VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 53 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆరు దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి గారిని కలిసిన ఎమ్మెల్యే వనపర్తి కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు ని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చాంబర్లో సోమవారం మంత్రి శ్రీహరి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Read More »

ఇందిరా మహిళా శక్తితో మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదగాలి వనపర్తి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి, ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం రేవంత్ ఆశయమని మహిళలు దిశగా ముందుకెళ్లాలని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొత్తకోట మండలం విలియం కొండ గ్రామ శివారులోని ఫంక్షన్ హాల్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో కొత్తకోట మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అదేవిధంగా ఇద్దరు లబ్ధిదారులకు షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి, ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం రేవంత్ ఆశయమని మహిళలు దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలని కోటీశ్వరుని చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను, బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాల సభ్యురాళ్లకు ప్రమాద బీమా, 200 యూనిట్ల ఉచిత కరెంటు సహా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో పాఠశాలల్లో విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేయనుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నేడు మీరాశి పల్లి గ్రామ శివారులో మహిళా సంఘాల ద్వారా ఎకరా స్థలంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో పెట్రోల్ బంకు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కొత్తకోట మదనాపూర్ మండలం మహిళా సమాఖ్యల ద్వారా రెండు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి నడపడం జరుగుతుందని వాటికి ఈ రోజే ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో కొత్తకోట మదనాపూర్ మండలాల సమాఖ్యల ద్వారా రెండు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో నడపడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాకుండా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు అనేక ఉపాధి వ్యాపార అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు. ఏదైనా వ్యాపారంపై ఆసక్తి కలిగిన మహిళలు ఉంటే వారు ముందుకు వస్తే ప్రభుత్వం శిక్షణ ఇప్పించి వ్యాపారం పెట్టించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సునీత పల్లవి, డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అధికారులదే బాధ్యత.. తరుగు లేకుండా తడిసిన ప్రతి గింజ కొనేదాకా పోరాటం : సిపిఐ వనపర్తి వనపర్తి జిల్లా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడిచేందుకు అధికారులే బాధ్యులని, తడిసిన ప్రతి గింజ కొనేదాకా రైతుల పక్షాన పోరాడుతామని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ హెచ్చరించారు. ఆదివారం వనపర్తి మండలం చిట్యాల మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. మాట్లాడుతూ.. మార్కెట్లో 35 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి లారీలు రాక నిల్వ ఉంచారన్నారు. సుమారు 6000 బస్తాల ధాన్యం ఇంకా తూకం వేయాల్సి ఉందన్నారు. రాత్రి వర్షానికి వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు తడిసాయని, కాంటావెయ్యని సుమారు 6000 బస్తాల ధాన్యం రాశుల కిందకు నీళ్లు వచ్చి తడిసి పాడయ్యారు. 15 రోజుల క్రితమే 35,000 బస్తాలను తూకం వేసినా తరలించడంలో అధికారుల జాప్యం వల్లే రాత్రి వానకు వడ్లు తడిచాయని అందుకు పూర్తిగా అధికారులే బాధ్యులన్నారు. తడిసిన ధాన్యం ప్రతి గింజ తరుగు లేకుండా కొనాల్సిందేనని, తరలింపులో అధికారుల రైతులకు నష్టం చేస్తామంటే సహించేది లేదన్నారు. మార్కెట్ యార్డు మైదానం పలుచోట్ల పల్లంగా ఉందని వర్షం వచ్చిన ప్రతిసారి నీరు నిలుస్తుంది అన్నారు. పల్లంలో ఉన్న సంచులే అధికంగా రాత్రి వర్షానికి తడి సాయి అన్నారు. మార్కెట్ యార్డ్ మైదానం సమాంతరం చేయాలని గత సంవత్సరం కూడా కోరామని అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. చిట్యాల మార్కెట్ యార్డులో ఒకే చోట ఐదు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని వీటిని పిఎసిఎస్ ఐకెపి మెప్మా నిర్వహిస్తున్నాయన్నారు. కేంద్రాలకు స్థలాలు వేరువేరుగా లేకపోవడంతో ఒకేచోట రైతులు ఒకే చోట ధాన్యం పోస్తున్నారని, ధాన్యం కొనమంటే ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకుంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల సీనియార్టీ పాటించాలన్నారు.మార్కెట్కు ధాన్యంతెచ్చిన రైతుల సీనియార్టీ జాబితాను సిద్ధం చేసి, సీనియార్టీ ప్రకారం ధాన్యం కాంటా వేయాలనిడిమాండ్ చేశారు. హమాలీలు నిర్వాహకులు తమకు ఇష్టమైన వారి ధాన్యం ఆలస్యంగా తెచ్చిన ముందుగా కాంటా వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. హమాలీల కొరత కూడా ఉండటం కూడా కారణమన్నారు ‌ చీమనగుంటపల్లి తాండ రైతుల ధాన్యం ఈనెల మూడవ తేదీన 14% తేమ వచ్చిన ఇంతవరకు కాంటావెయ్యలేదని. వారం రోజు తెచ్చిన వారి ధాన్యం కాంటా వేశారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు అన్నారు. మార్కెట్ యార్డులో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి లేదన్నారు. మరుగుదొడ్లున్న నీళ్లు లేక దుర్వాసన కొడుతున్నాయని మహిళలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే బాగు చేయాలన్నారు. రైతుల సమస్యలు తీరేవరకు సిపిఐ పోరాడుతుందన్నారు. సిపిఐ నాయకులు శేఖర్, వంశీ రైతులు పాల్గొన్నారు.

