ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేస్తాం: మంత్రి జూపల్లి వనపర్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు తాగు నీరు ఇచ్చేందుకు జూన్, మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా సందర్శించి సమీక్షించనున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏదుల రిజర్వాయర్ ను సందర్శించి పరిశీలించారు.వనపర్తి జిల్లా శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట శాసన సభ్యులు వంశీకృష్ణ తో కలిసి ఎదుల రిజర్వాయర్ పంప్ హౌజ్ ను సందర్శించి ప్రస్తుత స్థితిగతులు, పూర్తి అయిన పనులను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ గురించి ఇరిగేషన్ ఎస్. ఈ పార్థసారథి వివరిస్తూ (5) స్టేజిలలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు పారుతున్న నీటిని ఎత్తిపోతల ద్వారా నార్లపూర్ (అంజనగిరి) రిజర్వాయర్ లో నింపి అక్కడి నుండి ఎత్తిపోసి 6.55 టి.యం.సి. ల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఎదుల రిజర్వాయర్ నింపడం జరుగుతుందన్నారు. ఎదుల రిజర్వాయర్ నుండి వట్టేం, ఉదండపూర్, కే.పి. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ల ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. ఎదుల సర్జిపుల్ నుండి 134 మీటర్ల ఎత్తున ఉన్న రిజర్వాయర్ నింపడానికి 10 మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందని, రోజుకు రెండు టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కో పంపు 1.45 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. సంవత్సరంలో 45 రోజుల పాటు 90 టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. మోటారు పంపుల సామర్థ్యం, వాటి ధర, మన్నిక తదితర విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు చెప్పారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, వనపర్తి జిల్లా ఎస్పీ సునితా రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్, ఇరిగేషన్ ఎస్.ఈ పార్థసారథి, కార్యనిర్వహక ఇంజనీర్లు అమర్ సింగ్, రవీందర్, శ్రీనివాస్, వనపర్తి ఆర్డీఓ సుబ్రమణ్యం, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సిలాల్ తదితరులు ఉన్నారు.
Uncategorized
రాబందుల రాజ్యం మనకొద్దు ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కేంద్ర బిజెపి సర్కార్ మొదటి భోగిలో మోదీ రెండో భోగిలో ఆదాని అంబానీ లాంటి వారు ప్రయాణిస్తూ దేశాన్ని రాబందుల పిక్కుతింటున్నారని ఈ డబల్ ఇంజన్ సర్కారుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి, శివసేనరెడ్డి లు వనపర్తి లో ఎద్దుల బండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంధనంపై పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గంటలు మోగిస్తే చప్పట్లు కొట్టినంత మాత్రాన నిరుపేదల సమస్యలు తీరవని, ప్రజలకు అధిక భారం లేకుండా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అధిక ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వనపర్తి లో ధర్నాలు చేయడం సరికాదని బాధ్యత యుతంగా వ్యవహరించి మోడీ ఇంటి ముందల ధర్నాలు చేసి రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మాయమాటలు చెప్పే అధికారులకు వచ్చిన మోడీ సర్కార్ ఇప్పటికే మూడు పర్యాయాలు ఏడున్నర రూపాయలను పెట్రోల్ డీజిల్ పై పెంచిందని పేర్కొన్నారు. మోడీ సర్కార్ ఇంధనం ధరలను వెంటనే తగ్గించకపోతే జిల్లా మండల గ్రామస్థాయిలోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి మెడలు వంచాల్సి వస్తుంది అన్నారు. టిఆర్ఎస్ బిజెపి పార్టీలు మంచి దోస్తాన్ మైంటైన్ చేస్తున్నాయని వారి కార్యకలాపాలు నిరసిస్తూ మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. దేశంలోని 19 రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వమే ఉందని మరి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ నిలదీశారు. వడ్ల కొనుగోలు నీతులు చెప్పే నాయకులు వడ్ల కష్టాలు పెంచడానికి మీరు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వాస్తవం కాదా అన్నారు. ఎఫ్ సి ఐ లకు, గోదాములకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా పైపెచ్చు ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. వారి నిరంకుష పాలనను నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి నరేంద్ర మోడీ సర్కార్ను ముట్టడించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే ఇంజన్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని రానున్న రోజుల్లో కేంద్రంలోనూ రాహుల్ గాంధీ మరో ఇంజన్ గా మారతారని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వనపర్తి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్దయించిన పాల్గొన్నారు
