ఘనంగా సురవరం జయంతి ఉత్సవాలు
వనపర్తి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సురవరం.ప్రతాప్ రెడ్డి 130జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దాచ.సులోచనమ్మ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడ్డాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన గౌరవ నిరంజన్ రెడ్డి సభను ప్రారంభించారు. ముఖ్యతిదులుగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,సాగునీటి రంగనిపుణులు వి.ప్రకాష్, గన్నమరాజు.గిరిజా మనోహర్ బాబు,తంగెళ్ల.శ్రీదేవి రెడ్డి పాల్గొన్నారు. స్వాగత ఉపన్యాసకులు కె.వీరయ్య,సభా పరిచయం పలుస.శంకర్ గౌడ్ చేయగా వ్యాఖ్యాతగా బైరోజు.చంద్రశేఖర్ ఉన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి మేధావి సాహితీవేత్త న్యాయవాది తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అని అన్ని రంగాలలో నిష్ణాతులు వారని కొనియాడారు. సాగునీటి నిపుణులు ప్రకాష్ గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు సవివరంగా వివరించారు. బి.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రాథమిక హక్కులు అంశంపై మాట్లాడుతారు. మనోహర్ బాబు గారు సురవరం.ప్రతాప్ రెడ్డి గారి జీవిత విశేషాలు తెలిపారు. తంగెళ్ల.శ్రీదేవి రెడ్డి మహిళా సాధికారిత అంశంపై మాట్లాడారు. ప్రారంభం నుండి తెలంగాణ సాధించే వరకు జరిగిన పరిణామాలు కె.సి.ఆర్ హయాములో కొనసాగిన సంక్షేమం తదితర అంశాలపై స్వయంగా రాసిన వ్యాసాల కూర్పును పుస్తక రూపములో తెచ్చిన సాహితీవేత్తలు ముఖ్య అతిథుల చేత ఆవిష్కరింప చేశారు.
ఈ కార్యక్రమములో సాహితీవేత్తలు,మహిళా రచయితలు,బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