Read More »

సురవరం జయంతిని విజయవంతం చేయండి పెబ్బేరు ఈ నెల 28న వనపర్తిలో “సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతిని విజయవంతం చేయాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పెబ్బేరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాహితీవేత్తగా,పత్రికా సంపాదకుడిగా,న్యాయవాదిగా,ప్రజా నాయకుడిగా తెలంగాణ ప్రాంతానికి ప్రతాపరెడ్డి విషయమైన సేవలందించారని అన్నారు.వనపర్తి నియోజకవర్గ మొట్ట మొదటి శాసన సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని శంకర్ గౌడ్ గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వక్తలుగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రావుల చంద్రశేఖర్ రెడ్డి,ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు,శ్రీధర్ రావు దేశ్పాండే, వి.ప్రకాష్,డా.జయంతి,డా.తంగెళ్ల శ్రీదేవి రెడ్డి,డా.కి.వీరయ్య తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఎల్.ఉమా మహేశ్వర్,రామచందర్ జీ,మొయినుద్దీన్,ఈశ్వర్ రెడ్డి,బత్తుల మురళీధర్ గౌడ్,విజయ్,చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కి ఆదివారం మర్రికుంట లోని ఆయన సమాధి దగ్గర అఖిలపక్ష ఐక్యవేదిక, టిడిపి, డీ.ఎస్.పి, బి.ఎస్.పి, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ , ప్రజా సంఘాల నాయకులుచే ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు డా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గాన్ని నీతివంతంగా అభివృద్ధి చేసిన నాయకుడు జయరాములు ని వనపర్తికి పాలకేంద్రం, కోర్టు, బస్టాండు సాధించిన వ్యక్తి జయరాములు గారిని, వనపర్తికి డిగ్రీ కళాశాల స్థాపించి విద్యాపర్తి చేసిన వ్యక్తిగా రికార్డ్ సాధించాడని కొనియాడారు. ముఖ్య అతిథులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రాష్ట్ర కార్యదర్శి రాము యాదవ్, డీఎస్పీ అధ్యక్షుడు రామకృష్ణ మహారాజ్, టిడిపి నాయకులు ఆవుల శీను, చిన్నయ్యా యాదవ్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్, కిరణ్ కుమార్, బీఎస్పీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మైబూస్, గంధం నాగరాజు, దేవన్న నాయుడు తదితరులు జయ రాములు గారి గురించి మాట్లాడిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో జయ రాములు గారి కుటుంబ సభ్యులు, వనపర్తి నియోజకవర్గం బీసీ నాయకులు చీర్ల చందర్, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, కాంగ్రెస్ నాయకులు బొంబాయి బాలకొండయ్య, సమద్, వెంకటేశ్వర్లు, టిడిపి పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య, యాదవ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి గురు రాజ్ యాదవ్, విజేత రాములు, గంధం బాలరాజు, p.et మురళి , శివకుమార్, నాగరాజు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More »

సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం వనపర్తి వనపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి 130 జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా,వైభవంగా నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జయంతి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సురవరం గారి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం అని అదొక చరిత్ర అని భావితరాలు ఆ తెలంగాణ వైతాళికుడు బహుముఖ ప్రజ్ఞా శాలి జీవిత విశేషాలు తెలుసుకోవలసిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. విద్యావేత్తలు,సాహితీవేత్తలు,మేధావులు,ప్రజా సంఘాలు,వివిధ పార్టీల శ్రేణులు,కవులు,కళాకారులు,సామాజిక విశ్లేషకులు ప్రత్యేకంగా పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో డాక్టర్.వీరయ్య,శంకర్ గౌడ్,తిరుమలేశ్,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More »

యువత ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి వనపర్తి కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా మే 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వనపర్తి జిల్లా నుంచి జాబ్ మేళాలో వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన 17 మందికి ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతకు కలెక్టర్, ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా, యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫుట్‌బాల్, వాలీబాల్, హాకీ తదితర క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి క్రీడలు ఎంతో అవసరమని, ఫిట్‌నెస్‌ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖ కు సంబంధించిన బ్రాండింగ్ కిట్లను కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారూ

Read More »

నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డితో కలిసి శనివారం వనపర్తి పట్టణంలోని శ్రీనివాసపూర్‌లో రూ.7.50 కోట్ల (రూ.5 కోట్లు ఇప్పటికే మంజూరు కాగా, అదనంగా మరో రూ. 2.50 కోట్ల) వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ భవన నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ మ్యాప్‌ను పరిశీలించి, జరుగుతున్న నిర్మాణ పనులను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భవనం వద్ద నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్మించాలని, అలాగే కాంపౌండ్ వాల్ మరియు ఎలివేషన్ పనులను ఆకర్షనీయంగా, నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. భవన నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న వారికి ఇంటి స్థలాలు అందజేస్తామని ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి హామీ ఇచ్చారు. భవన నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఈ ఈ విజయ్ మోహన్, డి ఈ లక్ష్మి నారాయణ, ఏ ఈ భాస్కర్, తహసీల్దార్ రమేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ వనపర్తి ఉమ్మడి గోపాల్ పేట రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన వరి,మక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దాదాపు 4గంటల పాటు ఎర్రటి ఎండలో ధాన్యం రోడ్డుపై పారబోసి ధర్నాకి దిగారు. ధాన్యాన్ని తరుగు లేకుండా తడిసిన ధాన్యాని కూడా ప్రతి గింజతో సహా కొనుగోలు చేయాలని డిమాండ్ రైతులకు సంఘీభావం తెలిపిన జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ రైతులు ఉసురు పోసుకున్న రేవంత్ ప్రభుత్వం ఆగం కాక తప్పదు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కన్నీటితో తమ పంట తగలబెట్టుకుంటే ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సహించరానిది అని దుయ్యబట్టారు.జిల్లా కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా ధర్నా విరమించమని రైతులు పట్టు బట్టారు. రైతుల ధర్నాకు అశోక్ చివరిదాకా ఉండి సంఘీభాం తెలిపారు. ఈ కార్యక్రమములో రమేష్ మాజీ సర్పంచ్,చంద్రశేఖర్,మన్నే నాయక్,రాజేష్,నరసింహ,తదితరులు ఉన్నారు.

Read More »

Scroll to Top