VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

Uncategorized

రైతును కంటికి రెప్పలా కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతు కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల 40 వేల 286 మంది రైతులకు రూ.8,759.60 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయడం రైతుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వనపర్తి జిల్లాలో 1,83,011 మంది రైతులకు రూ.212.57 కోట్ల రైతు భరోసా నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. అలాగే వనపర్తి నియోజకవర్గంలోని 92,115 మంది రైతులకు కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.99.04 కోట్లను జమ చేయడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. రైతు సంక్షేమాన్ని మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు భరోసాతో పాటు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలతో రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అనేక వ్యవసాయ రాయితీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. వరి, వేరుశనగ, కంది, ఆముదం వంటి పంటల విత్తనాలపై, ఎరువులపై, ట్రాక్టర్లు, రోటావేటర్లు, కల్టివేటర్లు, గొర్రులు, స్ప్రేయర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై అందే సబ్సిడీలను రద్దు చేసి ఒక్కో రైతుకు లభించాల్సిన రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ప్రభుత్వ సహాయాన్ని దూరం చేసిందన్నారు. నేడు అదే రైతు సంక్షేమాన్ని తిరిగి గాడిలో పెట్టి రైతుకు ప్రతి దశలో అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు.రైతు నవ్వితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రైతు సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ విజయానికి అసలైన కొలమానం. రైతు భరోసా నిధుల విడుదల అందుకు ప్రత్యక్ష నిదర్శనం. రైతును కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి ఎకరానికి, ప్రతి రైతు కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తుంది” అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

Read More »

ఎస్‌ఐఆర్‌ ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజేషన్ ప్రక్రియవేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు పట్టణంలోని కేడీఆర్ నగర్, చందాపూర్ గ్రామాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి బీఎల్‌వోలు, సూపర్వైజర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి బీఎల్‌వో రోజుకు కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వాలంటీర్ల సహాయాన్ని తీసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలు నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందజేయాలని విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ఫారాలను సమర్పించని పక్షంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోయే అవకాశం ఉందని ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌ హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన కలెక్టర్, 2002 ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాలను గుర్తించడంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. అనంతరం కేడీఆర్ నగర్‌లో తనిఖీ నిర్వహించిన కలెక్టర్, కొంతమంది బీఎల్‌వోలు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేసి, సకాలంలో వాటిని సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కఠినంగా హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Read More »

యుద్ధాలు, అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టుల లక్ష్యం: చాడ వెంకట్ రెడ్డి వనపర్తి అంతరాలు లేని సమ సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని అందుకు సమాజాన్ని చైతన్యం చేసి పోరాడాలని సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి లో శుక్రవారం సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల (జూలై 10, 11, 12) శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకటరెడ్డి తరగతులను ప్రారంభించారు. నాగర్ కర్నూల్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ అధ్యక్షతన జరిగిన శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ప్రపంచంలో యుద్ధ వాతావరణం రాజ్యమేలుతుందన్నారు. అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలు నరమేధానికి ఉసిగొలిపాయని యుద్ధం ఎప్పుడు హింస, అశాంతినే మిగిల్చుతుందన్నారు. స్వాతంత్ర్య అనంతరం భారతదేశం అలీన విధానంతో ముందుకు సాగిందని అందుకు భిన్నంగా నరేంద్ర మోదీ యుద్ధం పట్ల వ్యవహరించిన తీరు ప్రపంచంలో భారత పరువును తీసిందన్నారు. బిజెపిరామ మందిరం పేరుతో అధికారంలోకి వచ్చి, అదే రామ మందిరంలో దొంగలు పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ప్రధాని నేటికి పెదవి ఇవ్వకపోవడం దారుణమని, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాముని పేరుతో అధికారం చేతికించుకొని మత రాజకీయాలు నడుపుతూ ప్రజల సమస్యలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని బిజెపి తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయని ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి నెరవేర్చటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తీవ్ర రాజకీయ జోక్యం పెరిగిందని అర్హులైన వారికి ఇండ్లు రావడం లేదని, వారికి ఇవ్వాలన్నారు. ‌ భూదాన భూముల్లో పేదలు ఎర్రజెండాలు పాతి ఇండ్లు నిర్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి పేదలను రోడ్డు పాలు చేశారన్నారు. మహిళలకు 2500 ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం నిరుద్యోగుల కల నెరవేరలేదని, ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి పై ఉందని పాలమూరు రంగారెడ్డి కే ఎల్ ఐ బీమా జూరాల పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. హామీల అమలు, ప్రాజెక్టుల పూర్తికి ప్రజా ఉద్యమాలు నిర్మించి సిపిఐ ముందుండి పోరాడుతుందని ప్రజలు కలిసి రావాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి బాలకిషన్, గద్వాల జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, రాస సమితి సభ్యుడు కేశవులు గౌడ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా నేతలు కళావతమ్మ టీ నరసింహ శ్రీరామ్ మోష గోపాలకృష్ణ సురేష్ ఇందిర కృష్ణవేణి గీత ఈర్ల చంద్రమౌళి మల్లేష్ కృష్ణ రాబర్ట్ అబ్రహం రంగన్న కిష్టన్న నాగార్జున శంకర్ గౌడ్ కుతుబ్ శ్రీనివాస్ ప్రేమ్ కుమార్ బండి లక్ష్మీపతి బిజ్జ శ్రీను వంక గోపాల్ డంగుకురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం వనపర్తి గత 30 నెలల కాలంలో వనపర్తి నియోజకవర్గంలో రూ.2,147 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 17వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్), కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తాను ప్రజల పెద్ద జీతగాడిలా పనిచేస్తున్నానని, గ్రామాలు–పట్టణాల సమగ్రాభివృద్ధితో పాటు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు, పేద కుటుంబాల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్య సేవల బలోపేతం, మహిళా సంఘాలకు చేయూత, ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, సొంత చెల్లి ఫోన్ టాపింగ్ చేయడం లాంటి చర్యలు అత్యంత సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, భూకబ్జాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోవడంతో ప్రజలే ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఇంటికి పంపించారని పేర్కొన్నారు.దేశం కోసం, రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ కాంగ్రెస్ పాత్ర చిరస్మరణీయమని చెప్పారు.. వనపర్తిలో గతంలో నియంతృత్వ ధోరణితో పాలన సాగిందని, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు సైతం సులభంగా కలిసే అవకాశం లేకుండా వ్యవహరించారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులనే ప్రజలు ఆదరిస్తారని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం తెలంగాణను భారీ అప్పులపాలు చేసిందని ఆరోపించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపిస్తోందన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి మహనీయులను గౌరవించడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని పేర్కొన్నారు.అలాగే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసే విమర్శలకు ముందు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఆధారరహిత వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు వారికి లేదన్నారు ఇప్పటివరకు 7,371 మంది లబ్ధిదారులకు రూ.18,05,65,900 మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో గతంలో 7,088 మందికి రూ.17,01,11,800 అందగా, తాజాగా 283 మందికి రూ.1,04,54,100 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్: పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొంటూ, ఇప్పటివరకు 5,385 మంది లబ్ధిదారులకు రూ.53,91,24,660 మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో 5,038 మందికి రూ.50,43,84,408 అందగా, తాజాగా 347 మందికి రూ.3,47,40,252 చెక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. అభివృద్ధి–సంక్షేమం రెండింటినీ సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తూ వనపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు యువకులు, మహిళలు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు మాజీ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు సర్పంచులు మాజీ మాజీ సర్పంచ్లు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More »

వార్షిక తనిఖీల్లో భాగంగా వనపర్తి సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వనపర్తి పోలీసు కార్యాలయాల పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది. రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, నాణ్యత ఉంటేనే పోలీసు శాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రతి కేసును వేగవంతంగా, చట్టబద్ధంగా పూర్తి చేస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి సర్కిల్ కార్యాలయాన్ని ” వార్షిక తనిఖీలలో ” భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి,ఐపీఎస్ సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ గారికి వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి సీఐ, సుగంధ రత్నం గార్లు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం డైజెస్టర్ రికార్డు , ప్రభుత్వ ప్రాపర్టీ రిజిస్టర్, విలేజ్ రోస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను UI, పీట్, గ్రేవ్ కేసుల పైలను క్షుణ్ణంగా పరిశీలించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి,లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను వనపర్తి సీఐ, సుగంధ రత్నం ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. సర్కిల్ కార్యాలయాల పనితీరు జిల్లా పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రతి రికార్డును నిబంధనలకు అనుగుణంగా నవీకరిస్తూ, కేసుల దర్యాప్తును నాణ్యతతో, నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, డిజిటల్ నమోదులు, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ “త్వరిత సేవలు పారదర్శక పోలీసింగ్ ప్రజల విశ్వాసమే మన విజయానికి కొలమానం అనే లక్ష్యంతో ప్రతి అధికారి విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి సీఐ, సుగంధ రత్నం, డిసిఆర్భి ఎస్సై, శివకుమార్, వనపర్తి సర్కిల్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read More »

జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో వనపర్తి పోలీసుల విజయపతాకం : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి వనపర్తి జూలై 6 నుంచి 8 వరకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్న జోగులాంబ జోన్–7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ డ్యూటీ మీట్‌లో శాస్త్రీయ దర్యాప్తు, ఫింగర్ ప్రింట్స్, సహాయక శాస్త్రీయ పద్ధతులు, యాంటీ సబోటేజ్ చెక్,ఫోరెన్సిక్ సైన్స్,ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, ప్యాకింగ్, హ్యాండ్లింగ్,బాంబ్ డిస్పోజల్, కంప్యూటర్ అవేర్‌నెస్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో వనపర్తి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అసాధారణ ప్రతిభ కనబర్చి మొత్తం 11 పతకాలు (5 బంగారు, 5 రజత, 1 కాంస్య) సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ విజయంతో పలువురు అధికారులు, సిబ్బంది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి విజేతలను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ డ్యూటీ మీట్‌లు పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలను మరింత పదును పెట్టే అత్యంత కీలకమైన వేదికలు అని అన్నారు. శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, నేరాల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, కంప్యూటర్ ఆధారిత పోలీసింగ్ వంటి అంశాల్లో సిబ్బందికి ప్రాయోగిక అనుభవాన్ని ఈ పోటీలు అందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే నైపుణ్యం, క్లిష్ట పరిస్థితులను వేగంగా విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ పోటీలు పోలీసు సిబ్బందిని తీర్చిదిద్దుతాయని అన్నారు. అలాగే, రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీసు సిబ్బందితో అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తమ విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని, ఆధునిక పోలీసింగ్‌లో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతుందని ఎస్పీ వివరించారు. జోన్ స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితో కఠినంగా సాధన చేసి రాష్ట్ర స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి వనపర్తి జిల్లా పోలీసులకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, షీ టీం, భరోస,ఎస్సై, అంజద్, జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం త్వరలో ఆధునిక గోదాముల నిర్మాణం చేపడతాం వనపర్తి రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా, మార్కెటింగ్ వ్యవస్థను గ్రామీణ స్థాయికి మరింత చేరువ చేసే లక్ష్యంతో వనపర్తి నియోజకవర్గానికి రెండు నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఖిల్లా ఘణపురం–పెద్దమందడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేసి, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు మార్కెటింగ్ సౌకర్యాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖిల్లా ఘణపురం–పెద్దమందడి మండలాల రైతులకు ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేసిందన్నారు. గోపాలపేట, ఏదుల, రేవల్లి మండలాలకు మరో మార్కెట్ యార్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ రెండు మార్కెట్ యార్డుల ద్వారా వేలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారని, పంటలను దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం తగ్గి రవాణా ఖర్చు, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను పారదర్శకంగా విక్రయించుకునే అవకాశం కల్పించడంతో పాటు, మధ్యవర్తుల దోపిడీ తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మార్కెట్ యార్డుల్లో ఆధునిక గోదాములు, షెడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, అంతర్గత రహదారులు, తూకం యంత్రాలు, రైతుల విశ్రాంతి గదులు వంటి అన్ని మౌలిక సదుపాయాలను దశలవారీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యంగా రైతులు పంటను వెంటనే అమ్మాల్సిన పరిస్థితి లేకుండా నిల్వ ఉంచుకునేందుకు అత్యాధునిక గోదాములను త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర లభించే వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నూతన పాలకవర్గం రైతులు, వ్యాపారులు, అధికారులు మధ్య సమన్వయం సాధిస్తూ పారదర్శకంగా పనిచేసి రైతుల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఖిల్లా ఘణపురం–పెద్దమందడి వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గం చేత మార్కెట్ యార్డ్ జిల్లా అధికారిని పుష్పలత ప్రమాణస్వీకారం చేయించింది అధ్యక్షురాలిగా క్యామ నవనీత (ఖిల్లా ఘణపురం)ఉపాధ్యక్షుడిగా: కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డి (దొడగుంటపల్లి) డైరెక్టర్లుగా: దిండు రవీందర్ (వెల్టూర్), డి. బాలరాజు (జంగమయ్యపల్లి), ముప్పూరి రత్నయ్య (మణిగిల్ల), తలకొండపల్లి రఘునాథ్ (పెద్దమందడి), బయన్న రామచంద్రయ్య (మానాజీపేట), పాత్లావత్ భాష (దొంతికుంట తాండా), ఎస్. రవీందర్ రెడ్డి (సోలిపూర్), మర్యాద బాలకృష్ణ రెడ్డి (కంబాలపురం), బత్తుల దుర్గయ్య (సల్కేలాపురం), ఎం.డి. ఖాజా నైముద్దీన్ (ఘణపూర్), తూడి రవీంద్రనాథ్ రెడ్డి, తూము రామకృష్ణారెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు పాలకవర్గానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు పార్టీ శ్రేణులు రైతులు యువకులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More »

