VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో పట్టణంలో “సర్”(ఓటర్ జాబితా సవరణ)జరుగుతున్న విధానాన్ని ముఖ్య నాయకులు,బి.ఆర్.ఎస్ పార్టీ బి.ఎల్. ఏలతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణములో మరింత చురుకుగా పనిచేసి మందకొడిగా సాగుతున్న ఓటర్ జాబితా నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బి.ఎల్. ఏలు “సర్”ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ అధికారులు చెబుతున్నారు అని రాష్ట్రంలో నిజమైన ప్రజాసంక్షేమ పాలన రావాలంటే నీతిమాలిన రాజకీయాలు పోయి నిజమైన ఓటర్లు గుర్తింపు పొందాలని అందుకే నాయకులు,కార్యకర్తలు,బి.ఎల్. ఏలు నిత్యం శ్రమించి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని ఓటర్ నమోదుతో పాటు వారి సమస్యలు కూడా గుర్తించి పరిష్కారదిశగా కృషి చేస్తూ నిత్యం ప్రజలలో ఉండాలని పిలుపునిచ్చారు. పట్టణ నాయకులు ఈ పదిరోజులు బూతులవారిగా తిరగడంవల్ల అవగాహనతో పాటు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ఈ సమీక్షలో పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,గట్టు యాదవ్,బి.లక్ష్మయ్య, వాకిటి.శ్రీధర్,కురుమూర్తి యాదవ్, కౌన్సిలర్స్ ఉన్నారు.

whatsapp image 2026 07 14 at 5.35.18 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top