VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

అరవై ఏళ్ల కుర్మన్న జీవన ప్రయాణం వారి భాంధువులకు, కుతురులకు ఆదర్శం, స్ఫూర్తి కష్టసుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంగా నిలిచిన చిన్న కుర్మన్న దంపతులకు అభినందనలు శంకర్ గౌడ్ తెలిపారు. కుటుంబం కోసం పంచిన ప్రేమ, చూపిన ఆప్యాయత వెలకట్టలేనివి.ముగ్గురు కుతురుల కోసం కుటుంబం కోసం పడిన శ్రమ, చేసిన త్యాగం మరువలేనిది.
మీ మాటల్లోని నిజాయితీ, చేతల్లోని నిబద్ధత ఎంధరికో పాఠాలు.పిల్లలను తీర్చిదిద్ది, ఉన్నత శిఖరాలకు చేర్చిన మీకు అభినందనలు. ఇప్పుడు మనవళ్లతో, మనవరాళ్లతో ఆడుతూ పాడుతూ ఆనందించే సమయం. ఆయురారోగ్యాలతో, మనశ్శాంతితో మీ దినదినం గడవాలి. బంధుమిత్రుల మధ్య, ఆత్మీయుల నడుమ మీ జీవితం వెలగాలి. రాగద్వేషాలు లేని ప్రశాంత జీవనం మీకు దక్కాలి. వెంకటేశ్వర స్వామి కృప, ఆ లక్ష్మీదేవి కరుణ మీపై ఉండాలి. మీ అనుభవాల వెలుగు ముంధు తరానికి దారి చూపాలి. ఈ శుభ సమయంలో మీ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు షష్టిపూర్తి మహోత్సవం కన్నుల పండుగగా జరిపినా మీ కుమార్తెలు ,చిటిమ్మ,భాలేశ్వరమ్మ, బాలకిష్టమ్మ, అలివేళ, మంజుల,శాంతమ్మ లకు శంకర్ గౌడ్ అభినందనలూ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోవింద్, బోయ శ్రీను, ప్రకాష్,విష్ణు, చక్రవర్తి, చాంద్ , లక్ష్మయ్య పాల్గొన్నారు

whatsapp image 2026 05 27 at 3.50.36 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top