వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటా వనపర్తి వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఆడపడుచుకు నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా వారోత్సవాల కార్యక్రమంలో మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికై అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7 2023న ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే మొదటగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మొదటి సంతకం చేసిందన్నారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటివరకు 30.29 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ధర చెల్లించడం జరిగింది అన్నారు. ఆరోగ్య భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు పై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వము విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, అల్పాహారం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 6000 మంది కొత్త టీచర్లకు నియామకం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు జిల్లాలో రూ. 207 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి మంజూరీ చేసినట్లు చెప్పారు. ఐ.టి. టవర్, పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సి.సి రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అందుకే ఏ సంక్షేమ పథకం అయినా మహిళలే ప్రాతినిధ్యం వహించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. త్వరలో వనపర్తి మహిళలకు డీజిల్ బంక్ మంజూరు కాబోతుందని, 546 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, ప్లాట్లు లేని నిరుపేదలకు 1000 ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వానికి తాను ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా అన్ని పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ గృహ ప్రవేశానికి తన స్వంత డబ్బులతో లబ్ధిదారులకు పట్టు బట్టలు పెట్టీ గృహ ప్రవేశం చేయిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మహిళలకు సూపర్ మార్కెట్, రైస్ మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం శాసన సభ్యుల చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు రూ. 3.40 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కును, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో వనపర్తి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ కిమ్యానాయక్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరి రాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు, ఎన్ ఎస్ యు ఐ అనుబంధ సంఘాల నాయకులు, మహిళల యువకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Uncategorized
తెలంగాణ వైతాళికులు,,బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి మొట్టమొదటి ఎం. ఎల్.ఏ సురవరం ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో నిష్ణాతులు,తెలుగు భాష పరిరక్షకుడు, సంఘ సంస్కర్త,సాహితీవేత్త, న్యాయవాది సురవరం.ప్రతాప్ రెడ్డి గారు అని కొనియాడారు. సురవరం గారి జీవిత చరిత్ర సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమములో సాహితీ వేత్తలు,బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా సురవరం జయంతి ఉత్సవాలు వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సురవరం.ప్రతాప్ రెడ్డి 130జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దాచ.సులోచనమ్మ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడ్డాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన గౌరవ నిరంజన్ రెడ్డి సభను ప్రారంభించారు. ముఖ్యతిదులుగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,సాగునీటి రంగనిపుణులు వి.ప్రకాష్, గన్నమరాజు.గిరిజా మనోహర్ బాబు,తంగెళ్ల.శ్రీదేవి రెడ్డి పాల్గొన్నారు. స్వాగత ఉపన్యాసకులు కె.వీరయ్య,సభా పరిచయం పలుస.శంకర్ గౌడ్ చేయగా వ్యాఖ్యాతగా బైరోజు.చంద్రశేఖర్ ఉన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి మేధావి సాహితీవేత్త న్యాయవాది తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అని అన్ని రంగాలలో నిష్ణాతులు వారని కొనియాడారు. సాగునీటి నిపుణులు ప్రకాష్ గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు సవివరంగా వివరించారు. బి.