VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

నపర్తి జిల్లా నూతన జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బాకరాజు శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సునీతా రెడ్డి సోమవారం కోర్టు కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై చర్చించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సంబంధించిన పోక్సో (POCSO) కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు న్యాయవ్యవస్థ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేసి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 29 at 3.50.06 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top