VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

అభివృద్ధి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిది…ఆర్భాటాలు ఎమ్మెల్యే వి వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి తన మేధస్సుతో అవసరమైన శాశ్వత పథకాలకోసం నిధులు సాధించి పూర్తి చేశారు. ఎంతో ఆర్భాటంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిప్రారంభించిన డిజిటల్ జిల్లా గ్రంథాలయం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సాధించిన విషయం గుర్తెరగాలని వాకిటి.శ్రీధర్ అన్నారు. ఏ లక్ష్యంతో కోట్ల రూపాయలతో నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని ఆ లక్ష్యసాధనకు అసమర్థత ఈనాటి ఎం.ఎల్.ఏ గారిది అని వాకిటి విమర్శించారు. ఎం.ఎల్.ఏ ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఒక్క కొత్త అభివృద్ధి పథకం తీసుకురాలేదు కానీ పత్రికా ప్రకటనలలో మాత్రం వేల కోట్ల అంకెల గారడి చేసి ప్రజలను మభ్యపెట్టాలని చేస్తున్నారని దుయ్యబట్టారు. 90శాతం పూర్తి అయిన రోడ్ల విస్తరణ మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయాలని అసమర్థత నేటి పాలకులది అని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల విషయములో అరకొర ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తప్ప ఒక్క కొత్త సంక్షేమ పథకం అమలు కాలేదని ఇచ్చిన 6 గ్యారంటీలు, 11డిక్లరేషన్లు,420హామీలు గాలికి వదిలేసింది ప్రభుత్వం అని విమర్శించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సాధించిన పథకాలకు ప్రారంభోత్సవాలు చేయడం మాని కొత్త పథకాలు తెచ్చి చూపాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం కొనుగోళ్లు లేక పడిగాపులు కాస్తూ ఉంటే రైతులను పాటించుకోకుండా మంది మార్భలాన్ని వేసుకొని హంగామా చేసుకుంటూ కాలం గడుపుతున్న ఎం.ఎల్.ఏ గారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వాకిటి.శ్రీధర్ హెచ్చరించారు.

Read More »

వనపర్తి చరిత్రను ఎలిగెత్తి చూపే విధంగా జిల్లా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుకుందాం వనపర్తి ఎంతో ఘన కీర్తి కలిగిన వనపర్తి జిల్లా చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపించేలా జిల్లా గ్రంధాలయాన్ని తీర్చిదిద్దుకుందమని, సాంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు రూ. రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కోరారు. గురువారం వనపర్తి జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తును ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి, గార్లతో పాటు ఆయన పాల్గొని మాట్లాడారు కవులు, కళాకారులు, సప్త సముద్రాలు కలిగియుండి వందల సంవత్సరాల ముందే ఎంతో ఘనకీర్తి గలిగిన వనపర్తి చరిత్రను గ్రంథాలయంలో ప్రస్ఫుటీంచే విధంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని వనపర్తి గ్రంధాలయంలోనే ప్రారంభించుకున్నట్లు ఆయన జ్ఞాపకం చేశారువిద్యాపర్తిగా పేరుందిన వనపర్తి జిల్లాలో పూర్వ విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వపరమైన అన్ని విద్యాసంస్థలను వనపర్తిలో ఏర్పాటు చేసుకున్నమని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాద్, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Read More »

