మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక
వనపర్తి
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ s/o చెన్నప్ప, ఉపాధ్యక్షుడిగా బూసని శ్రీకాంత్ s/o ఆంజనేయులు , కార్యదర్శిగా k కృష్ణయ్య S/O బాలయ్య, కోశాధికారిగా నందమోని వెంకటయ్య s/o కరెన్నలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారి కవిత ఆధ్వర్యంలో శుక్రవారం దొడగుంటపల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించారు. అనంత ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడికి నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు నాగన్న, నందమోని తిరుపతయ్య, జంగం పెద్ద నాగరాజు, జంగం చిన్న గోపాల్, ఆంజనేయులు, బి ఆంజనేయులు, దండు చిన్న రాములు, దండు చెన్నారాయుడు, దండు పెద్ద కురుమన్న, టైలర్ కురుమయ్య, రాజశేఖర్, తోకల సైదులు, బి శ్రీనివాసులు, బి సైదులు, డి కృష్ణ, జంగం నాగరాజు, జేబి రాములు, సంఘం సభ్యులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు
