VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఆడపడుచుకు నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా వారోత్సవాల కార్యక్రమంలో మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికై అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7 2023న ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే మొదటగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మొదటి సంతకం చేసిందన్నారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటివరకు 30.29 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ధర చెల్లించడం జరిగింది అన్నారు. ఆరోగ్య భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు పై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వము విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, అల్పాహారం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 6000 మంది కొత్త టీచర్లకు నియామకం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు జిల్లాలో రూ. 207 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి మంజూరీ చేసినట్లు చెప్పారు. ఐ.టి. టవర్, పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సి.సి రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అందుకే ఏ సంక్షేమ పథకం అయినా మహిళలే ప్రాతినిధ్యం వహించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. త్వరలో వనపర్తి మహిళలకు డీజిల్ బంక్ మంజూరు కాబోతుందని, 546 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, ప్లాట్లు లేని నిరుపేదలకు 1000 ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వానికి తాను ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా అన్ని పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ గృహ ప్రవేశానికి తన స్వంత డబ్బులతో లబ్ధిదారులకు పట్టు బట్టలు పెట్టీ గృహ ప్రవేశం చేయిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మహిళలకు సూపర్ మార్కెట్, రైస్ మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం శాసన సభ్యుల చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు రూ. 3.40 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కును, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో వనపర్తి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ కిమ్యానాయక్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరి రాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు, ఎన్ ఎస్ యు ఐ అనుబంధ సంఘాల నాయకులు, మహిళల యువకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

whatsapp image 2026 05 29 at 4.51.30 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top