విద్యారంగంలో దేశంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి వనపర్తి తెలంగాణను విద్యారంగంలో దేశంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.గురువారం పెబ్బేరు పట్టణంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు ముఖ్య అతిథులుగా హాజరై మోడల్ అంగన్వాడీ కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పెబ్బేరు మండలంలో ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ. 49 లక్షల నిధులతో మండల పరిధిలో 13 అంగన్వాడీ కేంద్రాలను ఆధునికరించి మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. గురువారం ప్రారంభించిన వాటిలో పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి మండల పరిషత్ పాఠశాల ఆవరణలో ఉన్న మోడల్ అంగన్వాడీ కేంద్రం, పెబ్బేరు లోని రెండో వార్డులో అంగన్వాడీ కేంద్రం, చెలిమిల్లలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని 2వ వార్డులో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో తెలంగాణను విద్యారంగంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. సన్న బియ్యం, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని కోరారు. అలాగే ఏబిడి కంపెనీ వారు సీఎస్ఆర్ నిధుల కింద రెండు శాతం నిధులను, పెబ్బేరు మండలంలో విద్యారంగం మరియు పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పాఠశాలలకు కాంపౌండ్ వాల్, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా వారు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ బీడీ లిక్కర్ కంపెనీ ఆధ్వర్యంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండల పరిధిలో 13 అంగన్వాడి కేంద్రాలను మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు. ఈ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలను మోడల్ అంగన్వాడీలుగా తీర్చిదిద్దినందుకు ఏబీడీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సౌకర్యాలను ప్రజలు సంరక్షించుకోవాలని బాగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎబిడి లిక్కర్ కంపెనీ డైరెక్టర్ రాజేష్, కంపెనీ ప్రతినిధులు ఉమాశంకర్, వెంకటేశ్వర్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ సుమిత్ర, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం గా జరగాలి వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం గా జరగాలని, అదేవిధంగా మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్లోడింగ్ ప్రక్రియ కూడా వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఏఎస్పి రాజేష్ మీనా తో కలిసి పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వీరాయిపల్లి సమీపంలోని ఎఫ్ పి ఓ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నమోదు రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఇన్చార్జ్ లకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా జరగాలని సూచించారు. తేమశాతం నిర్ధారించుకుని వేగంగా కాంటాక్ట్ చేసి కేటాయించిన మిల్లుకు తరలించే విధంగా చూడాలన్నారు. రెవెన్యూ శాఖ తరపున కేటాయించిన ప్రత్యేక అధికారి కొనుగోలు కేంద్రం వద్ద ఈ పది రోజులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీయగా, ఈ క్రమంలో రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ లారీల ట్రాన్స్పోర్ట్ సమస్య ఉందని, అందువల్లనే ధాన్యం మిల్లులకు తరలించడం ఆలస్యం అవుతుందని తెలియజేశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ లారీలను అదనంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖిలా గణపురం మండల పరిధిలోని సోలిపురం గ్రామ శివారులో ఉన్న సింధు ఆగ్రో రైస్ మిల్లు ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లు ఆవరణలో వేచి ఉన్న ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేయించాలని సూచించారు. అదేవిధంగా గోదాంలో ధాన్యం బస్తాల అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు వద్ద మిల్లర్లు ధాన్యంలో తాలు చెక్ చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

Read More »

డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో మనిషి అవసరార్థం ఉపయోగపడేందుకు ఆసుపత్రులు ఎంతో అవసరమని ప్రజాసేవలో ఆసుపత్రులే మొదటి వరుసలో ఉంటాయని, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని 23 వార్డులో దంత వైద్యుడు ప్రణయ్ కుమార్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన సమర్త్ సాయినాథ్ డెంటల్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్య వృత్తిలో ఉండి నిరుపేదలకు సేవ చేయడం గర్వించదగిన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్యులు నిస్వార్ధంగా వైద్య సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