వివాహ కార్యక్రమానికి హాజరై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పానగల్ మండలంలో వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దిలేటి – చిట్టెమ్మ గార్ల కుమార్తె నికిత – విజయ్ ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖశాంతులతో, ఆనందంగా, ఐశ్వర్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట చందాపూర్ గ్రామ సర్పంచ్ మహేందర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మల్లయ్య. సత్యనారాయణ. కృష్ణయ్య. నరేందర్. మల్లయ్య,స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 53 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆరు దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి గారిని కలిసిన ఎమ్మెల్యే వనపర్తి కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు ని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చాంబర్లో సోమవారం మంత్రి శ్రీహరి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఇందిరా మహిళా శక్తితో మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదగాలి వనపర్తి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి, ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం రేవంత్ ఆశయమని మహిళలు దిశగా ముందుకెళ్లాలని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొత్తకోట మండలం విలియం కొండ గ్రామ శివారులోని ఫంక్షన్ హాల్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో కొత్తకోట మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అదేవిధంగా ఇద్దరు లబ్ధిదారులకు షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి, ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం రేవంత్ ఆశయమని మహిళలు దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలని కోటీశ్వరుని చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను, బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాల సభ్యురాళ్లకు ప్రమాద బీమా, 200 యూనిట్ల ఉచిత కరెంటు సహా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో పాఠశాలల్లో విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేయనుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నేడు మీరాశి పల్లి గ్రామ శివారులో మహిళా సంఘాల ద్వారా ఎకరా స్థలంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో పెట్రోల్ బంకు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కొత్తకోట మదనాపూర్ మండలం మహిళా సమాఖ్యల ద్వారా రెండు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి నడపడం జరుగుతుందని వాటికి ఈ రోజే ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో కొత్తకోట మదనాపూర్ మండలాల సమాఖ్యల ద్వారా రెండు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో నడపడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాకుండా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు అనేక ఉపాధి వ్యాపార అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు. ఏదైనా వ్యాపారంపై ఆసక్తి కలిగిన మహిళలు ఉంటే వారు ముందుకు వస్తే ప్రభుత్వం శిక్షణ ఇప్పించి వ్యాపారం పెట్టించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సునీత పల్లవి, డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారులదే బాధ్యత.. తరుగు లేకుండా తడిసిన ప్రతి గింజ కొనేదాకా పోరాటం : సిపిఐ వనపర్తి వనపర్తి జిల్లా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడిచేందుకు అధికారులే బాధ్యులని, తడిసిన ప్రతి గింజ కొనేదాకా రైతుల పక్షాన పోరాడుతామని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ హెచ్చరించారు. ఆదివారం వనపర్తి మండలం చిట్యాల మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. మాట్లాడుతూ.. మార్కెట్లో 35 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి లారీలు రాక నిల్వ ఉంచారన్నారు. సుమారు 6000 బస్తాల ధాన్యం ఇంకా తూకం వేయాల్సి ఉందన్నారు. రాత్రి వర్షానికి వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు తడిసాయని, కాంటావెయ్యని సుమారు 6000 బస్తాల ధాన్యం రాశుల కిందకు నీళ్లు వచ్చి తడిసి పాడయ్యారు. 15 రోజుల క్రితమే 35,000 బస్తాలను తూకం వేసినా తరలించడంలో అధికారుల జాప్యం వల్లే రాత్రి వానకు వడ్లు తడిచాయని అందుకు పూర్తిగా అధికారులే బాధ్యులన్నారు. తడిసిన ధాన్యం ప్రతి గింజ తరుగు లేకుండా కొనాల్సిందేనని, తరలింపులో అధికారుల రైతులకు నష్టం చేస్తామంటే సహించేది లేదన్నారు. మార్కెట్ యార్డు మైదానం పలుచోట్ల పల్లంగా ఉందని వర్షం వచ్చిన ప్రతిసారి నీరు నిలుస్తుంది అన్నారు. పల్లంలో ఉన్న సంచులే అధికంగా రాత్రి వర్షానికి తడి సాయి అన్నారు. మార్కెట్ యార్డ్ మైదానం సమాంతరం చేయాలని గత సంవత్సరం కూడా కోరామని అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. చిట్యాల మార్కెట్ యార్డులో ఒకే చోట ఐదు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని వీటిని పిఎసిఎస్ ఐకెపి మెప్మా నిర్వహిస్తున్నాయన్నారు. కేంద్రాలకు స్థలాలు వేరువేరుగా లేకపోవడంతో ఒకేచోట రైతులు ఒకే చోట ధాన్యం పోస్తున్నారని, ధాన్యం కొనమంటే ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకుంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల సీనియార్టీ పాటించాలన్నారు.మార్కెట్కు ధాన్యంతెచ్చిన రైతుల సీనియార్టీ జాబితాను సిద్ధం చేసి, సీనియార్టీ ప్రకారం ధాన్యం కాంటా వేయాలనిడిమాండ్ చేశారు. హమాలీలు నిర్వాహకులు తమకు ఇష్టమైన వారి ధాన్యం ఆలస్యంగా తెచ్చిన ముందుగా కాంటా వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. హమాలీల కొరత కూడా ఉండటం కూడా కారణమన్నారు చీమనగుంటపల్లి తాండ రైతుల ధాన్యం ఈనెల మూడవ తేదీన 14% తేమ వచ్చిన ఇంతవరకు కాంటావెయ్యలేదని. వారం రోజు తెచ్చిన వారి ధాన్యం కాంటా వేశారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు అన్నారు. మార్కెట్ యార్డులో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి లేదన్నారు. మరుగుదొడ్లున్న నీళ్లు లేక దుర్వాసన కొడుతున్నాయని మహిళలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే బాగు చేయాలన్నారు. రైతుల సమస్యలు తీరేవరకు సిపిఐ పోరాడుతుందన్నారు. సిపిఐ నాయకులు శేఖర్, వంశీ రైతులు పాల్గొన్నారు.
