కట్టెలు, విద్యుత్), వాహనాలు, ఇంటర్నెట్ సదుపాయం వంటి వివరాలను సేకరిస్తారని తెలిపారు. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ తదితర గృహోపకరణాల వివరాలను కూడా నమోదు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 33 ప్రశ్నల ద్వారా ఇంటి వివరాలను సేకరించే ఈ ప్రక్రియలో అధికారులు అడిగే ప్రశ్నలకు ప్రజలు సరైన సమాచారం అందించాలని సూచించారు. జనగణనలో భాగంగా ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రభుత్వ అధికారిక గుర్తింపు కార్డు ఉంటుందని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.జిల్లా ప్రజలందరూ సహకరించి గణన ప్రక్రియను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ విజ్ఞప్తి చేశారు.

Read More »

తెలంగాణలోనే టాప్ 10 మార్కులు సాధించిన పేద మైనార్టీ విద్యార్థిని సన్మానించిన ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్ వనపర్తి శుక్రవారం ఉదయం మొహమ్మద్ ఇంటికి వెళ్లి వారి కూతురు , జీనత్ 10 వ తరగతి లో 585 మార్కులతో తెలంగాణలో టాప్ టెన్ మార్కులు సాధించినందున వారికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వనపర్తికి సంబంధించి ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తెలంగాణ టాప్ లో నిలబడడం వనపర్తికి గర్వకారణమని తెలుపుతూ, చాలామంది ఇలాంటి విద్యార్థులు మార్కులు తెచ్చుకుని వనపర్తికి విద్యాపర్తి అనే పేరును సార్ధకర్థం చేస్తున్నారని మాకు ఇలాంటి విద్యార్థినీ విద్యార్థుల వివరాలు ఇస్తే అందరికీ సన్మానం చేస్తామని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.

Read More »

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక వనపర్తి పెద్దమందడి మండలం దొడగుంటపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ s/o చెన్నప్ప, ఉపాధ్యక్షుడిగా బూసని శ్రీకాంత్ s/o ఆంజనేయులు , కార్యదర్శిగా k కృష్ణయ్య S/O బాలయ్య, కోశాధికారిగా నందమోని వెంకటయ్య s/o కరెన్నలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారి కవిత ఆధ్వర్యంలో శుక్రవారం దొడగుంటపల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించారు. అనంత ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడికి నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు నాగన్న, నందమోని తిరుపతయ్య, జంగం పెద్ద నాగరాజు, జంగం చిన్న గోపాల్, ఆంజనేయులు, బి ఆంజనేయులు, దండు చిన్న రాములు, దండు చెన్నారాయుడు, దండు పెద్ద కురుమన్న, టైలర్ కురుమయ్య, రాజశేఖర్, తోకల సైదులు, బి శ్రీనివాసులు, బి సైదులు, డి కృష్ణ, జంగం నాగరాజు, జేబి రాములు, సంఘం సభ్యులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

Read More »

Scroll to Top