పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ పైసిపిఐ తీవ్ర నిరసన
వనపర్తి
వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలిపారు. పెట్రోల్ లీటర్కు రూ. మూడు చొప్పున పెంచిన ధరను తగ్గించాలని, నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ రద్దు వల్ల నష్టపోయిన ప్రతి విద్యార్థికి NTA నుంచి రూ. లక్ష నష్టపరిహారం ఇప్పించాలని నినాదాలు చేశారు. సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పశ్చిమాసియాలో యుద్ధం ఉన్న ధరలు పెంచబోమని చెబుతూ వచ్చిన కేంద్రం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధర రూ. మూడు పెంచి ప్రజలను నిలువున మోసం చేసిందన్నారు. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ పై ఏకంగా రూ. 993 పెంచడమే గాక వంట గ్యాస్ కూడా సరఫరా లో విఫలమైందన్నారు. అవసరానికి సరిపడా వంట గ్యాస్ ఇవ్వటం లేదన్నారు. ఇప్పుడు పెట్రోల్ ధర రూ. మూడు పెంపుతో నిత్యవసరం వస్తువుల ధరలు పెరిగి సామాన్యునిపై భారం పడుతుందని, ధరలను తగ్గించాలన్నారు. నీట్ పరీక్ష పత్రం లీక్ తో కష్టపడి చదువుకున్న విద్యార్థుల బతుకులు ఆగమయ్యాయి అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని తమ పిల్లలకు రూ. లక్షలు అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించాలని నీట్ రద్దుతో వారిపై మళ్లీ కోచింగ్ భారం పడనుందని, ఎన్టిఏ నుంచి ప్రతి విద్యార్థికి రూ. లక్ష నష్టపరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ ప్రభుత్వంగా మారిందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నేతలు కళావతమ్మ విజయుడు రవీందర్ గోపాలు లక్ష్మీనారాయణ జయమ్మ శిరీష కృష్ణయ్య చందు వెంకటేష్ ఎర్రన్న శ్యాంసుందర్ వంశీ కుమార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