ప్రజా చైతన్యంలో కళలది ప్రత్యేక పాత్ర: వంక గోపాల్ వనపర్తి సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేయటంలో కళలకు ప్రత్యేక స్థానం ఉందని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంకా గోపాల్ అన్నారు. బుధవారం వనపర్తి ఆఫీసులో ప్రజానాట్యమండలి నాలుగవ రాష్ట్ర మహాసభ గోడపత్రికలను కళాకారులు, నేతలతో కలిసి ఆవిష్కరించారు. మాట్లాడుతూ.. ఒక గొప్ప ఉపన్యాసం కంటే పాట, నాటకం, ఒగ్గు కథ, గొల్ల సుద్దులు వివిధ రూపాల కళలు ఎక్కువగా ప్రజలను కదిలిస్తాయన్నారు. అందువల్ల జిల్లాలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళలు కళారూపాల అభివృద్ధికి విశేష కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా చైతన్యంతో పాటు పార్టీ అభివృద్ధికి కళలు పట్టుగొమ్మలుగా ఉపయోగపడతాయని, జిల్లాలో కళాబృందాల ఏర్పాటుకు అందరూ తోడ్పాటు అందించాలన్నారు. జీవితకాలం ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచిన వృద్ధ కళాకారులు జీవించలేని స్థితిలో ఉన్నారని వారిని ఆదుకునేందుకు పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇండ్లు, ఇళ్లస్థలాలు మంజూరిలో వారికి ప్రత్యేక కోటా కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆవిర్భావం మే 25న జరిగిందని, ఆరోజు హైదరాబాద్ మగ్దుంభవన్ లో రాష్ట్ర నాలుగవ మహాసభ జరుగుతుందని 26న ప్రతినిధుల సభ ఉంటుందని జిల్లా కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కళావతమ్మ, శ్రీరామ్, రమేష్, కృష్ణవేణి, జయమ్మ, గంధం నాగరాజు,శేఖర్, చిన్న కుర్మన్న, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కేంద్రమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి : NFIW,CPI వనపర్తి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ మైనర్ బాలికపై లైంగిక దాడికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు, కేతేపల్లి ఉప సర్పంచ్ కృష్ణవేణి, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి కే శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. పానగల్ మండలం కేతేపల్లి బస్టాండ్ లో బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను పూజించే గౌరవించే దేశం మనదని, సనాతన ధర్మాన్ని కాపాడుతామని బిజెపి నేతలు గొప్పలు చెబుతారని, ఆచరణలో నీచంగా వ్యవహరిస్తారని విమర్శించారు.కరీంనగర్లో మైనర్ బాలికపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి దురాగతం దీనికి తాజా ఉదాహరణ అన్నారు. బిజెపి పాలిత మణిపుర్ రాష్ట్రంలో గతంలో ఇద్దరుమహిళలను నగ్నంగా ఊరేగించారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఎదిగిన బండి సంజయ్ తన కుమారుడికి సత్ప్రవర్తన నేర్పించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. తండ్రిగా కుమారునికి సత్ప్రవర్తన నేర్పించడంలో వైఫల్యానికి ఆయన నైతిక బాధ్యత వహించాన్నారు. లైంగిక దాడిపై బాలిక కుటుంబ సభ్యులు సాయి భగీరథ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. సామాన్యుల పిల్లలు లైంగిక దాడి నేరానికి పాల్పడితే ఫోక్సో కేసు పెట్టి, వెంటనే నిందితులను అరెస్టు చేస్తారని దొరకకపోతే తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారని మరి బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్యుడికి ఒక నీతి ఉన్నత పదవుల్లో ఉన్న వారికి మరొక నీతా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయి భగీరథ అరెస్టుపై ఆలస్యాన్ని ఖండించారు. బాధ్యత గల కేంద్ర మంత్రిగా తన కొడుకును పోలీసులకు సరెండర్ చేయాలని లేదా నైతిక బాధ్యత వహించి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయకుంటే ప్రధాని జోక్యం చేసుకొని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాయి భగీరథ కూడా తనపై హానీ ట్రాప్ జరిగిందని పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. ఇది కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం అని, సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేదంటే సిపిఐ, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ,సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, మాజీ వార్డు సభ్యుడు కమ్మావులపెంటయ్య ,వార్డు మెంబర్ మాల కురువమ్మ, సిపిఐ కేతపల్లి గ్రామ శాఖ కార్యదర్శికాకం చిన్న నారాయణ, కాకం కాశన్న, రామాంజనేయులు, బాలస్వామి, ఎల్లయ్య, ఎల్లమ్మ, రామదాసు, కాకం కాశన్న, నీలమ్మ ,బొక్కలమ్మ, సాయి లీల ,బోయ చిన్న కుర్మయ్య ,బీరయ్య, ధర్మయ్యతదితరులు పాల్గొన్నారు

