గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
వనపర్తి
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలో 10 గ్రామ పంచాయతీ (GP) భవనాలు ఒక్కో దానికి రూ.20 లక్షలు మొత్తం రూ. 2 కోట్లు, 11 అంగన్‌వాడీ కేంద్రాలు: 132.00 లక్షలు (ఒక్కో దానికి రూ ల.12 లక్షలు) , 30 విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాలు రూ. 300.00 లక్షలు (ఒక్కో దానికి రూ.10 లక్షలు), 8 వ్యవసాయ గిడ్డంగులు (Storage Godowns) రూ 240.00 లక్షలు (ఒక్కో దానికి రూ.30 లక్షలు), మహిళా శక్తిభవనం: రూ.20.00 లక్షలు, 2 వర్క్‌షెడ్ భవనాలు: రూ.20.00 లక్షలు (ఒక్కో దానికి రూ.10 లక్షలు), మొత్తం మంజూరైన నిధులు: రూ.9,12,00,000/- (9 కోట్ల 12 లక్షల రూపాయలు), మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతన్నలకు అండగా, మహిళా సాధికారతకు గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఈ నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