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రాథమిక హక్కులు అంశంపై మాట్లాడుతారు. మనోహర్ బాబు గారు సురవరం.ప్రతాప్ రెడ్డి గారి జీవిత విశేషాలు తెలిపారు. తంగెళ్ల.శ్రీదేవి రెడ్డి మహిళా సాధికారిత అంశంపై మాట్లాడారు. ప్రారంభం నుండి తెలంగాణ సాధించే వరకు జరిగిన పరిణామాలు కె.సి.ఆర్ హయాములో కొనసాగిన సంక్షేమం తదితర అంశాలపై స్వయంగా రాసిన వ్యాసాల కూర్పును పుస్తక రూపములో తెచ్చిన సాహితీవేత్తలు ముఖ్య అతిథుల చేత ఆవిష్కరింప చేశారు.ఈ కార్యక్రమములో సాహితీవేత్తలు,మహిళా రచయితలు,బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మల్లయ్య దేవుడి పండగ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనపర్తి పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో గురువారం ప్రారంభమైన మల్లయ్య దేవుడి పండగల కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మల్లయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో నిర్వహించుకునే ఇలాంటి పండగల ద్వారా గ్రామస్తుల మధ్య ఐక్యత నెలకొంటుందని, ఇలాంటి పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ అరుణ జయపాల్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
పెబ్బేరులో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ వినతి వనపర్తి పెబ్బేరు పట్టణంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మండల అధ్యక్షులు యాపల రాంరెడ్డి గారు గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం వచ్చిన వారికి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సురేందర్ గౌడ్, గంధం రంజిత్ కుమార్ భాను ప్రకాష్ స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
హాక విత్తనాలు ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ కూడలి సమీపంలో 6వ వార్డుకు చెందిన యువకుడు కురుమూర్తి ఏర్పాటు చేసుకున్న హాక విత్తనాలు ఎరువుల దుకాణాన్ని గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి ప్రారంభించారు. వ్యాపార ధోరణిలో అన్నదాతలకు అధిక ధరలకు కాకుండా వారి అవసరానికి తగ్గట్లుగా అన్ని విత్తనాలు ఎరువులు మందులను అందుబాటులో ఉంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని యువకుడు కురుమూర్తికి వారు సూచించారు. యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని వారి పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు
మహిళా రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటాం వనపర్తి మహిళా రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటాంఅని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పెబ్బేర్ మండలంలో గుమ్మడం,పాత సుగూరు,రంగాపురం,పెబ్బేరు గ్రామాలలో పర్యటించి తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాలములో యూరియా లేక,కరెంట్ సరఫరా లేక,రైతు భరోసా లేకున్నా ఓర్చుకొని ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కొనుగోలు లేక పడిగాపులు కాస్తూ రైతులు విలవిలాడుతున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.అష్టకష్టాలు పడి ధాన్యం తరలిస్తే క్వింటాలుకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను జలగల లాగ పీడిస్తున్నారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి వారంలోపల రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పక్షాన పోరాడుతాము నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.నిరంజన్ రెడ్డి గారి వెంట వనం.రాములు,కర్రీస్వామి,దిలీప్ రెడ్డి,అఖిల్ చారి, పెద్దింటి.వెంకటేష్,జగన్నాథం నాయుడు,ఎం.రాజశేఖర్,కృష్ణా రెడ్డి,ఎద్దుల సాయి కుమార్,ఎల్లారెడ్డి,గోవిందు నాయుడు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
