VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి పట్టణంలోని బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాంనగర్ కాలనీలోని కళాశాల విద్యార్థుల గిరిజన సంక్షేమ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటగది, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణ, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు, ఇతర వసతులను పరిశీలించారు. హాస్టల్‌లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని ఆరా తీయగా.. 140 మంది సామర్థ్యానికి గాను ప్రస్తుతం 111 మంది విద్యార్థులు ఉన్నారని వార్డెన్‌ను సమాధానమిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా హాస్టల్‌లో ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని వార్డెన్‌ను ఆదేశించారు. మరుగుదొడ్లు, హాస్టల్ గదులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. హాస్టల్ సమీపంలోని నాలా చెత్త, పూడికతో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు నాలాను శుభ్రం చేయించి డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి సమస్య కూడా లేకుండా చూడాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి హాస్టల్‌లో అందుతున్న వసతులు, భోజన నాణ్యత, తాగునీరు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మధు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ ఉన్నారు.

whatsapp image 2026 07 22 at 11.46.31 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top