ఆర్యవైశ్యుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
వనపర్తి
వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహాసభ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు సమాజ అభివృద్ధిలో, వ్యాపార రంగంలో, సేవా కార్యక్రమాల్లో విశిష్ట పాత్ర పోషిస్తున్నారన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య సమాజాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తోందని, వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్యవైశ్య మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తోందని పేర్కొంటూ, వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఆర్యవైశ్య ఆడబిడ్డ శ్రీమతి మాధవి రమేష్ గారికి అవకాశం కల్పించడం ఒక నిదర్శనమని అన్నారు. ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యుల వ్యాపారాభివృద్ధి, స్వయం ఉపాధి, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వనపర్తిలో వ్యాపారం చేసుకుంటున్నా ఆర్యవైశ్యులందరూ ప్రశాంతంగా వారి వారి పనులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, వడ్డీ లేని రుణాలు, రైతు సంక్షేమ పథకాలు, అర్హులకు కొత్త రేషన్ కార్డులు వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఆర్యవైశ్యుల ఐక్యత సమాజానికి ఆదర్శమని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ రాష్ట్ర ఆర్యవైశ్య నేతలు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు కలకొండ రమేష్ చంద్ర కొండ్ల మల్లికార్జున్ మల్లిపెద్ది శంకర్ ఆర్ గణేష్ గుప్తా మహిళ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సామ్రాజ్యలక్ష్మి జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనపర్తి మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాధవి వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ పాలాది శ్రీనివాసులు నాగ బంద్ యాదగిరి ఇటికూరి వీరయ్య జర్నలిస్ట్ నాగబంది వెంకటరమణ పూరి సురేష్ పెబ్బేరు రమేష్ గుప్తా ఇటుకూరి బుచ్చయ్య పట్టణ అధ్యక్షులు బచ్చురాం జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు భీమ ప్రసన్నలక్ష్మి ఉపాధ్యక్షురాలు పిన్న వసంత నరేందర్ వై వెంకటేష్ చిదిరి రాజు ఆలుగడ్డ శ్రీనివాసులు కలకొండ శ్రీనివాసులు మారం గోవిందు గుప్తా ఆకుతోట రాఘవేందర్ వనపర్తి జిల్లాలోని చిన్నంబాయి పెబ్బేరు కొత్తకోట ఆత్మకూర్ పెద్దమందడి మండలాలకు చెందిన ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