సవాయిగూడెంలో రూ. 4 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు వనపర్తి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో రూ. 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వనపర్తి జిల్లాలో మొదటగా వనపర్తి మండలంలోని సవాయిగూడెం మరియు ఆత్మకూరు మండలాలకు ఈ సోలార్ ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని వడ్డీ లేని రుణాలను, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను, అమ్మ ఆదర్శ పాఠశాలకు చైర్మన్గా, డీజిల్ బంకులకు ఓనర్లుగా, పాఠశాల విద్యార్థులకు బట్టలు కుట్టి వారిగా, పాఠశాలలో వంటలు చేసేవారిగా, క్యాంటీన్ నడిపేవారీగా, మహిళల పేరుపై రైసుమిల్ల ఏర్పాటు, గోదాంల నిర్మాణం, ఇలాంటి అనేక కార్యక్రమాలను చేపట్టి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రెండేళ్ల కాలంలో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త హామీలను కూడా అమలు చేశామని మిగతా హామీలు కూడా వెంటనే నెరవేరుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదేళ్లు పాలనలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సొంత బిడ్డను ఇంటిలో నుంచి తరిమేసే పరిస్థితి ఉందని అలాంటివారు రాష్ట్ర లోని మహిళలు అభివృద్ధిని ఎందుకు కోరుకుంటారు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎన్నో చేస్తుందని రానున్న కాలంలోనూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ దీవించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, డిఆర్డిఓ ఉమాదేవి, మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, గ్రామాల సర్పంచులు మహిళా సంఘం సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తడిసి, మోలికెత్తిన ధాన్యాన్ని చూసి చలించిపోయిన మాజీ మంత్రి వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తూ పెద్దమందడి,ఘనపూర్ మండలాల్లో పలు గ్రామాలలో ఐ.కె.పి సెంటర్స్,సింగిల్ విండో సెంటర్స్,మిగతా కొనుగోలు కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతులు పడుతున్న హరిగోస చూసి చలించిపోయిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులను ఓదార్చి దైర్యం చెప్పారు. రాష్టములో 5లక్షల 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ప్రభుత్వం 90లక్షల ధాన్యం సేకరణ చేస్తున్నామని చెప్పి అందులో కూడా 40శాతం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల నిర్లక్ష్యం వైఫల్యం వల్ల రైతులు ధాన్యాన్ని అమ్మడానికి నెలలు నెలలుగా పడిగాపులు పడుతున్నారని రైతుల దీనస్థితి చూస్తే కడుపు తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి రైతుల సాధకబాధకలను తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలెక్టర్ కి ఫోన్ లో మాట్లాడుతూ రైతుల అగచాట్లు హరిగోస వర్ణనాతీతం అని వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వేదికలను ఉపయోగించుకొని అందులో ధాన్యాన్ని నిలువచేసే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లారీలు, ట్రక్కులు లేని వారికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఇచ్చారు అని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి వెంట జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల.కృష్ణయ్య,మన్నే గౌడ్,పులిందర్, పీన్య నాయక్,ప్రతాప్,శివ,లక్మన్,మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
తాటిపాముల హరిజన చిన్న కూర్మన్న కుటుంబంకి శుభాకాంక్షలు వనపర్తి అరవై ఏళ్ల కుర్మన్న జీవన ప్రయాణం వారి భాంధువులకు, కుతురులకు ఆదర్శం, స్ఫూర్తి కష్టసుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంగా నిలిచిన చిన్న కుర్మన్న దంపతులకు అభినందనలు శంకర్ గౌడ్ తెలిపారు. కుటుంబం కోసం పంచిన ప్రేమ, చూపిన ఆప్యాయత వెలకట్టలేనివి.ముగ్గురు కుతురుల కోసం కుటుంబం కోసం పడిన శ్రమ, చేసిన త్యాగం మరువలేనిది.మీ మాటల్లోని నిజాయితీ, చేతల్లోని నిబద్ధత ఎంధరికో పాఠాలు.పిల్లలను తీర్చిదిద్ది, ఉన్నత శిఖరాలకు చేర్చిన మీకు అభినందనలు. ఇప్పుడు మనవళ్లతో, మనవరాళ్లతో ఆడుతూ పాడుతూ ఆనందించే సమయం. ఆయురారోగ్యాలతో, మనశ్శాంతితో మీ దినదినం గడవాలి. బంధుమిత్రుల మధ్య, ఆత్మీయుల నడుమ మీ జీవితం వెలగాలి. రాగద్వేషాలు లేని ప్రశాంత జీవనం మీకు దక్కాలి. వెంకటేశ్వర స్వామి కృప, ఆ లక్ష్మీదేవి కరుణ మీపై ఉండాలి. మీ అనుభవాల వెలుగు ముంధు తరానికి దారి చూపాలి. ఈ శుభ సమయంలో మీ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు షష్టిపూర్తి మహోత్సవం కన్నుల పండుగగా జరిపినా మీ కుమార్తెలు ,చిటిమ్మ,భాలేశ్వరమ్మ, బాలకిష్టమ్మ, అలివేళ, మంజుల,శాంతమ్మ లకు శంకర్ గౌడ్ అభినందనలూ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోవింద్, బోయ శ్రీను, ప్రకాష్,విష్ణు, చక్రవర్తి, చాంద్ , లక్ష్మయ్య పాల్గొన్నారు