బుద్దారాం రిజర్వాయర్ ముంపు బాధితుల రాస్తారోకో
వనపర్తి
గోపాల్ పేట మండలం బుద్దారం పెద్ద చెరువు రిజర్వాయర్ నీటి ముంపు రైతులు భూములు కోల్పోతున్న మాకు నష్టపరిహారం పెంచాలని దాదాపు 2గంటలపాటు వాహనాలు నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వాయర్ లో మునిగిపోయిన శిఖం భూములకు మొదటి విడతగా రైతులకుగతములో 12లక్షల 40వేల రూపాయలు ఎకరాకు చెల్లించారని ఇట్టి భూములు ఎప్పుడూ నీటి మునకలో ఉంటాయని అన్నారు. రెండవ విడతలో దాదాపు 110ఎకరాల సారవంతమైన భూమి మునకకు గుర్రవుతున్నది అని ఈ భూములు రెండు పంటలు పండేవిగా అందులో వ్యవసాయ బావులు,బోర్లు వ్యవసాయయోగ్యంగా ఉన్నాయని ఇట్టి భూములకు కూడా ఎకరాకు 12లక్షల 40వేలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుందని దీన్ని రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ రాస్తారోకో లో సర్పంచ్.శేఖర్ గౌడ్,ఉప సర్పంచ్ శివాజీ,కావలి.కృష్ణయ్య,శేఖర్,నాగేంద్రం,లక్ష్మయ్య,పెద్ద వెంకటేష్ మాజీ ప్రజాప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.
