నిర్లక్ష్యం వీడి “సర్”(ఓటర్ జాబితా సవరణ) వేగవంతం చేయాలి
వనపర్తి
ఓటర్ జాబితా సవరణ ను రాజకీయ పార్టీలు ఒక బాధ్యత స్వీకరించి “సర్”ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అచ్యుతాపురం,రాజానగరం గ్రామాలలో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. వనపర్తి పట్టణములో 63,246ఓటర్లను ఆన్ లైన్ చేయాల్సి ఉండగా కేవలం 57శాతం పూర్తి అయ్యిందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఓటర్ జాబితా సవరణ ఒక సామాజిక భాధ్యతగా తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని బి.ఆర్.ఎస్ శ్రేణులను,జిల్లా,మండల,గ్రామ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ పరుగులు పెట్టించడంతో నియోజకవర్గంలో” సర్”ప్రక్రియ జోరు అందుకుంటుంది. స్వయంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామ, గ్రామాల్లో పర్యటనలు చేయడంతో ప్రజల్లో అవగాహన కలిగి ఓటర్ జాబితా సవరణలో పాల్గొనడం హర్షణీయం. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నాయకులు శ్రమించాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్,కె.మాణిక్యం,విజయ్ కుమార్,ధర్మా నాయక్ ,మాధవ్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి, దేవర్ల.నరసింహ, సుదర్శన్ రెడ్డి,హేమంత్ ముదిరాజ్,శారద ఆశన్న, సర్పంచి బాలయ్య,చిట్యాల.రాము,శంకర్ గౌడ్,క్రాంతి, తదితరులు ఉన్నారు.
