తెలంగాణలోనే టాప్ 10 మార్కులు సాధించిన పేద మైనార్టీ విద్యార్థిని సన్మానించిన ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్
వనపర్తి
శుక్రవారం ఉదయం మొహమ్మద్ ఇంటికి వెళ్లి వారి కూతురు , జీనత్ 10 వ తరగతి లో 585 మార్కులతో తెలంగాణలో టాప్ టెన్ మార్కులు సాధించినందున వారికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వనపర్తికి సంబంధించి ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తెలంగాణ టాప్ లో నిలబడడం వనపర్తికి గర్వకారణమని తెలుపుతూ, చాలామంది ఇలాంటి విద్యార్థులు మార్కులు తెచ్చుకుని వనపర్తికి విద్యాపర్తి అనే పేరును సార్ధకర్థం చేస్తున్నారని మాకు ఇలాంటి విద్యార్థినీ విద్యార్థుల వివరాలు ఇస్తే అందరికీ సన్మానం చేస్తామని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.