SIR కార్యక్రమంలో భాగంగా గణన ఫారాల పంపిణీ లో పార్టీ bla-2 లు పాల్గొనాలి పెబ్బేరు పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో ,SIR లో భాగంగా పెబ్బేరు మున్సిపల్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం లో బిఎల్ఏ లను సమాయత్తం చేయాలని ..ఓటర్ల కు సంబంధించిన గణన ఫారాల పంపిణీ మరియు ఫారాల ను మన BLA తో నింపించాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండి ఇంతియాజ్పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. బి ఎల్ ఏ -2 లా ద్వారా ఓటర్ల యొక్క పారాలను దగ్గరుండి తప్పులు లేకుండా,, ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటీ శ్రీదర్ పెబ్బేర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు వీ ధిలీ కుమార్ రెడ్డి,, మండల పార్టీ అధ్యక్షుడు వనం రాములు యాదవ్,, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి , కౌన్సిలర్స్ హరి శంకర్ నాయుడు,, మన్యం,, ఎద్దుల సాయినాథ్,, చిన్న ఎల్లారెడ్డి,, శ్రీరంగాపురం సింగిల్విండో అధ్యక్షులు జగన్నాథం నాయుడు,, గోవిందు,,వడ్డ రమేష్,, దారంగుల శ్రీను,, సంబు రము,, మధు,, వేణు,, మోహన్,,శ్రీనివాస్ రెడ్డి,, గోవర్ధన్ రెడ్డి,, సురేష్,, వసంత్,, భారతి,, రాములు,, శేఖరా చారి,, అఖిల్,, పవన్,, నిఖిల్,,కురుమూర్తి,, రమేష్ కరన్ తదితరులు పాల్గొన్నారు

Read More »

ఉన్ని సహకార సంఘం లో నూతన కమిటి ఏర్పాటు వనపర్తి పెబ్బేరు మండలం శాఖాపూర్ y గ్రామంలో గల ఉన్ని సహకార సంఘం లో నూతన కమిటి ఏర్పాటు కావడం జరిగింది డైరెక్టర్ లు గా 9 మెంబెర్స్ ఎన్నికోవడం జరిగింది 1 ఆగిరి శివ, 2 జాడిల తిరుపతయ్య, 3 కాంతుల చంద్రశేఖర్ ,4 కోతుల కిషోర్ ,5 కోరి శివరాముడు , 6 మంగ చిన్నకురుమన్న ,7 మొగిలి రఘు,8 కంకలి నాగమ్మ ,9 కంకలి నాగలక్ష్మి(మమత) ఎన్నికయ్యారు అందులోనుంచి అధ్యక్షులు గా మొగిలి రఘు ఉపాఅధ్యక్షులు గా జాడిల తిరుపతయ్య గారు కార్యదర్శి గా ఆగిరి శివ గారు కోశాధికారి గా కోతుల కిషోర్ ని ఎన్నుకోవడం జరిగింది

Read More »

అర్హులైన ప్రతి నిరుపేదకు విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం వనపర్తి పేదవాడికి అండగా ఉంటారని, పేదల అభ్యున్నతికి అంకిత భావంతో పాటు పడతారని రాష్ట్ర ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని బలపరిచిందని, ప్రజల నమ్మకాన్ని తల తాకట్టు పెట్టీ అయిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, తద్వారా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటించి సహచర మంత్రులు రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గుడిసెల్లో నివసించే పేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత గృహం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూ, రాష్ట్రంలో గృహరహితులు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. వనపర్తి నియోజకవర్గానికి మరో రెండు వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మంత్రికి కోరారు. అనంతరం మంత్రులు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

Scroll to Top