భారతదేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వీఐపీలు ఖర్చులు తగ్గించుకోండి పొదుపు పాటించండి
వనపర్తి
భూగోళం లో జరుగుతున్న అనేక రకాల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో ఎగుమతి దిగుమతులు కూడా భారతదేశంపై ప్రభావం చూపాయి
ఇందులో ప్రధానమైనవి చమురు నిలువలు భారతదేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భారతీయులందరూ ముఖ్యంగా విఐపి హోదా ఉన్న పెద్ద వాళ్ళందరూ తమ తమ కాన్వాయువులో ఉండే వాహనాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుని ఆయిల్ నిల్వలను కాపాడుకోవాలని, పొదుపు పాటించాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్ ,13 వార్డు కౌన్సిలర్ బొడ్డు. పరశు రామ్,11 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నంది పేట్ తిరుపతయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ మెంబర్ నడిమింటి శివ శంకర్ కోరారు. అందులో భాగంగా ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ కాన్వాయులను 90 శాతం తగ్గించుకొని ఆర్థిక మాంద్యాన్ని కాపాడుకొనుటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోళ్ల కోరారు. కాన్వాయిల్లో డీజిల్, పెట్రోలు వాడకం ఎక్కువ అవుతున్నందున వాహనాల సంఖ్యను తగ్గించుకుంటే చమురు నిలువలు పెరుగుతాయని కోళ్ల వెంకటేష్ చెప్పారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని మోదీ సూచనలు పాటిస్తే బాగుంటుందని, రాజకీయ పార్టీలు వేరైనా సలహాలు సూచనలు అవసరం ఎంతైనా ఉందని కోళ్ళ వెంకటేష్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇందన పొదుపు, విదేశీ మరక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా ఆలోచించి స్వీయ నిర్ణయం తీసుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోళ్ళ వెంకటేష్ కోరారు. భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రతి భారతీయుడు రాజకీయ పార్టీలకు అతీతంగా పాటించాలని ఇవి రాజకీయాలు కాదు, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ కోసం పాటించాలని కోళ్ళ వెంకటేష్ తెలిపారు