సురవరం జయంతిని విజయవంతం చేయండి పెబ్బేరు ఈ నెల 28న వనపర్తిలో “సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతిని విజయవంతం చేయాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పెబ్బేరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాహితీవేత్తగా,పత్రికా సంపాదకుడిగా,న్యాయవాదిగా,ప్రజా నాయకుడిగా తెలంగాణ ప్రాంతానికి ప్రతాపరెడ్డి విషయమైన సేవలందించారని అన్నారు.వనపర్తి నియోజకవర్గ మొట్ట మొదటి శాసన సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని శంకర్ గౌడ్ గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వక్తలుగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రావుల చంద్రశేఖర్ రెడ్డి,ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు,శ్రీధర్ రావు దేశ్పాండే, వి.ప్రకాష్,డా.జయంతి,డా.తంగెళ్ల శ్రీదేవి రెడ్డి,డా.కి.వీరయ్య తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఎల్.ఉమా మహేశ్వర్,రామచందర్ జీ,మొయినుద్దీన్,ఈశ్వర్ రెడ్డి,బత్తుల మురళీధర్ గౌడ్,విజయ్,చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కి ఆదివారం మర్రికుంట లోని ఆయన సమాధి దగ్గర అఖిలపక్ష ఐక్యవేదిక, టిడిపి, డీ.ఎస్.పి, బి.ఎస్.పి, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ , ప్రజా సంఘాల నాయకులుచే ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు డా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గాన్ని నీతివంతంగా అభివృద్ధి చేసిన నాయకుడు జయరాములు ని వనపర్తికి పాలకేంద్రం, కోర్టు, బస్టాండు సాధించిన వ్యక్తి జయరాములు గారిని, వనపర్తికి డిగ్రీ కళాశాల స్థాపించి విద్యాపర్తి చేసిన వ్యక్తిగా రికార్డ్ సాధించాడని కొనియాడారు. ముఖ్య అతిథులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రాష్ట్ర కార్యదర్శి రాము యాదవ్, డీఎస్పీ అధ్యక్షుడు రామకృష్ణ మహారాజ్, టిడిపి నాయకులు ఆవుల శీను, చిన్నయ్యా యాదవ్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్, కిరణ్ కుమార్, బీఎస్పీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మైబూస్, గంధం నాగరాజు, దేవన్న నాయుడు తదితరులు జయ రాములు గారి గురించి మాట్లాడిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో జయ రాములు గారి కుటుంబ సభ్యులు, వనపర్తి నియోజకవర్గం బీసీ నాయకులు చీర్ల చందర్, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, కాంగ్రెస్ నాయకులు బొంబాయి బాలకొండయ్య, సమద్, వెంకటేశ్వర్లు, టిడిపి పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య, యాదవ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి గురు రాజ్ యాదవ్, విజేత రాములు, గంధం బాలరాజు, p.et మురళి , శివకుమార్, నాగరాజు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం వనపర్తి వనపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి 130 జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా,వైభవంగా నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జయంతి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సురవరం గారి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం అని అదొక చరిత్ర అని భావితరాలు ఆ తెలంగాణ వైతాళికుడు బహుముఖ ప్రజ్ఞా శాలి జీవిత విశేషాలు తెలుసుకోవలసిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. విద్యావేత్తలు,సాహితీవేత్తలు,మేధావులు,ప్రజా సంఘాలు,వివిధ పార్టీల శ్రేణులు,కవులు,కళాకారులు,సామాజిక విశ్లేషకులు ప్రత్యేకంగా పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో డాక్టర్.వీరయ్య,శంకర్ గౌడ్,తిరుమలేశ్,పార్టీ నాయకులు పాల్గొన్నారు.