Read More »

కళాశాల లో కొత్తగా AEDP కోర్స్ ల ను ప్రారంభించటం ఆనందదాయకం వనపర్తి ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక విద్యా వారాత్సవాల లో భాగంగా సోమవారం వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ శాసన సభ్యులు తుడి మేఘారెడ్డి కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ కళాశాల లో కొత్తగా AEDP కోర్స్ ల ను ప్రారంభించటం ఆనందదాయకమని, విద్యార్థులకు స్థాయిపండ్ బాగా ఉపయోగ పడుతుంది అని అన్నారు.ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అధిక సంఖ్య లో చేరి కళాశాల లో ఉండే వనరుల ను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు అదేవిదంగా కళాశాల సిబ్బంది విద్యార్థుల అడ్మిషన్ సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం లో మరింత పెంచుటకు సమిష్టిగా కృషి చేయాలి అని MLA సూచించారు ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. B. ఈశ్వరయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ లు రామరాజు యాదవ్, దామోదర్ రెడ్డి, విష్ణుమూర్తి, శ్రీనివాసులు, యువరూప లక్ష్మి, గోవర్ధన్, విజయలక్ష్మి, మన్నేమన్నా, మణిదీప, సీనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, బోధనేతర సిబ్బంది, విద్యార్ధినులు పాల్గొన్నారు.

Read More »

రైతులు వారు పండించిన వడ్లను అమ్ముకోవడానికి ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు వనపర్తి రైతులు పండించిన వడ్లను అమ్మడానికి రైతులు ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదనీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండించిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులకు పూర్తి భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కల్యాణ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో క‌లిసి మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి, అన్నదాతల శ్రేయస్సును కాపాడటమే రాష్ట్ర ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు, కొనుగోలుదారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడా పారదర్శకత లోపించకూడదని ఆదేశించారు. రైతు కష్టానికి తగిన ప్ర‌తిఫ‌లం దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కొనుగోలు ప్రక్రియలో ఎవరూ ఎవరినీ బతిమాలుకునే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. కొనుగోలు కేంద్రంలోనే నిబంధనల ప్రకారం వడ్లు నాణ్యత చూసుకొని తూకం చేసి రైతుకు అక్కడే రశీదు ఇచ్చేయాలని అంతే తప్ప రైతు లారీ వెంబడి మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వడ్లు నాణ్యతను బట్టి తరుగు తాలు కొనుగోలు కేంద్రంలోనే జరగాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లారీ మిల్లుకు వచ్చిన తర్వాత తరుగు అనే మాట మాట్లాడకుండా వడ్లు దించుకోవాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులు నాణ్యమైన వడ్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన ధాన్యం మిల్లు ఆడించి ఎఫ్.సి.ఐ.కి క్వింటాలుకు 68 కిలోల చొప్పున తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, నాణ్యమైన వడ్లు ఇవ్వకపోవడం వల్ల మిల్లర్లు నష్టపోతున్నారని మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఎఫ్.సి.ఐ.కి ఇచ్చే 68 కిలోల బియ్యంలో నూకలు, సరిగ్గా గింజలు నిండనివి, ఇతరత్రా కలుపుకొని దాదాపు 23 శాతం ఉంటుందని అందువల్ల మిల్లర్లు నష్టపోయే అవకాశమే లేదని, రైతులకు సహకరించి వారిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఈ స‌మావేశంలో జిల్లా క‌లెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ , మార్కెట్ కమిట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, సివిల్ సప్లైస్ అధికారులు, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులు, రైస్ మిల్లుల ప్రతినిధులు, వడ్లు కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనపర్తి శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి తన వంతుగా రూ 3 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించే ఎటువంటి పండుగలు గ్రామ ఐక్యతను చాటి చెబుతాయని ఇలాంటి పండుగలను పాల్గొనడం సంతోషి దాకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

Read More »

Scroll to Top